అన్వేషించండి

IPL 2024: చెన్నైకి మరో షాక్‌, పంజాబ్‌ ఘన విజయం - ఆసక్తికరంగా మారిన ప్లే ఆఫ్ రేస్

CSK vs PBKS, IPL 2024: ప్లే ఆఫ్స్‌ అవకాశాలు సజీవంగా ఉండాలంటే నెగ్గి తీరాల్సిన మ్యాచ్‌లో పంజాబ్ సత్తాచాటింది. చెన్నైపై ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

CSK vs PBKS  IPL 2024 Punjab Kings won by 7 wkts: చెన్నై సూపర్‌కింగ్స్‌పై పంజాబ్‌ ఘన విజయం సాధించింది. తొలుత చెన్నైను తక్కువ పరుగులకే కట్టడి చేసిన పంజాబ్‌... ఆ తర్వాత సునాయసంగా విజయం సాధించింది. చెన్నై ఓటమితో ఆ జట్టు ప్లే ఆఫ్‌  ఆశలు సంక్లిష్టంగా మారాయి. బౌలింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై పంజాబ్‌ బౌలర్లు రాణించారు. చెన్నై బ్యాటర్లందరూ పరుగులు చేసేందుకు ఇబ్బందిపడిన వేళ కెప్టెన్‌ రుతురాజ్‌ మరోసారి అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఫామ్‌ను కొనసాగిస్తూ రుతారాజ్‌ సమయోచిత ఇన్నింగ్స్‌ ఆడాడు. 48 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 62 పరుగులు చేసిన రుతురాజ్‌.. ఆరెంజ్‌ క్యాప్‌ను దక్కించుకున్నాడు. చివర్లో ధోనీ సిక్స్‌తో మెరవడంతో నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది.  అనంతరం ఈ లక్ష్యాన్ని పంజాబ్ 17.5 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. 
 
పంజాబ్‌ బౌలర్ల కట్టడి
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్‌.... చెన్నై సూపర్‌కింగ్స్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. చెన్నై తరపున 36 ఏళ్ల వయసులో రిచర్డ్ గ్లీసన్ అరంగేట్రం  చేశాడు. గాయం కారణంగా డేవాన్ కాన్వే దూరం కావడంతో అతడి స్థానంలో గ్లీసన్‌ ఈ మ్యాచ్‌తో ఎంట్రీ చేశాడు. కగిసో రబాడ తొలి ఓవర్‌ వేయగా కేవలం నాలుగు సింగిల్స్‌ వచ్చాయి. అర్ష్‌దీప్ సింగ్ వేసిన రెండో ఓవర్‌లో 10 పరుగులు వచ్చాయి. కాసేపు చెన్నై ఓపెనర్లు నిలకడగా ఆడుతున్నారు. 3 ఓవర్లకు స్కోరు 20/0. శామ్‌ కరన్ ఇన్నింగ్స్ నాలుగో ఓవర్‌ వేసి మూడు పరుగులు మాత్రమే ఇచ్చాడు. అర్ష్‌దీప్‌ సింగ్ వేసిన ఐదో ఓవర్‌లో మూడు ఫోర్లు, రెండు సింగిల్స్‌ వచ్చాయి. కొన్ని మ్యాచులుగా విఫలమవుతున్న రహానే దూకుడు పెంచాడు. పవర్‌ ప్లే ముగిసేసరికి చెన్నై స్కోరు వికెట్‌ కోల్పోకుండా 55 పరుగులకు చేరింది.
 
64 పరుగుల వద్ద చెన్నై మొదటి వికెట్ కోల్పోయింది. అజింక్య రహానె 29 పరుగులు చేసి ఔటయ్యాడు. హర్‌ప్రీత్‌ బ్రార్‌ వేసిన 8.2 ఓవర్‌కు రిలీ రోసోవ్‌కు క్యాచ్‌ ఇచ్చి రహానే అవుటయ్యాడు. శివమ్ దూబె గోల్డెన్ డక్‌ కావడంతో చెన్నైకి భారీ షాక్‌ తగిలింది. హర్‌ప్రీత్ బ్రార్ వేసిన ఓవర్‌లో దూబే వికెట్ల ముందు దొరికిపోయాడు. ఆరు పరుగుల వ్యవధిలో చెన్నై 3 వికెట్లు కోల్పోయింది. రాహుల్ చాహర్ వేసిన ఓవర్‌లో రవీంద్ర జడేడా అవుటయ్యాడు. 10 ఓవర్లకు చెన్నై 71/3. పంజాబ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో చెన్నై బ్యాటర్లు ఆచితూచి ఆడారు. 8 ఓవర్లపాటు చైన్నై బ్యాటర్లు కనీసం ఒక్క బౌండరీ కూడా కొట్టలేదు. పంజాబ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తుండటంతో చెన్నై బ్యాటర్లు జాగ్రత్తగా ఆడారు.
8 ఓవర్ల తర్వాత చెన్నై ఇన్నింగ్స్‌లో ఓ బౌండరీ నమోదైంది. చెన్నై 107 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. సమీర్ రిజ్వీ 21 పరుగులు చేసి అవుటయ్యాడు. రబాడ వేసిన ఓవర్‌లో హర్షల్‌ పటేల్‌కు క్యాచ్ ఇచ్చి రిజ్వీ అవుటయ్యాడు. రుతురాజ్ గైక్వాడ్ అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు.  48 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 62 పరుగులు చేసిన రుతురాజ్‌.. ఆరెంజ్‌ క్యాప్‌ను దక్కించుకున్నాడు.  
 
