News
News
X

MI IPL 2023 Schedule: ఐపీఎల్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ టీమ్ - మొదటి మ్యాచ్ ఎవరితో?

ఐపీఎల్ 2023లో ముంబై ఇండియన్స్ పూర్తి షెడ్యూలు ఇదే.

FOLLOW US: 
Share:

IPL 2023 Mumbai Indians Schedule: ఐపీఎల్ 2023 సీజన్ మరో నెల రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ సీజన్‌లో తొలి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఇరు జట్ల మధ్య ఈ మ్యాచ్ జరగనుంది. అదే సమయంలో ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్టు ముంబై ఇండియన్స్ మ్యాచ్‌ తన మొదటి మ్యాచ్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఆడనుంది. రోహిత్ శర్మ సారథ్యంలోని ముంబై ఇండియన్స్ ఏప్రిల్ 2వ తేదీన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగే మ్యాచ్‌తో తమ ఐపీఎల్ పోటీని ప్రారంభించనుంది. ఎం.చిన్నస్వామి స్టేడియంలో ఇరు జట్ల మధ్య ఈ మ్యాచ్ జరగనుంది.

ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది. అదే సమయంలో ముంబై ఇండియన్స్ తన రెండో మ్యాచ్‌ని చెన్నై సూపర్ కింగ్స్‌తో ఆడనుంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఇరు జట్ల మధ్య ఈ మ్యాచ్ జరగనుంది. ఈ సీజన్‌లో రోహిత్ శర్మ నేతృత్వంలోని ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్‌తో మూడో మ్యాచ్ ఆడనుంది. ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య ఈ మ్యాచ్ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు జరగనుంది.

IPL 2023లో ముంబై ఇండియన్స్ మ్యాచ్‌ల షెడ్యూల్
2 ఏప్రిల్ 2023 - ముంబై ఇండియన్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఎన్. చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు
8 ఏప్రిల్ 2023 - ముంబై ఇండియన్స్ vs చెన్నై సూపర్ కింగ్స్, వాంఖడే స్టేడియం ముంబై
11 ఏప్రిల్ 2023 - ముంబై ఇండియన్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్, అరుణ్ జైట్లీ స్టేడియం ఢిల్లీ
16 ఏప్రిల్ 2023 - ముంబై ఇండియన్స్ vs కోల్కతా నైట్ రైడర్స్, వాంఖడే స్టేడియం, ముంబై
18 ఏప్రిల్ 2023 - ముంబై ఇండియన్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం, హైదరాబాద్
22 ఏప్రిల్ 2023 - ముంబై ఇండియన్స్ vs పంజాబ్ కింగ్స్, వాంఖడే స్టేడియం, ముంబై
25 ఏప్రిల్ 2023 - ముంబై ఇండియన్స్ vs గుజరాత్ టైటాన్స్, నరేంద్ర మోడీ స్టేడియం, అహ్మదాబాద్
30 ఏప్రిల్ 2023 - ముంబై ఇండియన్స్ vs రాజస్థాన్ రాయల్స్, వాంఖడే స్టేడియం, ముంబై
3 మే 2023 - ముంబై ఇండియన్స్ vs పంజాబ్ కింగ్స్, PCA స్టేడియం, మొహాలి
6 మే 2023 - ముంబై ఇండియన్స్ vs చెన్నై సూపర్ కింగ్స్, చెపాక్ స్టేడియం, చెన్నై
9 మే 2023 - ముంబై ఇండియన్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, వాంఖడే స్టేడియం, ముంబై
12 మే 2023 - ముంబై ఇండియన్స్ vs గుజరాత్ టైటాన్స్, వాంఖడే స్టేడియం, ముంబై
16 మే 2023 - ముంబై ఇండియన్స్ vs లక్నో సూపర్ జాయింట్స్, ఎకానా స్టేడియం, లక్నో
21 మే 2023 - ముంబై ఇండియన్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్, వాంఖడే స్టేడియం, ముంబై

ముంబై ఇండియన్స్ స్క్వాడ్ వివరాలు
వికెట్ కీపర్లు: ఇషాన్ కిషన్, ట్రిస్టన్ స్టబ్స్ (దక్షిణాఫ్రికా), విష్ణు వినోద్.

బ్యాటర్స్: రోహిత్ శర్మ, టిమ్ డేవిడ్ (ఆస్ట్రేలియా), రమణదీప్ సింగ్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, డెవాల్డ్ బ్రీవిస్ (దక్షిణాఫ్రికా).

