IPL 2026 Auction: ఐపీఎల్ 2026 వేలంలో మరో 19 మంది ప్లేయర్లను చేర్చిన బీసీసీఐ.. పెరిగిన పోటీ
IPL 2026 Mini Auction: ఐపీఎల్ వేలంలో బీసీసీఐ మరో 19 మంది ఆటగాళ్ల పేర్లు చేర్చింది. దాంతో వారు సైతం మినీ వేలంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

IPL 2026 Auction: ఈరోజు ఐపీఎల్ 2026 కోసం జరగనున్న వేలం అంటే మినీ వేలం చాలా ఆసక్తికరంగా ఉండనుంది. కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), చెన్నై సూపర్ కింగ్స్ (CSK) రెండు ఫ్రాంచైజీలతో కలిపి 107 కోట్ల రూపాయలకు పైగా మొత్తం. ఈ రెండు 10 ఫ్రాంచైజీలో నేటి మినీ వేలంలో కీలకంగా వ్యవహరించనున్నాయి. మరోవైపు సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad), లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ (Dehi Capitals) వంటి ఇతర జట్లు తమ పర్సులో రూ.20 కోట్లకు పైగా కలిగి ఉన్నాయి.
వాస్తవానికి, 1,390 మంది నమోదిత ఆటగాళ్ల జాబితా నుంచి ఐపీఎల్ 2026 వేలం కోసం బీసీసీఐ 350 మంది ఆటగాళ్లను షార్ట్‌లిస్ట్ చేసింది. క్రిక్‌బజ్ ప్రకారం, సోమవారం అర్ధరాత్రి షార్ట్‌లిస్ట్ చేసిన ఆటగాళ్ల జాబితాలో మరో 19 మంది ఆటగాళ్ల పేర్లను చేర్చారు. భారత స్టార్ అభిమన్యు ఈశ్వరన్, చాలాసార్లు టెస్ట్ జట్టులో చేరినప్పటికీ ఇంకా అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసే అవకాశం రాలేదు. అతని పేరు తాజాగా మినీ వేలం ఆటగాళ్ల జాబితాలో చేర్చారు. స్ప్రెడ్‌షీట్‌లో ఈశ్వరన్‌ను 360వ స్థానంలో ఉంచారు.
బీసీసీఐ తాజాగా ఐపీఎల్ వేలంలో చేర్చిన ఇతర ఆటగాళ్లు
అభిమన్యు ఈశ్వరన్, మణి శంకర్ మురా సింగ్ (టిసిఎ), రాజేష్ మొహంతి (ఒసిఎ), స్వాస్తిక్ సమల్ (ఒసిఎ), సారాంష్ జైన్ (ఎంపిసిఎ), సూరజ్ సంగరాజు (ఎసిఎ), మరియు తన్మయ్ అగర్వాల్ (హెచ్‌వైసిఎ), స్వాస్తిక్ చికారా (యుపిసిఎ), చామ మిలింద్ (హెచ్‌వైసిఎ), కెఎల్ శ్రీజిత్ (కెఎస్‌సిఎ), రాహుల్ రాజ్ నమ్లా (సిఎయు), విరాట్ సింగ్ (జెఎస్‌సిఎ), త్రిపురేష్ సింగ్ (ఎంపిసిఎ), వీరన్‌దీప్ సింగ్ (మలేషియా), ఎథాన్ బాష్ (దక్షిణాఫ్రికా), క్రిస్ గ్రీన్ (ఆస్ట్రేలియా), కైల్ వెరెయిన్ (దక్షిణాఫ్రికా), బ్లెసింగ్ ముజరబాని (జింబాబ్వే), బెన్ సీయర్స్ (న్యూజిలాండ్) ఇతరులు ఉన్నారు.
మొత్తం 77 మందిని ఈ మినీ వేలంలో తీసుకునేందుకు చాన్స్ ఉంటుంది. ఇందులో 31 విదేశీ ఆటగాళ్ల స్లాట్లు ఉన్నాయి. మూడుసార్లు విజేతగా నిలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్ (కెకెఆర్) అత్యధికంగా 13 మందిని తీసుకునేందుకు అవకాశం ఉంది. వాళ్లు ఎక్కువ మందిని వేలంలోకి రిలీజ్ చేశారు. ఆ తర్వాత 2016 ఛాంపియన్ సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) 10 ఖాళీలను కలిగి ఉంది. అంటే సన్‌రైజర్స్ ఈ వేలంలో 10 మందిని తీసుకోనుంది.
ఈ ఆటగాళ్లపై అందరి దృష్టి
అబుదాబిలోని ఎటిహాడ్ స్టేడియంలో మంగళవారం జరగనున్న ఐపీఎల్ 2026 వేలంలో కామెరూన్ గ్రీన్, లియామ్ లివింగ్‌స్టోన్, వెంకటేశ్ అయ్యర్, రవి బిష్ణోయ్ వంటి ఆటగాళ్లపై అందరి దృష్టి ఉంటుంది. ఈ వేలం కోసం 10 ఫ్రాంచైజీలు పూర్తిగా సిద్ధంగా ఉన్నాయి. దుబాయ్ (2024), జెడ్డా (2025) తర్వాత, ఐపీఎల్ వేలం భారత్ వెలుపల నిర్వహించడం ఇది వరుసగా మూడోసారి.





















