ఐపీఎల్ 2025కు చెన్నై రిటైన్ చేసిన ప్లేయర్స్ ఎవరు? - ‘తల’కి అంత తక్కువా? 1. రుతురాజ్ గైక్వాడ్ - రూ.18 కోట్లు ఐపీఎల్ 2024లో కెప్టెన్సీ వహించిన రుతురాజ్‌ను చెన్నై రూ.18 కోట్లతో రిటైన్ చేసుకుంది. 2. రవీంద్ర జడేజా - రూ.18 కోట్లు స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాను కూడా చెన్నై రూ.18 కోట్లతో రిటైన్ చేసుకుంది. 3. మతీష పతిరాణా - రూ.13 కోట్లు గురి పెట్టి యార్కర్లు వేసే మతీష పతిరాణాను రూ.13 కోట్లతో రిటైన్ చేసుకుంది. 4. శివం దూబే - రూ.12 కోట్లు సిక్సర్ల స్పెషలిస్టు శివం దూబేని రూ.12 కోట్లతో రిటైన్ చేసుకుంది. 5. మహేంద్ర సింగ్ ధోని - రూ.4 కోట్లు మాస్టర్ మైండ్ మహేంద్ర సింగ్ ధోనిని చెన్నై రూ.4 కోట్లతో రిటైన్ చేసుకుంది. ఇంకా వారి దగ్గర వేలం కోసం రూ.55 కోట్లు ఉన్నాయి.