IND vs SL, 1st T20: ఇలా చేశావేంటి మిల్లర్! భారత్‌పై ఇలాంటి రికార్డుల్ని ఇంకెవ్వరూ బ్రేక్ చేయలేదు తెలుసా!!
IND vs SL, 1st T20: సఫారీలతో ఐదు టీ20ల సిరీసులో టీమ్‌ఇండియాకు శుభారంభం దక్కలేదు. దిల్లీ వేదికగా తలపడ్డ మొదటి టీ20లో కొన్ని రికార్డులు బద్దలయ్యాయి. అవేంటంటే!!
IND vs SL, 1st T20 Records: సఫారీలతో ఐదు టీ20ల సిరీసులో టీమ్‌ఇండియాకు శుభారంభం దక్కలేదు. 212 పరుగుల టార్గెట్‌నూ పంత్ సేన రక్షించుకోలేదు. బ్యాటర్లు సృష్టించిన గెలుపు అవకాశాలను బౌలర్లు ఒడిసిపట్టలేదు. ఫలితంగా 0-1తో పంత్ సేన వెనకబడింది. అయితే దిల్లీ వేదికగా తలపడ్డ మొదటి టీ20లో కొన్ని రికార్డులు బద్దలయ్యాయి. అవేంటంటే!!
దక్షిణాఫ్రికాకు రికార్డు ఛేదన- Highest successful T20I run chases by SA
మొదట బ్యాటింగ్ చేసిన టీమ్‌ఇండియా 212 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింన సంగతి తెలిసిందే. ఈ టార్గెట్‌ను సఫారీలు ఉఫ్! అని ఊదేశారు. వారి టీ20 చరిత్రలో ఇదే అత్యధిక లక్ష్య ఛేదన. అంతకు ముందు 2007లో జోహన్నెస్ బర్గ్‌లో వెస్టిండీస్‌పై 206, టీమ్‌ఇండియాపై 2015లో ధర్మశాలలో 200, 2018లో సెంచూరియన్‌లో 189ని విజయవంతంగా ఛేజ్ చేశారు.
Also Read: పంత్ అదేం స్ట్రాటజీ! టీమ్‌ఇండియా ఓటమికి 4 రీజన్స్!
టీమ్‌ఇండియాపై ఇదే రికార్డు - Highest successful T20I run chases vs India
భారత జట్టుపై ఒక ప్రత్యర్థి ఛేదించిన అత్యధిక లక్ష్యమూ ఇదే. టీ20 చరిత్రలో టీమ్‌ఇండియా ఎప్పుడూ ఇలాంటి టార్గెట్‌ను రక్షించుకోవడంలో విఫలం కాలేదు. గతంలో 2015లో సపారీల చేతిలోనే 200ను కాపాడుకోవడంలో విఫలమైంది. 2016లో ముంబయిలో వెస్టిండీస్ మనపై 193ను ఛేదించింది.
అత్యధిక విజయాల రికార్డుకు బ్రేక్ - Most consecutive wins in T20Is
ఈ పరాజయంతో టీమ్‌ఇండియా ఓ అరుదైన రికార్డును సృష్టించే అవకాశాన్ని కోల్పోయింది. 2021 నవంబర్ నుంచి 2022 సెప్టెంబర్ మధ్య భారత్ వరుసగా 12 టీ20ల్లో విజయం అందుకుంది. మొదటి మ్యాచులో గెలిచుంటే ప్రపంచంలోనే తొలిసారి ఈ రికార్డు మనకు దక్కేది. ఇప్పుడు అఫ్గానిస్థాన్‌తో కలిసి పంచుకోవాల్సి వస్తోంది. ఆ జట్టు 2018 ఫిబ్రవరి - 2019 సెప్టెంబర్ మధ్య 12, 2016 మార్చి - 2017 మార్చి మధ్య 11 వరుస విజయాలు అందుకుంది. రొమేనియా (12), ఉగాండా (11) ఉన్నా అవి చిన్న జట్లు.
రెండో బెస్ట్ పాట్నర్‌షిప్
Highest fourth wicket partnerships in T20Is (Full Member sides)
ఈ మ్యాచులో డేవిడ్ మిల్లర్, వాండర్ డుసెన్ కలిసి 131 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పారు. ఇది ఐసీసీ శాశ్వత సభ్యులు ఆడిన టీ20 క్రికెట్లో నాలుగో వికెట్‌కు రెండో అతిపెద్ద భాగస్వామ్యం. అంతకు ముందు 2016లో దక్షిణాఫ్రికాపై డేవిడ్ వార్నర్, మాక్స్‌వెల్ 161 పరుగులు చేశారు. 2020లో కేప్‌టౌన్‌లో ఇంగ్లాండ్‌పై డుప్లెసిస్, డుసెన్ 127 రన్స్ కొట్టారు.
MILLER TIME 🧨
— Cricket South Africa (@OfficialCSA) June 9, 2022
5⃣0⃣* runs
2⃣2⃣ balls
His 5⃣th T20I half-century#INDvSA #BePartOfIt pic.twitter.com/q5A3ZPfE60