అన్వేషించండి

IPL 2024: కోల్‌కతా విజయాల వెనుక మాస్టర్ మైండ్ - చావగొట్టి చెవులుమూస్తున్న గంభీర్

KKR : గతేడాది వరకూ లక్నో సూపర్ జెయింట్స్‌తో కలిసి పని చేసిన గంభీర్.. ఈ సీజన్‌కు తనకిష్టమైన కోల్‌కతా టీమ్‌కు తిరిగి వచ్చేశాడు.

IPL 2024: క్రికెట్ పిచ్చోడు. గంభీర్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఈ పదమే కరెక్ట్. గెలవాలన్నా కసి,అవతలి వాడు ఎవడనేది లెక్కపెట్టని తత్వం ఇలాంటి లక్షణాలెన్నో గంభీర్ టీమిండియాకు అత్యుత్తమ ఓపెనర్ అయ్యేలా చేశాయి. ఐపీఎల్‌లో కోల్‌కతాకు రెండు ట్రోఫీలు తెచ్చిపెట్టాయి. ఆటగాడిగా క్రికెట్‌కు దూరమైనా అపర చాణక్యుడిలా వ్యూహాలతో కోల్‌కతాను ఇప్పుడు విజయాలతో దూసుకెళ్లేలా చేస్తున్నాడు గంభీర్.

Image

Image

గతేడాది వరకూ లక్నో సూపర్ జెయింట్స్‌తో కలిసి పని చేసిన గంభీర్.. ఈ సీజన్‌కు తనకిష్టమైన కోల్‌కతా టీమ్‌కు తిరిగి వచ్చేశాడు. షారూఖ్ గంభీర్‌కు మెంటార్ బాధ్యతలను అప్పగించాడు. వస్తూ వస్తూనే తన మార్క్ చూపించిన గౌతీ బౌలింగ్ ఆల్ రౌండర్ నరైన్‌ను ఓపెనర్‌గా పంపించాలనే టాక్టిక్‌ను అమలు చేశాడు. గతంలో గంభీర్ కోల్‌కతాలో ఉన్నప్పుడు సక్సెస్ అయిన నరైన్‌ది ఓపెనర్ ఫార్మూలాను మళ్లీ తన రాకతోనే మొదలుపెట్టాడు. ఫలితం కోల్‌కతాకు అద్భుతమైన ఆరంభాలు ఇస్తున్నాడు కరీబియన్ ఆటగాడు సునీల్ నరైన్. 

Image

మూడేళ్లుగా బ్యాటర్‌గా విఫలమవుతున్న నరైన్ ఈసారి మాత్రం ఓపెనర్‌గా చెలరేగిపోతున్నాడు. ఆడిన మూడు మ్యాచుల్లో 134 పరుగులు చేశాడు. నిన్న జరిగిన ఢిల్లీ మ్యాచ్‌లో అత్యధికంగా 85 పరుగులు చేసి తన కెరీర్ బెస్ట్ నమోదు చేశాడు. మూడు మ్యాచుల్లో 12 సిక్సులు బాదిన నరైన్... బౌలర్ ఎవరనేది చూడకుండా పవర్ ప్లేల్లో తన పించ్ హిట్టింగ్‌తో భారీ స్కోర్లు సాధించేలా టీమ్‌కి కావాల్సిన బూస్టింగ్ ఇస్తున్నాడు. ఫలితమే నిన్న ఢిల్లీపై కోల్‌కతా సాధించిన 272పరుగుల భారీ స్కోరు. తృటిలో మిస్సైంది కానీ లేదంటే సన్ రైజర్స్ కొట్టిన 277 పరుగుల అత్యధిక పరుగుల రికార్డు కూడా బద్ధలయ్యేదే. 

Image

ఈ మార్పునే కాదు టీనేజ్ కుర్రాడు రఘువంశీని వన్ డౌన్ ఆడించాలని బౌలింగ్ కోసం వైభవ్ అరోరాను తీసుకోవటం ఇలా తనదైన శైలిలో టీమ్ కూర్పులో భాగం అవుతూ గంభీర్ తన మాస్టర్ మైండ్ ఏంటో నిరూపించుకుంటున్నాడు. అవతలివైపు పాంటింగ్, గంగూలీ లాంటి లెజండ్స్ ఉన్నా... అగ్రెసివ్ డెసిషన్స్ తో తన మార్క్ చూపిస్తున్నాడు గంభీర్.

Image

టాప్ హెడ్ లైన్స్

సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Pooja Murthy: బుల్లితెర గుండమ్మ పూజా మూర్తి.. అప్పుడు బాడీ షేమింగ్.. ఇప్పుడు లీడ్ రోల్‌లో అదుర్స్!
బుల్లితెర గుండమ్మ పూజా మూర్తి.. అప్పుడు బాడీ షేమింగ్.. ఇప్పుడు లీడ్ రోల్‌లో అదుర్స్!

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Pooja Murthy: బుల్లితెర గుండమ్మ పూజా మూర్తి.. అప్పుడు బాడీ షేమింగ్.. ఇప్పుడు లీడ్ రోల్‌లో అదుర్స్!
బుల్లితెర గుండమ్మ పూజా మూర్తి.. అప్పుడు బాడీ షేమింగ్.. ఇప్పుడు లీడ్ రోల్‌లో అదుర్స్!
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
Embed widget