DC vs PBKS, IPL 2022 LIVE: దిల్లీ అంటే ఇదీ! వార్నర్, షా ఊచకోతతో 10.3 ఓవర్లకే పంజాబ్‌పై విక్టరీ
DC vs PBKS, IPL 2022 LIVE:ఐపీఎల్ 2022లో 32వ మ్యాచులో దిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ తలపడుతున్నాయి. బ్రబౌర్న్ స్టేడియం ఇందుకు వేదిక. ఈ మ్యాచులో విజయం సాధించాలని రెండు జట్లు పట్టుదలగా ఉన్నాయి.

Background
DC vs PBKS, IPL 2022 LIVE:ఐపీఎల్ 2022లో 32వ మ్యాచులో దిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ తలపడుతున్నాయి. బ్రబౌర్న్ స్టేడియం ఇందుకు వేదిక. ఈ మ్యాచులో విజయం సాధించాలని రెండు జట్లు పట్టుదలగా ఉన్నాయి.
DC vs PBKS, IPL 2022 LIVE: టాస్ గెలిచిన దిల్లీ: ఫీల్డింగ్ ఎంచుకున్న రిషభ్
పంజాబ్ కింగ్స్‌తో మ్యాచులో దిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచింది. వెంటనే ఆ జట్టు కెప్టెన్ రిషభ్ పంత్ బౌలింగ్ ఎంచుకున్నాడు.
DC vs PBKS, IPL 2022 LIVE: దిల్లీ జట్టు
పృథ్వీ షా, డేవిడ్ వార్నర్, రిషభ్ పంత్, రోమన్ పావెల్, లలిత్ యాదవ్, సర్ఫరాజ్ ఖాన్, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, కుల్‌దీప్ యాదవ్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, ఖలీల్ అహ్మద్
DC vs PBKS, IPL 2022 LIVE: పంజాబ్ జట్టు
మయాంక్ అగర్వాల్, శిఖర్ ధావన్, జానీ బెయిర్‌స్టో, లియామ్ లివింగ్‌స్టన్, జితేశ్ శర్మ, షారుక్ ఖాన్, కాగిసో రబాడా, నేథన్ ఎలిస్, రాహుల్ చాహర్, వైభవ్ అరోరా, అర్షదీప్ సింగ్
DCలో కొవిడ్ కలకలం
దిల్లీ క్యాపిటల్స్‌లో మొదట ఫిజియో ప్యాట్రిక్ ఫర్హర్ట్‌కు కొవిడ్ పాజిటివ్ వచ్చింది. దాంతో ఏప్రిల్ 16 నుంచి దిల్లీ శిబిరం మొత్తాన్ని ప్రత్యేక బయో బుడగలో ఉంచారు. ఇతరులతో కలవనీయడం లేదు. మరో రెండు రోజులకు మిచెల్ మార్ష్‌కు పాజిటివ్ రావడంతో ఆస్పత్రిలో చేరాడు. ఈ విషయాన్ని డీసీ మేనేజ్‌మెంట్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. దాంతో బుధవారం పుణెలో జరగాల్సిన మ్యాచును ముంబయికి మార్చారు. ప్రయాణాలు చేయనీయడం లేదు.
ఏప్రిల్ 16 నుంచి దిల్లీ శిబిరంలో ప్రతిరోజు కొవిడ్ టెస్టులు నిర్వహిస్తున్నారు. మంగళవారం నిర్వహించిన టెస్టుల్లో ఆటగాళ్లకు నెగెటివ్ వచ్చినట్టు సమాచారం వచ్చింది. అయితే బుధవారం ఉదయం టెస్టులు చేసి అందులో నెగెటివ్ రావడంతో మ్యాచ్ నిర్వహించాలని ఐపీఎల్ నిర్వాహక కమిటీ నిర్ణయించింది. అయితే టిమ్ సీఫెర్ట్ కు కొవిడ్ వచ్చినట్టు తెలిసింది.
పంజాబ్‌తో మ్యాచ్ నిర్వహించాలంటే దిల్లీ బృందంలో 12 మంది ఆటగాళ్లకు నెగెటివ్ రావాల్సి ఉంటుంది. అందులో ఏడుగురు భారతీయులు కచ్చితంగా ఉండాలి. ఇవన్నీ సాధ్యమవ్వడంతో ఈ మ్యాచ్ జరుగుతోంది.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
DC vs PBKS, IPL 2022 LIVE: దడ పుట్టించిన దిల్లీ.. పంజాబ్‌పై విక్టరీ
దిల్లీ 10.3 ఓవర్లలో విక్టరీ అందుకుంది. డేవిడ్ వార్నర్ (60), సర్ఫరాజ్ (12) అజేయంగా నిలిచారు. దిల్లీ 9 వికెట్ల తేడాతో గెలిచింది.
DC vs PBKS, IPL 2022 LIVE: 10 ఓవర్లకు దిల్లీ 113-1
ఎలిస్ 9 పరుగులు ఇచ్చాడు. వార్నర్ (55) బౌండరీ బాది 53వ హాఫ్ సెంచరీ చేశాడు. సర్ఫరాజ్ (11) అతడికి తోడుగా ఉన్నాడు. వారికి ౩ పరుగులే అవసరం.




















