IPL 2023: ‘ఐపీఎల్ 2023 ధోనికి చివరి సీజనా?’ - రోహిత్ ఇంట్రస్టింగ్ ఆన్సర్!
ఐపీఎల్ 2023 తర్వాత ధోని రిటైర్ అవుతాడా? రోహిత్ ఏమన్నాడు?
MS Dhoni and Rohit Sharma: ఐపీఎల్ 2023 తర్వాత మహేంద్ర సింగ్ ధోని క్రికెట్ నుండి రిటైర్ అవుతారా? ఈ ఐపీఎల్ మహేంద్ర సింగ్ ధోనీకి చివరి సీజన్ కానుందా? ఇలాంటి ప్రశ్నలు ఈ సీజన్‌లోనే కాకుండా గత అనేక ఐపీఎల్ సీజన్‌ల నుంచి వినిపిస్తున్నాయి. అయితే ధోనీ ప్రతి సంవత్సరం వాటన్నింటినీ మార్చేస్తూ ఉంటాడు. ఈసారి ఐపీఎల్ సీజన్ ప్రారంభానికి ముందు రోహిత్ శర్మకు ధోని గురించి ఈ ప్రశ్న ఎదురైంది. విలేకరుల సమావేశంలో రోహిత్ ఈ ప్రశ్నకు సమాధానం ఇచ్చాడు.
ధోనీ రిటైర్‌మెంట్‌పై రోహిత్ స్పందన
IPL 2023 సీజన్ మార్చి 31వ తేదీ శుక్రవారం నుండి ప్రారంభం కానుంది. ఈ సీజన్‌లో వీక్షకులు తమ అభిమాన క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనిని మైదానంలో చూస్తారు. దీని గురించి రోహిత్ శర్మను విలేకరుల సమావేశంలో అడిగారు. ‘మహేంద్ర సింగ్ ధోని ఐపీఎల్ 2023 తర్వాత రిటైర్ అవుతారా?’ అనే ప్రశ్న రోహిత్‌కు ఎదురైంది.
ఈ ప్రశ్న విన్న రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ ప్రీ-ప్రెస్ కాన్ఫరెన్స్‌లో కాస్త ఇబ్బందికరమైన స్వరంతో, "ఈ సీజన్ మహేంద్ర సింగ్ ధోనికి చివరి ఐపీఎల్ సీజన్ అవుతుందని నేను గత 2-3 సంవత్సరాలుగా వింటున్నాను. అతను ఇంకా ఫిట్‌గా ఉన్నాడని నేను భావిస్తున్నాను. మరికొన్ని సీజన్లు ఆడటానికి తన ఫిట్‌నెస్ సరిపోతుంది." అని సమాధానం ఇచ్చాడు.
ధోని చివరి ఐపీఎల్ మ్యాచ్ ఎక్కడ జరగనుంది?
రోహిత్ ఈ ప్రకటన విన్న తర్వాత మీడియా, జనాలు ఎంత మాట్లాడుకున్నా ధోని ప్రస్తుతం ఐపీఎల్‌కు గుడ్‌బై చెప్పే మూడ్‌లో లేడు అనిపిస్తోంది. అయితే మహేంద్ర సింగ్ ధోని ఒకసారి ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ తన పదవీ విరమణ కోసం ఒక ప్రణాళికను రూపొందించినట్లుగా తన షెడ్యూల్‌ను ఉంచుకుంటాడని అందరికీ తెలిసిందే.
ఐపీఎల్‌లో తన చివరి మ్యాచ్ ఎప్పుడు జరిగినా అది చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరుగుతుందని మహేంద్ర సింగ్ ధోని ఒకానొక సందర్భంలో చెప్పాడు. అటువంటి పరిస్థితిలో ధోనీ జట్టు ఈ సంవత్సరం ఫైనల్స్‌కు చేరుకుంటే ఖచ్చితంగా ఇది ధోనీకి చివరి సీజన్ కాదు. ఎందుకంటే ఈసారి ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతుంది.
ఐపీఎల్‌లో మోస్ట్ సక్సెస్‌పుల్ టీమ్ చెన్నై సూపర్‌కింగ్స్! మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వమే దానికి కొండంత బలం! నిషేధం తర్వాత కప్పు గెలిచి గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చింది. అలాంటిది మూడేళ్లుగా సీఎస్‌కేకు అన్నీ అపశకునాలే! బ్యాటర్లు రాణిస్తే బౌలర్లు ఫెయిల్. లేదంటే కలిసికట్టుగా విఫలమవుతున్నారు. కీలక క్రికెటర్లు గాయాలతో దూరమవుతున్నారు. నేడే, రేపో మహీ రిటైర్మెంట్ తప్పదు! దాంతో కెప్టెన్సీ సమస్యలూ ఎదుర్కోకతప్పదు.
మూడేళ్ల తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ చిదంబరం మైదానంలో మళ్లీ మ్యాచులు ఆడుతోంది. ఒక రకంగా చెప్పాలంటే ఈ స్టేడియం, ఇక్కడి వాతావరణం ఎంఎస్ ధోనీకి కొట్టిన పిండి! ఎప్పుడు వర్షం పడుతుంది? ఏ దిశలో గాలి వీస్తుందో సహా అన్నీ చెప్పగలడు. ధోనీ ప్లస్ చెపాక్ కాంబినేషన్ ప్రత్యర్థులకు యమా డేంజర్! అయితే ఈ సీజన్లో తొలి ఏడు మ్యాచుల్లో నాలుగు బయటే ఆడాల్సి వస్తోంది. పైగా కొందరు పేసర్లు అందుబాటులో ఉండటం లేదు. సీఎస్‌కే ఎక్కువగా లంక బౌలర్లపై ఆధారపడుతోంది. న్యూజిలాండ్ సిరీసు వల్ల వాళ్లు నాలుగైదు మ్యాచులకు రావడం లేదు. ఇక తుది జట్టు కూర్పూ అంత ఈజీగా సెట్టయ్యేట్టు లేదు.