IPL 2025 MI VS GT Eliminator Weather Report : ఎలిమినేటర్ రద్దయితే ఎలా..? ఎవరు ముందంజ వేస్తారు..? నిబంధనలు ఏం చేప్తున్నాయి..? వెదర్ రిపోర్ట్ అప్డేట్
ఎలిమినేటర్ లో ఓడిన టీం టోర్నీ నుంచి ఔటవుతుంది.ముల్లన్ పూర్లో శుక్రవారం ముంబై, గుజరాత్ ఎలిమినేటర్ మ్యాచ్ ఆడుతున్నాయి. ఈ మ్యాచ్ లో గెలిచిన టీం క్వాలిఫయర్ 2కి క్వాలిఫై అయ్యి, పంజాబ్ తో ఆడుతుంది.

IPL 2025 MI VS GT Updates: ఐపీఎల్ లో శుక్రవారం మరో ప్లే ఆఫ్ మ్యాచ్ జరుగుతుంది. ఇది వర్చువల్ నాకౌట్ కావడం విశేషం. ఇందులో ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. అందుకే దీనిపేరును ఎలిమినేటర్ పేరుతో నిర్వహిస్తున్నారు. ఈ మ్యాచ్ పంజాబ్ లోని ముల్లన్ పూర్ లో జరుగుతుంది. మాజీ చాంపియన్లు గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ ఈ మ్యాచ్ లో తలపడనున్నాయి. లీగ్ దశలో అద్భుత ప్రదర్శనతో టాప్ -4లో నిలిచిన ఈ జట్లు.. టాప్ -2లో నిలవక పోవడంతో ఎలిమినేటర్ మ్యాచ్ ఆడనున్నాయి. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు జూన్ 1న అహ్మదాబాద్ లో జరిగే క్వాలిఫయర్ 2లో పంజాబ్ కింగ్స్ తో తలపడుతుంది. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు అదే వేదికపై జూన్ 3న జరిగే ఫైనల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో తలపడుతుంది. ఇక గురువారం జరిగిన క్వాలిఫయర్ 1లో పంజాబ్ కింగ్స్ పై ఎనిమిది వికెట్లతో ఆర్సీబీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.
🎟️ One ticket left. ⚔️ Two champions collide.
— Professional (@ThakurPrateet) May 30, 2025
Only one will survive, Gujarat Titans take on Mumbai Indians in a high-voltage Eliminator clash! 🔥#MIvsGT #GTvMI #MIvGT #GTvsMI #Eliminator #iplsuspended #IPLPlayoffs #IPLFinals #IPLOnJioStar #indiancricketteam #indiancricket pic.twitter.com/A4P9yKD8m6
వర్షం ముప్పు..!
ఈ మ్యాచ్ కి వరణుడి అడ్డంకి ఏదీ లేనట్లు తెలుస్తుంది. వాతావరణ శాఖ నివేదిక ప్రకారం చిరుజల్లులు కురిసే అవకాశం ఉందని సమాచారం. అయితే అది మ్యాచ్ ను ప్రభావితం చేసే అవకాశం లేదని తెలుస్తోంది. అలాగే ఉష్ణోగ్రతలు 25-37 డిగ్రీ సెల్సియస్ మధ్య ఉండనున్నాయి. ఇక ఈ మ్యాచ్ లో అనుకోకుండా వర్షం కారణంగా మ్యాచ్ రద్దయ్యే పక్షంలో రిజర్వే డే లేదు. దీంతో గుజరాత్ టైటాన్స్ నేరుగా క్వాలిఫయర్ 2కి అర్హత సాధించే అవకాశముంది. పాయింట్ల పట్టికలో ముంబై 17, గుజరాత్ 18 పాయింట్లతో నిలవడంతో టైటాన్స్ 3వ స్థానాన్ని పొందింది. దీంతో పట్టికలో ముందంజలో ఉన్న జట్టు.. ప్లే ఆఫ్ రద్దైన పక్షంలో ముందడుగు వేస్తుంది. అయితే ఈ మ్యాచ్ కు అలాంటి భయాలేవి ఉన్నట్లు కన్పించడం లేదు.
ఆఖర్లో దెబ్బ..
నిజానికి టోర్నీలో అద్భుత ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో టాప్ లో నిలిచి ముంబై, గుజరాత్ లకి ఆఖర్లో షాక్ తగిలింది. గుజరాత్ ఆడిన చివరి రెండు మ్యాచ్ ల్లో ఓడిపోయి 18 పాయింట్లతో 3వ స్థానానికి పరిమితం కాగా, ముంబై కూడా ఆఖరి మూడింటిలో రెండు మ్యాచ్ ల్లో ఓడిపోయి 17 పాయింట్లతో నిలిచి, టాప్-4 స్థానాన్ని దక్కించుకుంది. ఇక ఎలిమినేటర్ మ్యాచ్ లో సత్తా చాటి క్వాలిఫయర్ 2కి అర్హత సాధించాలని ఇరుజట్లు ఉవ్విళ్లూరుతున్నాయి. క్వాలిఫయర్ 1 జరిగిన వేదికపైనే మ్యాచ్ జరుగుతుండటంతో మ్యాచ్ కాస్త స్వింగ్ కు అనుకూలించే అవకాశముంది. దీంతో ఇది ముంబైకి సానుకూలాంశం కానుంది. ఆ జట్టులో శార్దూల్ ఠాకూర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా లాంటి మేటి బౌలర్లు ఉండటంలోపాటు మిషెల్ శాంట్నర్ లాంటి అద్భుత స్పిన్నర్ ఉన్నాడు. దీంతో ఈ మ్యాచ్ లో విజయంపై కన్నేసింది. ఇక టోర్నీలో టాప్ -3 బ్యాటర్లు శుభమాన్ గిల్, సాయి సుదర్శన్, జోస్ బట్లర్ పై ఆధారపడిన గుజరాత్ కు ఆల్రెడీ షాక్ తగిలింది. నేషనల్ టీమ్ కు ఆడాలని బట్లర్ టీమ్ ను వదిలి వెళ్లిపోవడంతో జీటీ కాస్త బలహీన పడింది. ఏదేమైనా ఈ ప్లే ఆఫ్ మ్యాచ్ మరింత పసందుగా జరగాలని క్రికెట్ ప్రేమికులు కోరుకుంటున్నారు.




















