కావ్య మారన్ నెట్ వర్త్, ఇంట్రెస్టింగ్ విషయాలు ఇవే సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ ఓనర్ కావ్య మారన్ని ఐపీఎల్ ఫ్యాన్స్ ముద్దుగా కావ్య పాప అని పిలుచుకుంటారు. ఐపీఎల్ మ్యాచ్ సమయంలో ఈమె ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్‌కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. కావ్య మారన్.. ఆగస్టు 6వ తేదిన 1992లో చెన్నైలో పుట్టింది. కావ్య మారన్ నెట్ వర్త్ జన్ భారత్ టైమ్స్ ప్రకారం రూ.409 కోట్లు అట. కావ్య ఫాదర్, సన్‌రైజర్స్ కో ఓనర్ కళానిధి మారన్ కూడా ఇండియాలోని అత్యంత సంపన్నుల్లో ఒకరు. కావ్య పాప వాళ్ల నాన్న నెట్ వర్త్ 2019లో రూ.19,000 కోట్లు. తండ్రి కంటే నెట్ వర్త్ తక్కువగా ఉన్నప్పటికీ.. చిన్న వయసులోనే ఆమె సక్సెస్‌ని అందుకుంటుంది. తండ్రే కాదు ఆమె తల్లి కూడా బిజినెస్‌లో బాగా రాణిస్తుంది. సోలార్ టీవీ కమ్యూనిటీ రిస్ట్రిక్టెడ్కి ఆమె CEO. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం. కరుణానిధికి కూడా వీళ్లు బంధువులే