మోస్ట్ రన్స్‌లో టాపర్ రన్‌ మెషిన్ కింగ్‌ కోహ్లీయే. ఒక సెంచరీ ఐదు ఫిఫ్టీలతో 741 పరుగులు చేసి ఆరెంజ్‌ క్యాప్ ఎగరేసుకుపోయాడు.



రెండో స్థానంలో ఉన్న సీఎస్కే కెప్టెన్‌ రుతురాజ్ గైక్వాడ్‌. 5 హాఫ్‌సెంచరీలు ఒక సెంచరీతో 583 పరుగులు చేశాడు.



థర్డ్‌ ప్లేస్‌ రియాన్ పరాగ్ ఉంది. 16 మ్యాచ్‌లు ఆడిన పరాగ్‌ 573 పరుగులు చేశాడు. 4 హాఫ్‌ సెంచరీలు కొట్టాడు



ఈ జాబితాలో హెడ్‌ది నాల్గో స్థానం. హెడ్‌ 567 పరుగులు చేశాడు. ఈసారి ఆయన సెంచరీ, నాలుగు ఫిఫ్టీలు కొట్టాడు.



ఫిఫ్త్‌ ప్లేస్‌ సంజూశాంసన్ దే. 16 ఇన్నింగ్స్ ఆడి ఒక సెంచరీ ఐదు హాఫ్‌ సెంచరీలతో 531 పరుగులు చేశాడు.



సాయి సుదర్శన్‌ది ఆరో స్థానం. ఇతను ఒక సెంచరీ రెండు అర్థ సెంచరీలతో 527 పరుగులు చేశాడు.



ఏడో స్థానం లక్నో టీం కెప్టెన్ రాహుల్ ది. ఇతను నాలుగు అర్థ సెంచరీలతో 520 పరుగులు చేశాడు.



ఎనిమిదో స్థానంలో ఉన్న ఎల్‌ఎస్‌జీ ప్లేయర్ పూరన్‌ మూడు అర్థసెంచరీలతో 499 పరుగులు చేశాడు.



ఆల్‌రౌండర్‌ నరైన్‌ పరుగుల జాబితాలో తొమ్మిదో స్థానంలో ఉన్నాడు. ఒక సెంచరీ,3 అర్థ సెంచరీలతో 488 పరుగులు చేశాడు



పదో స్థానంలో హైదరాబాద్‌ బ్లాక్ బస్టర్ అభిషేక్ శర్మ ఉన్నాడు. మూడు అర్థ సెంచరీలతో 484 పరుగులు చేశాడు.