అన్వేషించండి
Advertisement
IPL 2025 Auction: సంచలనాలు సృష్టించినా సైడ్ చేశారు, ఐపీఎల్‌లో అమ్ముడుపోని స్టార్ క్రికెటర్లు
IPL 2025 Auction: ఐపీఎల్ 2025 వేలంలో కొంతమంది స్టార్ క్రికెటర్లకి మొండిచేయి ఎదురైంది. ఒకప్పుడు వీరి కోసమే కోట్లు కుమ్మరించిన ఫ్రాంఛైజీలు.. ఈసారి చౌకగా వస్తున్నా కనీసం పట్టించుకోలేదు.
IPL 2025 Auction Unsold Players List: ఐపీఎల్(IPL 2025 Auction) మెగా వేలం ముగిసింది. గత రికార్డులను బద్దలు కొడుతూ ఈసారి ఆటగాళ్లు భారీ ధరకు అమ్ముడుపోయారు. రిషభ్ పంత్ (Rishab Panth) ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. రిషబ్ పంత్ T20 లీగ్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. 27 కోట్ల రూపాయలకు లక్నో సూపర్ జెయింట్స్ పంత్ ను కొనుగోలు చేసింది. 13 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ(Vaibhav Surya VAmsi) వేలంలో కొనుగోలు చేసిన అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు.
రెండు రోజులపాటు సాగిన వేలం కొంత మంది క్రికెటర్లను కోటీశ్వరులను చేసింది. మొత్తం 577 మంది ఆటగాళ్ల వేలంలో పోటీపడగా చాలామంది క్రికెటర్లు అమ్ముడుపోలేదు. కీలక ఆటగాళ్లు.. ఒకప్పుడు క్రికెట్‌లో ప్రకంపనలు సృష్టించిన ఆటగాళ్లు అమ్ముడుపోకపోవడం క్రికెట్ ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్, పృథ్వీ షా, మయాంక్ అగర్వాల్ వంటి క్రికెటర్లను ఏ జట్టు కొనుగోలు చేయకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఐపీఎల్ మెగా వేలంలో ఇంతకీ ఎవరెవరు అమ్ముడుపోలేదంటే...
బ్యాటర్ బేస్ ప్రైస్
డేవిడ్ వార్నర్ - రూ. 2 కోట్లు
అన్మోల్‌ప్రీత్ సింగ్ - రూ. 30 లక్షలు
యష్ ధుల్ - రూ. 30 లక్షలు
కేన్ విలియమ్సన్ - రూ. 2 కోట్లు
మయాంక్ అగర్వాల్ - రూ. 1 కోటి
పృథ్వీ షా - రూ. 75 లక్షలు
సర్ఫరాజ్ ఖాన్ - రూ. 75 లక్షలు
మాధవ్ కౌశిక్ - రూ. 30 లక్షలు
పుఖ్‌రాజ్ మన్ - రూ. 30 లక్షలు
ఫిన్ అలెన్ - రూ. 2 కోట్లు
డెవాల్డ్ బ్రీవిస్ - రూ.75 లక్షలు
బెన్ డకెట్ - రూ.2 కోట్లు
బౌలర్లు బేస్ ప్రైస్
వకార్ సలాంఖీల్ - రూ.75 లక్షలు
కార్తీక్ త్యాగి - రూ.40 లక్షలు
పీయూష్ చావ్లా - రూ.50 లక్షలు
ముజీబ్ ఉర్ రెహమాన్ - రూ.2 కోట్లు
విజయకాంత్ వియస్కాంత్ - రూ. 75 లక్షలు
అకేల్ హోసేన్ - రూ. 1.50 కోట్లు
ఆదిల్ రషీద్ - రూ.2 కోట్లు
కేశవ్ మహారాజ్ - రూ.75 లక్షలు
సాకిబ్ హుస్సేన్ - రూ.30 లక్షలు
ముస్తాఫిజుర్ రెహమాన్ - రూ.2 కోట్లు
నవీన్-ఉల్-హక్ - రూ.2 కోట్లు
ఉమేష్ యాదవ్ - రూ.2 కోట్లు
అల్జారీ జోసెఫ్ - రూ.2 కోట్లు
శివమ్ మావి - రూ. 75 లక్షలు
నవదీప్ సైనీ - రూ.75 లక్షలు
వీరితోపాటు డారిల్ మిచెల్, ఉత్కర్ష్ సింగ్, కోట్లు మయాంక్ దాగర్, జానీ బెయిర్‌స్టో, ఉపేంద్ర యాదవ్, అలెక్స్ కారీ, జోష్ ఫిలిప్ వంటి ఆటగాళ్లు కూడా అమ్ముడుపోకపోవడం నివ్వెరపరిచింది.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
గాడ్జెట్స్
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion