News
News
X

IND vs SA, 1st T20: పంత్‌ అదేం స్ట్రాటజీ! టీమ్‌ఇండియా ఓటమికి 4 రీజన్స్‌!

IND vs SL, 1st T20, Arun Jaitley Stadium: దక్షిణాఫ్రికాతో టీ20 సిరీసు (India vs SouthAfrica T20 series)ను టీమ్‌ఇండియా ఓటమితో ఆరంభించింది. రిషభ్ పంత్‌ సేన ఓటమికి 4 ప్రధాన కారణాలు కనిపిస్తున్నాయి.

FOLLOW US: 
Share:

Top Four Reasons for India loss against South Africa: దక్షిణాఫ్రికాతో టీ20 సిరీసు (India vs SouthAfrica T20 series)ను టీమ్‌ఇండియా ఓటమితో ఆరంభించింది. దిల్లీ వేదికగా తలపడిన తొలి మ్యాచులో 7 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. 212 పరుగుల టార్గెట్‌నూ రక్షించుకోలేక చతికిల పడింది. బౌలర్లు సమష్టిగా విఫలమయ్యారు. రిషభ్ పంత్‌ సేన ఓటమికి 4 ప్రధాన కారణాలు కనిపిస్తున్నాయి.

విచిత్రంగా ప్రవర్తించిన పిచ్‌

అరుణ్‌ జైట్లీ పిచ్‌ సాధారణంగా నెమ్మదిగా మందకొడిగా ఉంటుంది. స్పిన్నర్లు, స్లో బౌలర్లకు సహకరిస్తుంది. వేగంలో మార్పులు చేసే హర్షల్‌ పటేల్‌ వంటి పేసర్లకు అనుకూలిస్తుంది. కానీ నిన్నటి వికెట్‌కు ఇందుకు భిన్నంగా కనిపించింది. మొదట ఊహించని విధంగా బంతి బౌన్స్, స్వింగ్‌ అయింది. బంతి ఎలా బౌన్స్‌ అవుతుందో తెలియక వికెట్‌ కీపర్‌ డికాక్‌ ఇబ్బంది పడ్డాడు. రెండో బ్యాటింగ్‌కు వచ్చేసరికి వికెట్‌ ఫ్లాట్‌గా మారింది.

ప్చ్‌.. బౌలర్లు!

ఈ మ్యాచులో ఓటమికి ప్రధాన కారణం బౌలర్ల వైఫల్యం! జట్టులో అంతా అనుభవం ఉన్నవారే. అంతా అత్యున్నత స్థాయి క్రికెట్‌ ఆడుతున్నవారే! ఐపీఎల్‌లో రాణించినవారే. కానీ దిల్లీలో మాత్రం తేలిపోయారు. ఆరుగురు బౌలింగ్‌ చేస్తే ఏకంగా ఐదుగురు ఓవర్‌కు 10పైగా రన్స్‌ ఇచ్చేశారు. కఠినమైన లెంగ్తుల్లో బంతులు వేయలేకపోయారు. క్వింటన్‌ డికాక్‌ ఔటయ్యాక అసలు వికెట్లే తీయలేదు. కనీసం పరుగుల్ని నియంత్రించి ఒత్తిడి తేలేకపోయారు.

మిల్లర్‌ మళ్లీ కిల్లర్‌ అయ్యాడు!

సఫారీలు గెలిచారంటే డేవిడ్ మిల్లర్‌ (64), డుసెన్‌ (75) బ్యాటింగే కారణం! వీరిద్దరి భాగస్వామ్యమే దక్షిణాఫ్రికాను రక్షించింది. మూడు వికెట్లు పడ్డ తర్వాత వీరిద్దరూ వికెట్‌ పడకుండా అడ్డుకున్నారు. డుసెన్‌ మొదట్లో ఇబ్బంది పడ్డా తన సహచరుడు మిల్లర్‌ నుంచి ప్రేరణ పొందాడు. శ్రేయస్‌ క్యాచ్‌ విడిచేయడంతో రెచ్చిపోయాడు. ఇక కిల్లర్‌ మిల్లర్‌ తన ఐపీఎల్‌ ఫామ్‌ను కంటిన్యూ చేశాడు. తనకిష్టమైనప్పుడు సునాయసంగా బౌండరీలు, సిక్సర్లు కొట్టేశాడు.

రిషభ్ పంత్‌ కెప్టెన్సీ!

రిషభ్‌ పంత్‌ కెప్టెన్సీ సైతం విమర్శల పాలైంది! టీమ్‌ఇండియాలో సాధారణంగా అక్షర్‌ పటేల్‌ను పవర్‌ప్లేలో బౌలింగ్‌ చేయిస్తారు. ఫీల్డ్‌ స్ప్రెడ్‌ అయ్యాక యూజీని దింపుతారు. పంత్‌ మాత్రం పవర్‌ప్లేలోనే యూజీకి బంతినివ్వడంతో ప్రిటోరియస్‌ దాడి చేశాడు. మూమెంటమ్‌ పోవడంతో బౌలర్‌ ఏం చేయలేకపోయాడు. మిడిల్‌ ఓవర్లలో రన్స్‌ కట్టడి చేయలేదు. హార్దిక్‌ పాండ్య సైతం తేలిపోయాడు. బౌలర్లను రొటేట్‌ చేయడంతో పంత్‌ ఇబ్బంది పడ్డాడు.

Published at : 10 Jun 2022 11:54 AM (IST) Tags: Hardik Pandya south africa Team India Rishabh Pant Ishan kishan Temba Bavuma Ind vs SA India vs South Africa IND Vs SA Highlights david miller IND Vs SA 1st T20I IND VS SA Match Highlights

సంబంధిత కథనాలు

GT vs CSK Weather Update: మొతేరాలో చినుకులు! గుజరాత్‌, చెన్నై మ్యాచ్‌ జరిగేనా?

GT vs CSK Weather Update: మొతేరాలో చినుకులు! గుజరాత్‌, చెన్నై మ్యాచ్‌ జరిగేనా?

IPL 2023 GT vs CSK: ధోనీ ముందు 'కుంగ్‌ఫూ' ఆటలా! బట్‌.. పాండ్య టీమే బాగుంది!

IPL 2023 GT vs CSK: ధోనీ ముందు 'కుంగ్‌ఫూ' ఆటలా! బట్‌.. పాండ్య టీమే బాగుంది!

TATA IPL 2023 : ఐపీఎల్ ఓపెనింగ్‌కు గ్లామర్ టచ్ ఇస్తున్న రష్మిక, తమన్నా

TATA IPL 2023 : ఐపీఎల్ ఓపెనింగ్‌కు గ్లామర్ టచ్ ఇస్తున్న రష్మిక, తమన్నా

IPL 2023: ఫస్ట్ మ్యాచ్‌లో ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఎంఎస్‌ ధోనీ!

IPL 2023: ఫస్ట్ మ్యాచ్‌లో ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఎంఎస్‌ ధోనీ!

IPL 2023: నేటి నుంచి ఐపీఎల్ 16వ సీజన్ ప్రారంభం- కొత్త రూల్స్‌తో సరికొత్తగా వచ్చేసిన లీగ్

IPL 2023: నేటి నుంచి ఐపీఎల్ 16వ సీజన్ ప్రారంభం- కొత్త రూల్స్‌తో సరికొత్తగా వచ్చేసిన లీగ్

టాప్ స్టోరీస్

నడ్డా తెలంగాణ పర్యటన రద్దు- 8న రానున్న ప్రధానమంత్రి

నడ్డా తెలంగాణ పర్యటన రద్దు- 8న రానున్న ప్రధానమంత్రి

ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌ రెడ్డి నిజంగా పార్టీ మారుతున్నారా? ఏపీబీ దేశంతో ఏమన్నారు?

ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌ రెడ్డి నిజంగా పార్టీ మారుతున్నారా? ఏపీబీ దేశంతో ఏమన్నారు?

Shaakuntalam: ‘శాకుంతలం’ నుంచి ‘మల్లిక’ వీడియో సాంగ్ రిలీజ్ - అందంతో కట్టిపడేస్తోన్న సమంత

Shaakuntalam: ‘శాకుంతలం’ నుంచి ‘మల్లిక’ వీడియో సాంగ్ రిలీజ్ - అందంతో కట్టిపడేస్తోన్న సమంత

YS Sharmila: టీఎస్‌పీఎస్సీ కార్యాలయం ఎదుట తీవ్ర ఉద్రిక్తత, వైఎస్ షర్మిల అరెస్టు

YS Sharmila: టీఎస్‌పీఎస్సీ కార్యాలయం ఎదుట తీవ్ర ఉద్రిక్తత, వైఎస్ షర్మిల అరెస్టు