సునాయసంగా...
163 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్‌కు ఆదిలోనే షాక్‌ తగిలింది. 19 పరుగుల వద్ద ప్రభ్‌ సిమ్రన్‌సింగ్‌ అవుటయ్యాడు. 10 బంతుల్లో ఒక ఫోర్‌, ఒక సిక్స్‌తో 13 పరుగులు చేసిన ప్రభ్‌సిమ్రన్‌సింగ్‌... గ్లేసన్‌ బౌలింగ్‌లో అవుటయ్యాడు. ఆ తర్వాత బెయిర్‌ స్టో, రూసో పంజాబ్‌ను తిరుగులేని స్థితిలో నిలిపారు. బెయిర్‌ స్టో 30 బంతుల్లో ఏడు ఫోర్లు, ఒక సిక్స్‌తో 46 పరుగులు చేసి అవుటవ్వగా... రూసో 23 బంతుల్లో అయిదు ఫోర్లు, రెండు సిక్సర్లతో  43 పరుగులు చేశాడు. వీరిద్దరూ రాణించడంతో పంజాబ్‌ లక్ష్యం తేలిగ్గా మారిపోయింది. ఆ తర్వాత శశాంక్‌ సింగ్‌, శామ్ కరణ్‌ మిగిలిన పని పూర్తి చేసి పంజాబ్‌కు విజయం అందించారు. చెన్నై బౌలర్లలో శార్దూల్ ఠాకూర్, రిచర్డ్ గ్లీసన్, శివమ్ దూబె తలో వికెట్ పడగొట్టారు. 
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh News: మొన్న సుభాష్‌- నేడు రామ్మోహన్- ప్రజాప్రతినిధులకు చంద్రబాబు చురకలు
మొన్న సుభాష్‌- నేడు రామ్మోహన్- ప్రజాప్రతినిధులకు చంద్రబాబు చురకలు
PM Vidyalaxmi: 'పీఎం విద్యాలక్ష్మి'రుణాలు ఎలా పొందాలి? ఎవరు అర్హులు? వడ్డీ ఎంత?
'పీఎం విద్యాలక్ష్మి'రుణాలు ఎలా పొందాలి? ఎవరు అర్హులు? వడ్డీ ఎంత?
Supreme Court : రూల్స్ మధ్యలో మార్చడానికి లేదు- ఉద్యోగ నియామక ప్రక్రియపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
రూల్స్ మధ్యలో మార్చడానికి లేదు- ఉద్యోగ నియామక ప్రక్రియపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
TTD:  టీటీడీలో అన్యమత ఉద్యోగులపై నేడో రేపో వేటు - వారికి అక్కడెలా ఉద్యోగాలు వచ్చాయి ?
టీటీడీలో అన్యమత ఉద్యోగులపై నేడో రేపో వేటు - వారికి అక్కడెలా ఉద్యోగాలు వచ్చాయి ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

US Election Results 5 Reasons for Kamala Harris Defeatజగనన్నపై కారుకూతలు కూస్తార్రా? ఇక మొదలుపెడుతున్నా!Elon Musk Key Role Donald Trump Win | ట్రంప్ విజయంలో కీలకపాత్ర ఎలన్ మస్క్ దే | ABP DesamTrump Modi Friendship US Elections 2024 లో ట్రంప్ గెలుపు మోదీకి హ్యాపీనే | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh News: మొన్న సుభాష్‌- నేడు రామ్మోహన్- ప్రజాప్రతినిధులకు చంద్రబాబు చురకలు
మొన్న సుభాష్‌- నేడు రామ్మోహన్- ప్రజాప్రతినిధులకు చంద్రబాబు చురకలు
PM Vidyalaxmi: 'పీఎం విద్యాలక్ష్మి'రుణాలు ఎలా పొందాలి? ఎవరు అర్హులు? వడ్డీ ఎంత?
'పీఎం విద్యాలక్ష్మి'రుణాలు ఎలా పొందాలి? ఎవరు అర్హులు? వడ్డీ ఎంత?
Supreme Court : రూల్స్ మధ్యలో మార్చడానికి లేదు- ఉద్యోగ నియామక ప్రక్రియపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
రూల్స్ మధ్యలో మార్చడానికి లేదు- ఉద్యోగ నియామక ప్రక్రియపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
TTD:  టీటీడీలో అన్యమత ఉద్యోగులపై నేడో రేపో వేటు - వారికి అక్కడెలా ఉద్యోగాలు వచ్చాయి ?
టీటీడీలో అన్యమత ఉద్యోగులపై నేడో రేపో వేటు - వారికి అక్కడెలా ఉద్యోగాలు వచ్చాయి ?
2008 DSC Latest News: డీఎస్సీ-2008 అభ్యర్థులకు గుడ్ న్యూస్- రేపటి లోపు ప్రక్రియ పూర్తి
డీఎస్సీ-2008 అభ్యర్థులకు గుడ్ న్యూస్- రేపటి లోపు ప్రక్రియ పూర్తి
Viral Video : కెప్టెన్‌తో గొడవ- మ్యాచ్ మధ్యలోనే కోపంతో వెళ్లిపోయిన విండీస్‌ బౌలర్‌
కెప్టెన్‌తో గొడవ- మ్యాచ్ మధ్యలోనే కోపంతో వెళ్లిపోయిన విండీస్‌ బౌలర్‌
Mahindra Thar: థార్ లవర్స్‌కి గుడ్ న్యూస్ - ఏకంగా రూ.3 లక్షల వరకు డిస్కౌంట్!
థార్ లవర్స్‌కి గుడ్ న్యూస్ - ఏకంగా రూ.3 లక్షల వరకు డిస్కౌంట్!
Samantha: బాలీవుడ్ హీరోతో సమంత లిప్ లాక్... నెట్టింట వీడియో వైరల్
బాలీవుడ్ హీరోతో సమంత లిప్ లాక్... నెట్టింట వీడియో వైరల్
Embed widget