IPL Media Rights: ఐపీఎల్ మీడియా హక్కుల వేలం ఆరంభం! గెలుపు బరిలో ఎవరున్నారంటే?
IPL Media Rights 2023-27 : ఐపీఎల్ మీడియా హక్కుల వేలం మొదలైంది! చివరిసారి రూ.16,347 కోట్లకు స్టార్ ఐపీఎల్ ప్రసార హక్కులను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. మరి ఈసారి బరిలో ఎవరున్నారు? ప్యాకేజీలు ఏంటంటే?
IPL Media Rights 2023-27 Base Price Bidding Process Bidders Expected Value Overall IPL Broadcast Rights Details Here : ఐపీఎల్ మీడియా హక్కుల వేలం మొదలైంది! ఆదివారం ఉదయం 11 గంటలకు ఈ-బిడ్డింగ్ ప్రక్రియను ఆరంభించారు. ఎం-జంక్షన్ అనే ఈ-వేలం కంపెనీ మొత్తం బాధ్యతలను పర్యవేక్షిస్తోంది. కంపెనీల విజ్ఞప్తి మేరకు రూ.50 లక్షలు పెంచుకుంటూ వేలం కొనసాగించేందుకు బీసీసీఐ అనుమతి ఇచ్చింది. ప్రైవేటు బిడ్డింగ్ కాబట్టి ఎవరు ఎంత బిడ్ వేస్తున్నారో నేరుగా బీసీసీఐకి తెలియదు. చివరిసారి రూ.16,347 కోట్లకు స్టార్ ఐపీఎల్ ప్రసార హక్కులను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. మరి ఈసారి బరిలో ఎవరున్నారు? ప్యాకేజీలు ఏంటంటే?
ప్యాకేజీ వివరాలు
ఈ సారి బీసీసీఐ కనీస ధరను రూ.33,000 కోట్లకు పెంచింది. అంతేకాకుండా ఉమ్మడి బిడ్ వేయకుండా ఈ సారి హక్కులను విడదీసి వాటికి విలువ కట్టింది. భారత ఉపఖండంలో ఐపీఎల్ బ్రాడ్‌కాస్టింగ్‌కు ఒక్కో మ్యాచుకు రూ.49 కోట్లు ధర పెట్టింది. మొత్తం 74 మ్యాచులకు రూ.18,130 కోట్లుగా నిర్ణయించింది. ఇండియన్ సబ్‌కాంటినెట్ డిజిటల్ రైట్స్‌కు ఒక్కో మ్యాచుకు రూ.33 కోట్లు, మొత్తంగా ఐదేళ్లకు రూ.12,210 కోట్లు కనీసం నిర్ణయించింది. డిజిటల్ నాన్ ఎక్స్‌క్లూజివ్ ప్యాకేజీ కింద 18 మ్యాచులకు ఒక్కో మ్యాచుకు రూ.16 కోట్ల చొప్పున 74 మ్యాచులకు రూ.1440 కోట్లుగా నిర్ణయించింది. ఈ ప్యాకేజీలో ఆరంభ మ్యాచ్, 4 ప్లేఆఫ్ మ్యాచులు, 13 ఈవినింగ్ డబుల్ హెడర్లు ఉంటాయి. సబ్‌కాంటినెట్‌కు ఆవల ఒక్కో మ్యాచుకు రూ.3 కోట్లు మొత్తంగా ఐదేళ్లకు రూ.1110 కోట్లు వసూలు చేయనుంది.
Also Read: ఐపీఎల్ మీడియా హక్కుల వేలంలో బీసీసీఐకి వరుస షాకులు!
పోటీలో ఎవరున్నారు?
వయాకామ్ 18, డిస్ట్నీ ప్లస్ హాట్‌స్టార్, జీ, సోనీ సంస్థలు వేలం బరిలో నిలిచాయి. జెఫ్ బెజోస్‌కు చెందిన అమెజాన్ రేసు నుంచి తప్పుకుంది. జీ మీడియా సైతం కొన్ని రకాల ప్యాకేజీల్లో పోటీ పడటం లేదు. టైమ్స్ ఇంటర్నెట్, ఫ్యాన్ కోడ్, ఫన్ ఆసియా, డ్రీమ్ 11 వంటి కంపెనీలు డిజిటల్ హక్కుల బరిలో ఉన్నాయి. సూపర్ స్పోర్ట్స్ (దక్షిణాఫ్రికా), స్కై స్పోర్ట్స్ (బ్రిటన్) విదేశీ హక్కుల బరిలో ఉన్నాయి.
సీజన్‌కు ఎన్ని మ్యాచులు?
ప్రస్తుతం 74 మ్యాచులు జరుగుతున్నాయి. ఈ సంఖ్యను మరింత పెంచాలని బీసీసీఐ భావిస్తోంది. ఐదేళ్ల హక్కుల సైకిల్‌లో ఆఖరి రెండు సీజన్లలో మ్యాచుల సంఖ్య 94కు వెళ్లే అవకాశం ఉంది.
Also Read: ఇలా చేశావేంటి మిల్లర్! భారత్‌పై ఇలాంటి రికార్డుల్ని ఇంకెవ్వరూ బ్రేక్ చేయలేదు తెలుసా!!