News
News
X

IPL 2023: ఐపీఎల్ 2023లో పంజాబ్ కింగ్స్ పూర్తి షెడ్యూలు - మొదటి మ్యాచ్ కోల్‌కతాతో!

ఐపీఎల్ 2023 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ షెడ్యూలు ఇదే.

FOLLOW US: 
Share:

Punjab Kings IPL 2023 Schedule: ఐపీఎల్ 2023 సీజన్ మార్చి 31వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. టోర్నీలో మొదటి మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరుగుతుంది. ఐపీఎల్ 16వ సీజన్‌లో పంజాబ్ కింగ్స్ ఏప్రిల్ 1వ తేదీన కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరగనున్న మ్యాచ్‌లో తమ ప్రస్థానాన్ని ప్రారంభించనుంది.

IPL 2023 షెడ్యూల్ గురించి చెప్పాలంటే ఈ సీజన్‌లో మొత్తం 10 జట్లు తలపడనున్నాయి. వీటి మధ్య మొత్తం 74 మ్యాచ్‌లు జరుగుతాయి. వాటిలో 70 మ్యాచ్‌లు లీగ్ దశలో, నాలుగు మ్యాచ్‌లు ప్లేఆఫ్‌లో జరగనున్నాయి. లీగ్ దశలో అన్ని జట్లు తలో 14 మ్యాచ్‌లు ఆడనున్నాయి. ఈ సీజన్‌లో చివరి లీగ్ మ్యాచ్ 2023 మే 21వ తేదీన జరగనుంది. ఫైనల్ మ్యాచ్‌ను మే 28వ తేదీన నిర్ణయించారు.

ఈ ఏడాది ఐపీఎల్‌లో ప్రతి శని, ఆదివారాల్లో డబుల్ హెడర్‌ మ్యాచ్‌లు కూడా ఆడనున్నారు. ఈ విధంగా ఈ సీజన్‌లో మొత్తం 18 డబుల్ హెడర్‌ మ్యాచ్‌లు ఉన్నాయి. ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. పంజాబ్ కింగ్స్ పూర్తి షెడ్యూలుపై ఓ లుక్కేద్దాం.

పంజాబ్ కింగ్స్ షెడ్యూల్

1 ఏప్రిల్ 2023: పంజాబ్ కింగ్స్ vs కోల్‌కతా నైట్ రైడర్స్, PCA స్టేడియం, మొహాలీ

5 ఏప్రిల్ 2023: పంజాబ్ కింగ్స్ vs రాజస్థాన్ రాయల్స్, ACA స్టేడియం, గౌహతి

9 ఏప్రిల్ 2023: పంజాబ్ కింగ్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజీవ్ గాంధీ స్టేడియం, హైదరాబాద్

13 ఏప్రిల్ 2023: పంజాబ్ కింగ్స్ vs గుజరాత్ టైటాన్స్, PCA స్టేడియం, మొహాలీ

15 ఏప్రిల్ 2023: పంజాబ్ కింగ్స్ vs లక్నో సూపర్ జెయింట్స్, ఎకానా స్టేడియం, లక్నో

20 ఏప్రిల్ 2023: పంజాబ్ కింగ్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, PCA స్టేడియం, మొహాలీ

22 ఏప్రిల్ 2023: పంజాబ్ కింగ్స్ vs ముంబై ఇండియన్స్ వాంఖడే స్టేడియం, ముంబై

28 ఏప్రిల్ 2023: పంజాబ్ కింగ్స్ vs లక్నో సూపర్ జెయింట్స్, పిసిఎ స్టేడియం, మొహాలీ

30 ఏప్రిల్ 2023: పంజాబ్ కింగ్స్ vs చెన్నై సూపర్ కింగ్స్ చెపాక్ స్టేడియం, చెన్నై

3 మే 2023: పంజాబ్ కింగ్స్ vs ముంబై ఇండియన్స్, PCA స్టేడియం, మొహాలీ

8 మే 2023: పంజాబ్ కింగ్స్ vs కోల్‌కతా నైట్ రైడర్స్, ఈడెన్ గార్డెన్స్, కోల్‌కతా

13 మే 2023: పంజాబ్ కింగ్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్, అరుణ్ జైట్లీ స్టేడియం, ఢిల్లీ

17 మే 2023: పంజాబ్ కింగ్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్, PCA స్టేడియం, మొహాలీ

19 మే 2023: పంజాబ్ కింగ్స్ vs రాజస్థాన్ రాయల్స్, PCA స్టేడియం, మొహాలీ

పంజాబ్ కింగ్స్ స్క్వాడ్
వికెట్ కీపర్లు: జానీ బెయిర్‌స్టో (ఇంగ్లండ్), ప్రభ్‌సిమ్రాన్ సింగ్, జితేష్ శర్మ.

