Ruturaj Gaikwad: మొదటి మ్యాచ్‌లో రుతురాజ్ వీర విహారం - 23 బంతుల్లోనే అర్థ సెంచరీ!
ఐపీఎల్ మొదటి మ్యాచ్‌లో రుతురాజ్ గైక్వాడ్ 92 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు.
Indian Premier League 2023: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2023 సీజన్‌లో తొలి మ్యాచ్‌లోనే అభిమానులు రుతురాజ్ గైక్వాడ్ అద్భుతమైన ఇన్నింగ్స్ చూశారు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ రుతురాజ్ గైక్వాడ్ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తూ కేవలం 23 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. ఈ మ్యాచ్‌లో గైక్వాడ్ బ్యాట్ 50 బంతుల్లోనే 92 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్‌ను నమోదు చేసింది.
ఇన్నింగ్స్ ప్రారంభంలో కొంత సమయం తీసుకున్న తర్వాత రుతురాజ్ గైక్వాడ్ అద్భుతమైన సిక్సర్లు కొట్టడం ప్రారంభించాడు. ఇందులో గైక్వాడ్ కేవలం 23 బంతుల్లోనే తన అర్ధ సెంచరీని పూర్తి చేశాడు. రికార్డుల జాబితాలో తన పేరును లిఖించుకున్నాడు. ఇప్పుడు రుతురాజ్ గైక్వాడ్ ఐపీఎల్ మ్యాచ్‌లో ఫాస్ట్ హాఫ్ సెంచరీ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లలో 11వ స్థానంలో ఉన్నాడు.
2014 ఐపీఎల్ సీజన్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌పై కేవలం 14 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించిన సురేష్ రైనా చెన్నై సూపర్ కింగ్స్ నుంచి ఐపీఎల్‌లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో రుతురాజ్ గైక్వాడ్ 92 పరుగుల ఇన్నింగ్స్‌లో మొత్తం తొమ్మిది సిక్సర్లు కొట్టాడు.
ఐపీఎల్‌లో గుజరాత్‌పై అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డు
రుతురాజ్ గైక్వాడ్ ఇప్పుడు ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్‌పై అత్యధిక వ్యక్తిగత స్కోరర్‌గా నిలిచాడు. అంతకుముందు ఈ రికార్డు గత సీజన్‌లో గుజరాత్‌పై 89 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన జోస్ బట్లర్ పేరిట ఉంది. జోస్ బట్లర్ రాజస్తాన్ రాయల్స్ తరఫున ఆడుతున్నాడు. ఇది కాకుండా రుతురాజ్ గైక్వాడ్ గత సీజన్‌లో ఆడిన 73 పరుగుల ఇన్నింగ్స్ ఈ జాబితాలో మూడో స్థానంలో ఉంది.
గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న ఐపీఎల్ మొదటి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఓ మోస్తరు స్కోరును సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ధోని సేన 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 178 పరుగులు సాధించింది. రుతురాజ్ గైక్వాడ్ (92: 50 బంతుల్లో, నాలుగు ఫోర్లు, తొమ్మిది సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. గుజరాత్ విజయానికి 120 బంతుల్లో 179 పరుగులు కావాలి.
గుజరాత్ టైటాన్స్ తుది జట్టు
వృద్ధిమాన్ సాహా(వికెట్ కీపర్), శుభమాన్ గిల్, కేన్ విలియమ్సన్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), విజయ్ శంకర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, మహ్మద్ షమీ, జాషువా లిటిల్, యశ్ దయాల్, అల్జారీ జోసెఫ్
సబ్‌స్టిట్యూట్స్ (వీరిలో ఒకరిని ఇంపాక్ట్ ప్లేయర్‌గా తీసుకోవచ్చు)
ఆర్ సాయి సుదర్శన్, జయంత్ యాదవ్, మోహిత్ శర్మ, అభినవ్ మనోహర్, శ్రీకర్ భరత్
చెన్నై సూపర్ కింగ్స్ తుది జట్టు
డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, మొయిన్ అలీ, బెన్ స్టోక్స్, అంబటి రాయుడు, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, మహేంద్ర సింగ్ ధోని (కెప్టెన్, వికెట్ కీపర్), మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, రాజ్‌వర్ధన్ హంగర్గేకర్
సబ్‌స్టిట్యూట్స్ (వీరిలో ఒకరిని ఇంపాక్ట్ ప్లేయర్‌గా తీసుకోవచ్చు)
తుషార్ దేశ్‌పాండే, సుభ్రంషు సేనాపతి, షేక్ రషీద్, అజింక్య రహానే, నిషాంత్ సంధు