ఐపీఎల్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో వ్యక్తిగతంగా ఎక్కువ రన్స్ చేసింది ఎల్‌ఎస్జీ ప్లేయర్‌ స్టోయిన్స్‌. చెన్నైపై 63బంతుల్లో 124 పరుగులు చేశాడు.



విరాట్ కోహ్లీ రాజస్థాన్ రాయల్స్‌పై 72 బంతుల్లో 113 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు సిక్స్‌లు, 12 ఫోర్లు ఉన్నాయి.



కేకేఆర్‌ ప్లేయర్‌ ఎస్పీ నరైన్‌ రాజస్థాన్‌పై 59 బంతుల్లో 109 పరుగులు చేశాడు. ఇందులో ఆరు సిక్స్‌లు, 13 ఫోర్స్‌ ఉన్నాయి.



రుతురాజ్ గైక్వాడ్‌ ఎల్‌ఎస్జీపై చెన్నై వేదికగా 60 బంతుల్లో 108 పరుగులు చేశాడు. ఇందులో 12 బౌండరీలు, మూడు సిక్స్‌లు ఉన్నాయి.



పంజాబ్ కింగ్స్ ఆటగాడు బెయిర్‌స్టో కూడా ఓ సెంచరీ నమోదు చేశాడు. చెన్నైపై 48 బంతుల్లో 9 సిక్స్‌లతో 108 పరుగులు చేశాడు.



రాజస్థాన్ ప్లేయర్‌ బట్లర్‌ 2 సెంచరీలు చేశాడు. కేకేఆర్‌, ఆర్సీబీపై సెంచరీలు చేశాడు.



రోహిత్‌ శర్మ చెన్నైపై వాంఖడేలో 105 పరుగులు చేశాడు. ఇందులో 5 సిక్స్‌లు 11 బౌండరీలు ఉన్నాయి.



ఆర్‌ఆర్ ప్లేయర్ జైస్వాల్‌ ముంబైపై 60 బంతుల్లో 104 పరుగులు చేశాడు.



గుజరాత్ ఆటగాళ్లు శుభమన్‌గిల్(104), సాయి సుదర్శన్‌(103) చెన్నైపై చెరో సెంచరీ కొట్టారు.



సూర్యకుమార్ యాదవ్‌పై మీద కూడా ఓ సెంచరీ ఉంది. హైదరాబాద్‌పైనే 102 పరుగులు చేశాడు.



హెడ్‌ ఆర్సీబీపై సెంచరీ బాదేశాడు. 8 సిక్స్‌లు, 9 ఫోర్లతో 102 పరుగులు చేశాడు.



ఆర్సీబీ ప్లేయర్‌ జాక్‌ గుజారాత్‌పై సెంచరీ చేశాడు.