వికెట్లు తీయడంలో పంజాబ్ కింగ్స్ ఆటగాడు హర్షల్ పటేల్ టాప్‌లో ఉన్నాడు. 14 మ్యాచుల్లో 24 వికెట్లు పడగొట్టాడు. బెస్ట్ బౌలింగ్ 3/15 బెస్ట్ బౌలింగ్ 3/15 రెండోస్థానంలో కేకేఆర్ క్రికెటర్ వరుణ్ చక్రవర్తి ఉన్నాడు. ఇతను 21 వికెట్లు తీసుకున్నాడు. బెస్ట్ బౌలింగ్ 3/16 మూడో స్థానం జస్ప్రీత్ బుమ్రాది. 20 వికెట్లు తీసిన బుమ్రా ఎకానమీలో టాపర్. బెస్ట్ బౌలింగ్ 5/21 కేకేఆర్‌కు చెందిన అండ్రూ రస్సెల్‌ది నాల్గో స్థానం. 19 వికెట్లు తీసుకున్న ఇతని బెస్ట్ 3/19 ఐదో స్థానం మరో కేకేఆర్ క్రికెటర్ హర్షిత్ రానా సొంత చేసుకున్నాడు. ఇతను కూడా 19 వికెట్లు తీసుకున్నాడు. బెస్ట్ బౌలింగ్ 3/24 ఆరో స్థానంలో హైదరాబాద్ బౌలర్ నటరాజన్‌ది. ఇతను కూడా 19 వికెట్లు తీశాడు. బెస్ట్ బౌలింగ్ 4/19 రస్సెల్, రానా, నటరాజ్‌తోపాటు అర్షదీప్ సింగ్, ఆవేశ్ ఖాన్, కూడా 19 వికెట్లు తీసుకొని ఏడు, ఎనిమిది స్థానాల్లో ఉన్నారు. చాహల్, కమిన్స్ చెరో 18 వికెట్లు తీసుకొని తొమ్మిది పది స్థానాల్లో సెటిల్ అయ్యారు.