ఆల్ రౌండర్లు: నెహాల్ వధేరా, షామ్స్ ములానీ, డువాన్ జాన్సెన్ (దక్షిణాఫ్రికా), కామెరాన్ గ్రీన్ (ఆస్ట్రేలియా).

బౌలర్లు: జోఫ్రా ఆర్చర్ (ఇంగ్లండ్), జస్ప్రీత్ బుమ్రా, అర్షద్ ఖాన్, జాసన్ బెహ్రెండార్ఫ్ (ఆస్ట్రేలియా), కుమార్ కార్తికేయ, ఆకాష్ మాధ్వల్, హృతిక్ షోకీన్, అర్జున్ టెండూల్కర్, రాఘవ్ గోయల్, పీయూష్ చావ్లా, జే రిచర్డ్‌సన్ (ఆస్ట్రేలియా).

Published at : 28 Feb 2023 06:08 PM (IST) Tags: Mumbai Indians IPL 2023 Schedule Mumbai Indians Schedule In IPL 2023

సంబంధిత కథనాలు

Pragyan Ojha on Rohit Sharma: కిట్‌ కొనేందుకు పాల ప్యాకెట్లు అమ్మిన రోహిత్‌ శర్మ! అడిగితే ఎమోషనల్‌!

Pragyan Ojha on Rohit Sharma: కిట్‌ కొనేందుకు పాల ప్యాకెట్లు అమ్మిన రోహిత్‌ శర్మ! అడిగితే ఎమోషనల్‌!

Ganguly on Rishabh Pant: అలాంటి ఆటగాళ్లు ఈజీగా దొరకరు బాబూ - గంగూలీ!

Ganguly on Rishabh Pant: అలాంటి ఆటగాళ్లు ఈజీగా దొరకరు బాబూ - గంగూలీ!

Highest Runs Record: మూడు చారిత్రాత్మక రికార్డుల్లో దక్షిణాఫ్రికా - ఏ జట్టుకైనా సాధ్యం అవుతుందా?

Highest Runs Record: మూడు చారిత్రాత్మక రికార్డుల్లో దక్షిణాఫ్రికా - ఏ జట్టుకైనా సాధ్యం అవుతుందా?

Quinton de Kock: క్వింటన్ డికాక్ స్పెషల్ రికార్డు - ఎవ్వరికీ సాధ్యం కానిది!

Quinton de Kock: క్వింటన్ డికాక్ స్పెషల్ రికార్డు - ఎవ్వరికీ సాధ్యం కానిది!

IPL 2023: కెప్టెన్లను ఫైనల్ చేసిన అన్ని జట్లు - కోల్‌కతా కెప్టెన్‌గా సర్‌ప్రైజ్ ప్లేయర్!

IPL 2023: కెప్టెన్లను ఫైనల్ చేసిన అన్ని జట్లు - కోల్‌కతా కెప్టెన్‌గా సర్‌ప్రైజ్ ప్లేయర్!

టాప్ స్టోరీస్

Delhi Liquor Case: ఎమ్మెల్సీ కవితకు ఈడీ జాయింట్ డైరెక్టర్ లేఖ, ఈడీ ఆఫీస్‌కు లీగల్ అడ్వైజర్ సోమా భరత్

Delhi Liquor Case: ఎమ్మెల్సీ కవితకు ఈడీ జాయింట్ డైరెక్టర్ లేఖ, ఈడీ ఆఫీస్‌కు లీగల్ అడ్వైజర్ సోమా భరత్

Visakhapatnam: చనిపోతామంటూ భార్యాభర్తల సెల్ఫీ వీడియో! చూస్తే కన్నీళ్లే - కాలువ వద్ద షాకింగ్ సీన్

Visakhapatnam: చనిపోతామంటూ భార్యాభర్తల సెల్ఫీ వీడియో! చూస్తే కన్నీళ్లే - కాలువ వద్ద షాకింగ్ సీన్

Adipurush Update : వైష్ణో దేవి ఆశీస్సులు తీసుకున్న 'ఆదిపురుష్' దర్శక, నిర్మాతలు - ప్రభాస్ సినిమాకు నయా ప్లాన్

Adipurush Update : వైష్ణో దేవి ఆశీస్సులు తీసుకున్న 'ఆదిపురుష్' దర్శక, నిర్మాతలు - ప్రభాస్ సినిమాకు నయా ప్లాన్

MLA Durgam Chinnaiah: వివాదంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే! మహిళ సంచలన ఆరోపణలు, కోడ్‌ భాష‌లో ఛాటింగ్‌!

MLA Durgam Chinnaiah: వివాదంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే! మహిళ సంచలన ఆరోపణలు, కోడ్‌ భాష‌లో ఛాటింగ్‌!