బ్యాటర్లు: శిఖర్ ధావన్, భానుక రాజపక్స (శ్రీలంక), ఎం. షారుక్ ఖాన్, అథర్వ తైదే, హర్‌ప్రీత్ భాటియా.

ఆల్ రౌండర్లు: రాజ్ బావా, రిషి ధావన్, లియామ్ లివింగ్‌స్టోన్ (ఇంగ్లండ్), సామ్ కర్రాన్ (ఇంగ్లండ్), సికందర్ రజా (జింబాబ్వే), శివమ్ సింగ్, మోహిత్ రాథీ.

బౌలర్లు: అర్ష్‌దీప్ సింగ్, బల్తేజ్ సింగ్, రాహుల్ చాహర్, నాథన్ ఎల్లిస్ (ఆస్ట్రేలియా), హర్‌ప్రీత్ బ్రార్, కగిసో రబడ (దక్షిణాఫ్రికా), విద్వాత్ కవేరప్ప.

Published at : 25 Feb 2023 10:52 PM (IST) Tags: Punjab Kings IPL IPL 2023 IPL 2023 Schedule PBKS Schedule in IPL 2023

సంబంధిత కథనాలు

IPL 2023: గాయం కారణంగా ఐపీఎల్‌కు ముఖేష్ చౌదరి దూరం - మరి చెన్నై ఎవర్ని సెలెక్ట్ చేసింది?

IPL 2023: గాయం కారణంగా ఐపీఎల్‌కు ముఖేష్ చౌదరి దూరం - మరి చెన్నై ఎవర్ని సెలెక్ట్ చేసింది?

Shaik Rasheed: అండర్-19 వైస్ కెప్టెన్సీ నుంచి చెన్నై సూపర్ కింగ్స్ దాకా - షేక్ రషీద్ గత రికార్డులు ఎలా ఉన్నాయి?

Shaik Rasheed: అండర్-19 వైస్ కెప్టెన్సీ నుంచి చెన్నై సూపర్ కింగ్స్ దాకా - షేక్ రషీద్ గత రికార్డులు ఎలా ఉన్నాయి?

Bhagath Varma: చెన్నై జట్టులో హైదరాబాదీ ప్లేయర్ - ఎవరీ కనుమూరి భగత్?

Bhagath Varma: చెన్నై జట్టులో హైదరాబాదీ ప్లేయర్ - ఎవరీ కనుమూరి భగత్?

Mohammed Siraj: సిరాజ్‌.. ఈసారి ఫైర్‌ చేసేది బుల్లెట్లే! సరికొత్త అస్త్రాలతో RCB పేసర్‌ రెడీ!

Mohammed Siraj: సిరాజ్‌.. ఈసారి ఫైర్‌ చేసేది బుల్లెట్లే! సరికొత్త అస్త్రాలతో RCB పేసర్‌ రెడీ!

Ambati Rayudu: రాయుడంటే ధోనీకి ఎందుకిష్టం! CSK 'మిడిల్‌ హోప్స్‌' అతడిమీదే!

Ambati Rayudu: రాయుడంటే ధోనీకి ఎందుకిష్టం! CSK 'మిడిల్‌ హోప్స్‌' అతడిమీదే!

టాప్ స్టోరీస్

CM Jagan Party Meet : ఏప్రిల్ 3న పార్టీ నేతలతో సీఎం జగన్ కీలక సమావేశం, కఠిన నిర్ణయాలుంటాయని జోరుగా ప్రచారం

CM Jagan Party Meet : ఏప్రిల్ 3న పార్టీ నేతలతో సీఎం జగన్ కీలక సమావేశం, కఠిన నిర్ణయాలుంటాయని జోరుగా ప్రచారం

Manchu Vishnu: మనోజ్‌తో గొడవపై మంచు విష్ణు ఊహించని ట్విస్ట్ - తాజా వీడియో చూస్తే తల పట్టుకుంటారు!

Manchu Vishnu: మనోజ్‌తో గొడవపై మంచు విష్ణు ఊహించని ట్విస్ట్ - తాజా వీడియో చూస్తే తల పట్టుకుంటారు!

Mla Raja Singh : ఎమ్మెల్యే రాజాసింగ్ పై ముంబయిలో కేసు నమోదు

Mla Raja Singh : ఎమ్మెల్యే రాజాసింగ్ పై ముంబయిలో కేసు నమోదు

Data Theft ED Case : సైబరాబాద్ డేటా చోరీ కేసులో ఈడీ ఎంటర్, మనీలాండరింగ్ కింద కేసు నమోదు

Data Theft ED Case : సైబరాబాద్ డేటా చోరీ కేసులో ఈడీ ఎంటర్, మనీలాండరింగ్ కింద కేసు నమోదు