అన్వేషించండి

IPL 2024: టాస్‌ గెలిచిన ఢిల్లీ, బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్‌

GT vs DC : ఐపీఎల్‌ 17 సీజన్‌లో భాగంగా గుజరాత్‌తో ఢిల్లీతో తలపడనుంది. ఢిల్లీ కెప్టెన్ రిషభ్‌ పంత్ టాస్‌ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు.

GT vs DC IPL 2024  Delhi Capitals opt to bowl: ఐపీఎల్‌(IPL)లో  అహ్మదాబాద్‌ వేదికగా గుజరాత్‌ టైటాన్స్‌(GT)తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్‌(DC) బౌలింగ్‌ ఎంచుకుంది. పిచ్‌ బౌలింగ్‌కు సహకరిస్తుందన్న అంచనాలు ఉన్న వేళ టాస్‌ గెలిచిన ఢిల్లీ... గుజరాత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. గుజరాత్‌ను తక్కువ పరుగులకే కట్టడి చేయాలని ఢిల్లీ భావిస్తోంది. పాయింట్ల పట్టికలో ఆరు స్థానంలో ఉన్న గుజరాత్‌ టైటాన్స్‌తో...తొమ్మిదో స్థానంలో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. ఇప్పటివరకూ ఆరు మ్యాచ్‌లు అడిన గుజరాత్‌ మూడు విజయాలు, మూడు పరాజయాలతో ఆరు స్థానంలో ఉంది. ఇప్పటివరకూ ఆరు మ్యాచ్‌లే ఆడిన ఢిల్లీ క్యాపిటల్స్‌ కేవలం రెండు మ్యాచుల్లో విజయం సాధించి..నాలుగు మ్యాచుల్లో పరాజయం పాలైంది. దీంతో ఇరు జట్లకు ఈ మ్యాచ్‌ చాలా కీలకంగా మారింది. ఈ మ్యాచ్‌లో గెలిచి ప్లే ఆఫ్‌ రేసులో మరింత ముందుకు వెళ్లాలని గుజరాత్‌ భావిస్తుండగా.. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి ప్లే ఆఫ్‌ రేసులో నిలవాలని ఢిల్లీ జట్టు పట్టుదలగా ఉంది. రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చివరి బంతికి విజయం సాధించిన గుజరాత్‌.. ఆత్మ విశ్వాసంతో బరిలోకి దిగనుంది.

లోపాలను సరిదిద్దుకుంటేనే..
ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగే మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ సమస్యలన్నింటికీ చెక్‌ పెట్టాలని చూస్తోంది. విజయాలు సాధిస్తున్నా టైటాన్స్ ఇంకా పూర్తిగా గాడినపడినట్లు కనిపించడం లేదు. రాజస్థాన్ రాయల్స్‌పై చివరి బంతికి విజయం సాధించడం టైటాన్స్‌కు కాస్త ఊరట కలిగించింది. మరోవైపు ఢిల్లీ మొదటి ఆరు మ్యాచుల్లో కేవలం కేవలం రెండు విజయాలను మాత్రమే సాధించింది. లీగ్‌ల్లో ఇంకో ఎనిమిది మ్యాచ్‌లు మిగిలి ఉన్న వేళ ఇరు జట్లు లోపాలను సవరించుకుని గాడిన పడాలని చూస్తున్నాయి. మహ్మద్ షమీ లేకపోవడం గుజరాత్‌ బౌలింగ్ విభాగాన్ని ఆందోళన పరుస్తోంది. ఉమేష్ యాదవ్ వికెట్లు తీస్తున్నా భారీగా పరుగులు ఇచ్చేస్తుండడం గుజరాత్‌ మేనేజ్‌మెంట్‌ను ఆందోళన పరుస్తోంది. స్పెన్సర్ జాన్సన్, మోహిత్ శర్మ కూడా అంచనాలను అందుకోలేకపోతున్నారు. స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ చాలా పొదుపుగా బౌలింగ్‌ చేస్తూ గుజరాత్‌ అమ్ములపొదిలో ప్రధాన అస్త్రంగా మారాడు. రషీద్‌ బ్యాట్‌తోనూ రాణిస్తున్నాడు. రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో చివరి బంతికి బౌండరీ కొట్టి గుజరాత్‌కు కీలకమైన విజయాన్ని అందించాడు. 

ఢిల్లీ జట్టులో కష్టాలు
ఫామ్, ఫిట్‌నెస్ సమస్యల కారణంగా ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయింగ్ లెవన్‌ని ఎంచుకోవడంలో ఇబ్బంది పడుతోంది. గత మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌పై విజయం ఢిల్లీలో ఆత్మ విశ్వాసాన్ని పెంచింది. కానీ ఢిల్లీ ప్లే ఆఫ్‌కు చేరాలంటే జట్టులో ఇంకా సమతుల్యత రావాల్సి ఉంది. లక్నోతో జరిగిన మ్యాచ్‌లో అద్భుత బౌలింగ్‌తో ఆకట్టుకున్న కుల్‌దీప్‌ యాదవ్‌ మరోసారి కీలకంగా మారనున్నాడు. గత మ్యాచ్‌లో మెరుపులు మెరిపించిన మెక్‌గుర్క్‌పై ఢిల్లీ భారీ ఆశలు పెట్టుకుంది. ఢిల్లీ బౌలింగ్‌ కూడా కాస్త బలహీనంగానే కనిపిస్తోంది. ముఖేష్ కుమార్ గత అయిదు మ్యాచుల్లో ఓవర్‌కు 10 పరుగులు ఇచ్చాడు. కెప్టెన్ రిషబ్ పంత్ మెరుగ్గా రాణిస్తుండడం ఆ జట్టుకు బలంగా మారింది. డేవిడ్ వార్నర్ కూడా గాడినపడితే ఢిల్లీకి బ్యాటింగ్‌లో పెద్దగా ఇబ్బందులు ఉండవు. 

హెడ్‌ టు హెడ్‌ రికార్డులు
గుజరాత్-ఢిల్లీ ఇప్పటివరకు ఐపీఎల్‌ మూడుసార్లు తలపడ్డాయి. ఇందులో గుజరాత్‌ రెండు మ్యాచుల్లో విజయం సాధించగా.. ఢిల్లీ ఒక మ్యాచ్‌లో విజయం సాధించింది. ఇప్పటివరకు ఢిల్లీ క్యాపిటల్స్‌పై గుజరాత్ అత్యధిక స్కోరు 171. గుజరాత్‌పై ఢిల్లీ అత్యధిక స్కోరు 162. ఈ మ్యాచ్‌ల్లో శుభ్‌మన్ గిల్ 104 పరుగులు చేయగా, మహ్మద్ షమీ (9), రషీద్ ఖాన్ (5) ఎక్కువ వికెట్లు తీశారు.

టాప్ హెడ్ లైన్స్

Kakinada AE Nookaraju Family Suicide Case: కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!

వీడియోలు

Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kakinada AE Nookaraju Family Suicide Case: కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
LPG to PNG Shift: LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
NTR Trivikram Movie Title: గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
Prabhas: ప్రభాస్ 'స్పిరిట్' వాయిదా? 'ఫౌజీ'కి నెట్‌ఫ్లిక్స్ డెడ్‌లైన్!?
ప్రభాస్ 'స్పిరిట్' వాయిదా? 'ఫౌజీ'కి నెట్‌ఫ్లిక్స్ డెడ్‌లైన్!?
Embed widget