CSK In IPL: ఐపీఎల్ చరిత్రలో ఎక్కువసార్లు - ఇప్పటిదాకా చెన్నై ప్రస్థానం ఇలా!
ఐపీఎల్ చరిత్రలో ఎక్కువ సార్లు ప్లేఆఫ్స్‌కు చేరిన జట్టు చెన్నై సూపర్ కింగ్స్‌నే. ఏకంగా 12 సార్లు ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది.
Chennai Super Kings In IPL: మహేంద్ర సింగ్ ధోని నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఐపీఎల్ 2023 ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించిన రెండో జట్టుగా అవతరించింది. ఈ సీజన్‌తో కలిపితే చెన్నై సూపర్ కింగ్స్ 12వ సారి ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది. చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటి వరకు రెండుసార్లు మాత్రమే ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించలేకపోయింది.
అత్యధిక సార్లు ప్లేఆఫ్స్‌కు చేరిన జట్టు చెన్నై సూపర్ కింగ్స్‌నే!
ఐపీఎల్‌లో ప్లేఆఫ్స్‌కు అత్యధికంగా 12 సార్లు చేరుకున్న జట్టుగా చెన్నై సూపర్ కింగ్స్ నిలిచింది. ఐపీఎల్‌లో చెన్నై ఇప్పటి వరకు 14 సీజన్లు ఆడింది. ఇందులో ఆ జట్టు రెండుసార్లు మాత్రమే ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించలేకపోయింది. 2008లో అంటే ఐపీఎల్ మొదటి సీజన్‌లో సెమీ ఫైనల్స్ లోకి ప్రవేశించింది. ఆ సీజన్‌లో చెన్నై ఫైనల్స్ వరకు ప్రయాణించింది. అయితే రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఆ జట్టు ఓటమి చవిచూడాల్సి వచ్చింది.
అదే సమయంలో గత 13 సీజన్లలో, చెన్నై 11 సార్లు ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది. ఇందులో జట్టు తొమ్మిది సార్లు ఫైనలిస్ట్‌గా ఉంది. ఈ తొమ్మిది ఫైనల్స్‌లో చెన్నై నాలుగు సార్లు విజయం సాధించి, ఐదు సార్లు ఓడిపోయింది. ఇప్పుడు ఈసారి జట్టు ప్రయాణం ఎక్కడి వెళ్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఐపీఎల్ 2016, 2017 సీజన్లలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు బ్యాన్ అయింది.
ప్రతి ఐపీఎల్ సీజన్‌లో చెన్నై ప్రయాణం ఎలా ఉంది?
ఐపీఎల్ 2008 - (రన్నరప్)
ఐపీఎల్ 2009 - (ప్లేఆఫ్స్)
ఐపీఎల్ 2010 - (విజేత)
ఐపీఎల్ 2011 - (విజేత)
ఐపీఎల్ 2012 - (రన్నరప్)
ఐపీఎల్ 2013 - (రన్నరప్)
ఐపీఎల్ 2014 - (ప్లేఆఫ్స్)
ఐపీఎల్ 2015 - (రన్నరప్)
ఐపీఎల్ 2016 - ఆడలేదు.
ఐపీఎల్ 2017 - ఆడలేదు.
ఐపీఎల్ 2018 - (విజేత)
ఐపీఎల్ 2019 - (రన్నరప్)
ఐపీఎల్ 2020 - ఏడో స్థానం
ఐపీఎల్ 2021 - (విజేత)
ఐపీఎల్ 2022 - తొమ్మిదో స్థానం
ఈ నాలుగేళ్లలో ఛాంపియన్‌గా నిలిచాడు
ఐపీఎల్‌లో అత్యధిక టైటిల్స్ సాధించిన రెండో జట్టుగా చెన్నై సూపర్ కింగ్స్ నిలిచింది. CSK ఇప్పటి వరకు 4 టైటిళ్లు గెలుచుకుంది. ఈ జాబితాలో ముంబై ఇండియన్స్ 5 టైటిల్స్‌తో నంబర్‌వన్‌గా నిలిచింది. మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలో చెన్నై మొత్తం నాలుగు ఐపీఎల్ టైటిల్స్ గెలుచుకుంది. ఐపీఎల్ 2010, 2011, 2018, 2021 సీజన్లలో చెన్నై సూపర్ కింగ్స్ విజేతగా నిలిచింది.
ఐపీఎల్ 2023లో చెన్నై ప్రదర్శన ఇలా ఉంది
ఐపీఎల్ 2023 అంటే ప్రస్తుత సీజన్‌లో, చెన్నై సూపర్ కింగ్స్ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. ఈ జట్టు మే 23వ తేదీన గుజరాత్ టైటాన్స్‌తో తన తొలి క్వాలిఫయర్ మ్యాచ్ ఆడనుంది. మొత్తం 14 లీగ్ మ్యాచ్‌లు ఆడిన చెన్నై 8 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, 5 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఒక మ్యాచ్‌లో ఫలితం రాలేదు.
ఐపీఎల్ 2023 సీజన్‌లో తమ చివరి లీగ్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్ భారీ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ (CSK) 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది. అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. దీంతో చెన్నై 77 పరుగులతో ఘనవిజయం సాధించింది. ఈ విజయంతో చెన్నై సూపర్ కింగ్స్ టాప్ 2కి ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్లే. ఎందుకంటే ప్రస్తుతం మూడో స్థానంలో ఉన్న లక్నో రెండో స్థానానికి చేరాలంటే కోల్‌కతాను 97 పరుగులతో ఓడించాల్సి ఉంటుంది.
ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాట్స్‌మెన్‌లో కేవలం డేవిడ్ వార్నర్ (86: 58 బంతుల్లో, ఏడు ఫోర్లు, ఐదు సిక్సర్లు) మాత్రమే రాణించాడు. ఇంకెవరూ అతనికి సహకారం అందించలేదు. ఇక చెన్నై విషయానికి వస్తే... చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్లలో డెవాన్ కాన్వే (87: 52 బంతుల్లో, 11 ఫోర్లు, మూడు సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మరో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (79: 50 బంతుల్లో, మూడు ఫోర్లు, ఏడు సిక్సర్లు) కూడా భారీ అర్థ సెంచరీ సాధించాడు.