Ambati Rayudu : చిక్కుల్లో అంబటి రాయుడు- ఉద్రిక్తతల నేపథ్యంలో పెట్టిన పోస్టుపై నెటిజన్ల ఆగ్రహం
Ambati Rayudu :అంబాటి రాయుడు తన X ఖాతాలో పాకిస్థాన్ దాడిపై వివాదాస్పద ట్వీట్ చేశాడు. ఇది వైరల్ కావడం, నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేయడంతో కవరింగ్ పోస్టు పెట్టాడు.

Ambati Rayudu controversial tweet: భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో గురువారం ఐపీఎల్ మ్యాచ్‌ను నిలిపివేశారు. ఇప్పుడు ఏకంగా ఐపీఎల్ 2025నే వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. ‘ఆపరేషన్ సింధూర్’ తర్వాత రెండు దేశాల సైన్యా మధ్య వార్ నడుస్తోంది. పాకిస్తాన్ ప్రతి దుష్ట ప్రయత్నానికి భారత సైన్యం తగిన విధంగా సమాధానం ఇస్తోంది. టీమ్ ఇండియా క్రికెటర్లు కూడా నిరంతరం దేశ సైన్యానికి ధైర్యం చెబుతున్నారు. ఇదే సమయంలో మాజీ భారత క్రికెటర్ అంబాటి రాయుడు చేసిన ఒక పోస్ట్ దుమారం రేపింది.
అంబాటి రాయుడు ‘X’ లో గురువారం మే 8న ఒక పోస్ట్ చేశాడు. పాకిస్తాన్ భారతదేశంపై డ్రోన్, క్షిపణుల దాడి చేసిన సమయంలో ఈ పోస్ట్ చేశాడు. భారత సైన్యాల వాయు రక్షణ వ్యవస్థ ఈ దాడులను తప్పికొట్టాయి.
An eye for an eye makes the world blind..🙏🙏🙏
— ATR (@RayuduAmbati) May 8, 2025
పాకిస్థాన్ దుష్ట పన్నాగాలపై భారతదేశం ఘాటుగా స్పందిస్తున్న వేళ రాయుడు, “కన్నుకు కన్ను అంటే ప్రపంచమంతా అంధకారమవుతుంది.” అని ట్వీట్ చేశాడు. ఆయన పోస్టుపై నెటిజన్లు ఫైర్ అయ్యారు. ఒక నెటిజన్ వెంటనే ట్వీట్‌ను తొలగించమని కోరాడు. మరొకరు, మనం అలా అనుకుంటున్నంత వరకు మన రెండు కళ్ళు పోతాయని అన్నారు.
వివాదం పెరుగుతున్న విషయాన్ని గమనించిన రాయుడు మరో పోస్ట్ చేసి నష్ట నివారణకు ప్రయత్నించాడు. ఆయన రాశారు-''జమ్మూ కాశ్మీర్, పంజాబ్, భారత సరిహద్దులోని ఇతర ప్రాంతాలలో అందరి భద్రత, శాంతి కోసం ప్రార్థన చేస్తున్నాను. దీనితో ప్రభావితమైన ప్రతి ఒక్కరికి బలాన్ని, భద్రతను , త్వరితగతిన కోలుకునే శక్తి ఇవ్వాలాని ఆశిస్తున్నాను. జై హింద్.'' అని పోస్టు చేశాడు.
Prayers for peace and safety in Jammu & Kashmir, Punjab and other parts of India along the border. Hoping for strength, security and swift resolution for everyone affected. Jai Hind!
— ATR (@RayuduAmbati) May 8, 2025
ఏప్రిల్ 22న పహల్గాంలో పాకిస్తాన్ ఉగ్రవాదులు 26 నిర్దోషులను చంపారు. దీనికి ప్రతిగానే భారతదేశం, పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద కేంద్రాలపై దాడి చేసింది. మొత్తం 9 ఎయిర్ స్ట్రైక్‌లు చేసింది. ఈ ఎయిర్ స్ట్రైక్‌లో పాకిస్తాన్‌లోని ఉగ్రవాద కేంద్రాలను నాశనం అయ్యాయి. అప్పటి నుంచి పాకిస్తాన్ ఆగ్రహంతో ఊగిపోతోంది. ఏదోలా భారత్‌ను దెబ్బతీయాలని విఫలయత్నం చేస్తోంది. పాకిస్థాన్ చేస్తున్న అన్ని దుస్సాహసాలను భారత్ విజయవంతంగా తిప్పికొడుతోంది.




















