ఈసారి కూడా కప్ తీసుకెళ్లడానికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు శక్తివంచన లేకుండా పోరాడింది. మొదట్లో అత్యంత పేలవమైన ఆటతో పాయింట్ టేబుల్‌లో ఆఖరి స్థానం ఉండేది. సెకండాఫ్‌లో అదరగొట్టిన ఆర్సీబీ ఆటగాళ్లు జట్టును ప్లే ఆఫ్ వరకు తీసుకొచ్చారు. ఐపీఎల్ 2024లో ప్లేఆఫ్‌లో రాజస్థాన్‌పై ఓడిపోయిన ఇంటిదారి పట్టింది. ఐపీఎల్ 2023లో లీగ్ దశలోనే వెనుదిరిగిన ఆర్సీబీ ఆరోస్థానంలో నిల్చింది ఐపీఎల్ 2020 నుంచి 2022 వరకు ప్లే ఆఫ్ వరకు రాగలిగింది. ఐపీఎల్ 2017 నుంచి 2019 వరకు లీగ్ దశలోనే ఆర్సీబీ కథ ముగిసింది. ఐపీఎల్ 2016, 2011, 2009 లలో కచ్చితంగా కప్‌తో తిరిగి వస్తుందనుకున్న జట్టు రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఐపీఎల్ 2015లో కూడా ప్లేఆఫ్‌లోనే ఆర్సీబీ ఇన్నింగ్స్ ముగిసింది. ఐపీఎల్ 2012 నుంచి 2014 వరకు 2008, 2010లో లీగ్ దశలోనే ఆర్సీబీ చతికిలపడింది. ఆర్సీబీ ఇప్పటి వరకు జరిగిన ఐపీఎల్స్‌లో మూడు సార్లు రన్నరప్‌గా నిలిచింది. ఐదు సార్లు ప్లే ఆఫ్‌లో ఆడింది. ఐపీఎల్ 2024లో ఆర్‌ఆర్‌తో ఓటమి తర్వాత ఆర్సీబీ డ్రెస్సింగ్ రూమ్‌లో ఒక్కసారిగా సైలెన్స్ ఆవహించింది.