Preity Zinta Heartbroken Reaction: పంజాబ్ కింగ్స్ దారుణ ప్రదర్శన చూసి ప్రీతి జింటా గుండె పగిలింది! ఆమె రియక్షన్ వైరల్
RCB vs PBKS In IPL 2025 | ఐపీఎల్ 2025 ప్లేఆఫ్స్ లో భాగంగా జరిగిన క్వాలిఫయర్ 1 మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ పై ఆర్సీబీ విజయం సాధించింది. కానీ ఈ మ్యాచ్‌లో ప్రీతి జింటా రియాక్షన్ వైరల్ గా మారింది.

PBKS vs RCB Qualifier-1: ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్వాలిఫైయర్-1లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు పంజాబ్ కింగ్స్‌పై 8 వికెట్ల తేడాతో విజయం సాధించి నేరుగా ఫైనల్‌కు దూసుకెళ్లింది. ముల్లంపూర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో పంజాబ్ బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. లీగ్ దశలో రాణించిన బ్యాటర్లు, కీలకమైన క్వాలిఫయర్ 1లో నిరాశపరచడంతో జట్టుకు భారీ ఓటమి తప్పలేదు. దీంతో పంజాబ్ కింగ్స్ కో-ఓనర్ ప్రీతి జింటా చాలా నిరాశకు లోనయ్యారు. ఆమె రియాక్షన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
టాస్ గెలిచి RCB కెప్టెన్ రజత్ పాటిదార్ ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయం తీసుకున్నాడు. పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్‌లో పవర్ ప్లేలోనే దాదాపు ముగిసింది. పవర్ ప్లేలో ప్రియాన్ష్ ఆర్య (7), ప్రభ్ సిమ్రన్ సింగ్ (18), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (2) పెవిలియన్ చేరుకున్నారు. జోష్ ఇంగ్లీష్‌ను జోష్ హేజెల్‌వుడ్ ఔట్ చేశాడు దాంతో 38 పరుగులకు పంజాబ్ పవర్ ప్లేలోనే నాలుగో వికెట్ సైతం కోల్పోయింది. పంజాబ్ ఏ దశలోనూ కోలుకోలేదు.
ఆ తర్వాత నేహాల్ వధేరా (8), శశాంక్ సింగ్ (3) సైతం తమ వికెట్లు సమర్పించుకున్నారు. ఈ పరిస్థితుల్లో పంజాబ్ కింగ్స్ ముషీర్ ఖాన్‌ను ఇంపాక్ట్ ప్లేయర్‌గా దించింది. కానీ తను ఖాతా తెరవకుండానే డకౌటై వెనుదిరిగాడు. మార్కస్ స్టోయినిస్ (26), అజ్మతుల్లా ఒమర్‌జై (18) కొద్దిసేపు పరుగులు చేసేందుకు ప్రయత్నంచారు. ఆర్సీబీ స్పిన్నర్ సుయాష్ శర్మ వేసి బంతిని అంచా వేయలేకపోవడంతో స్టోయినిస్ బౌల్డ్ అయ్యాడు. దాంతో పంజాబ్ పరిస్థితి మరింత ఘోరంగా తయారైంది. అతికష్టమ్మీద పంజాబ్ స్కోరు 100 దాటించారు. క్వాలిఫైయర్ లాంటి పెద్ద మ్యాచ్‌లో పంజాబ్ జట్టు కేవలం 101 పరుగులకు ఆలౌట్ అయింది. తద్వారా క్వాలిఫయర్, నాకౌట్ లాంటి కీలక మ్యాచ్ లలో అత్యల్ప స్కోరులో నాలుగో స్థానంలో పంజాబ్ నిలిచింది.
ప్రీతి జింటా నిరాశ
ఈ సీజన్‌లో జట్టు విజయాలు చూసి ప్రీతి జింటా మురిసిపోయారు. ప్రతి మ్యాచ్‌లో స్టేడియంలో కనిపించిన ఆమె చాలా సంతోషంగా కనిపించారు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో పంజాబ్ కీలక విజయాలు సాధించి, అనూహ్యంగా 10 ఏళ్ల తరువాత క్వాలిఫయర్స్ కు, 11 ఏళ్లకు క్వాలిఫయర్ 1కు చేరింది. కానీ క్వాలిఫైయర్-1లో వీరి ఆట చూస్తే.. పాయింట్స్ టేబుల్ టాపర్‌గా జట్టు ప్రదర్శనలా ఎవరికీ అనిపించలేదు. ఈ మ్యాచ్‌లో కెమెరామ్యాన్ ప్రీతి జింటాను పలుమార్లు చూపించగా, జట్టు ప్రదర్శనతో ఆమె ఎంతో నిరాశ చెందినట్లు స్పష్టంగా కనిపించింది.
Feeling happy for RCB but sad for Preity Zinta 🥺 pic.twitter.com/AGz7fzFrFY
— Sunanda Roy 👑 (@SaffronSunanda) May 29, 2025
సుయష్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు
పవర్ ప్లే తర్వాత సుయష్ శర్మ బౌలింగ్ చేయడానికి రెడీ అయ్యడు. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ అతడి నుంచి బాల్ తీసుకుని తిరిగి యశ్ దయాల్‌కు మరో ఓవర్ ఇచ్చాడు. సుయష్ శర్మకు తర్వాత 9వ ఓవర్ ఇచ్చారు. ఈ ఓవర్‌లో అతను 2 కీలక వికెట్లు తీశాడు. అతను రెండవ బంతికి శశాంక్ సింగ్ (3)ని బౌల్డ్ చేసి, ఐదవ బంతికి ముషీర్ ఖాన్ (0)ని ఎల్బీడబ్ల్యూ చేశాడు. తన తరువాతి ఓవర్‌లో మార్కస్ స్టోయినిస్ (26)ని కూడా బౌల్డ్ చేశాడు. సుయష్ శర్మ 3 ఓవర్లలో 17 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. హేజెల్‌వుడ్ 3 ,యశ్ దయాల్ 2 వికెట్లు తీశారు.
102 పరుగుల లక్ష్యాన్ని RCB 10 ఓవర్లలో ఛేదించి నాలుగోసారి ఐపీఎల్ ఫైనల్ చేరుకుంది. ఫిల్ సాల్ట్ 56 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.





















