News
News
వీడియోలు ఆటలు
X

IPL Commentators List: గేల్, డివిలియర్స్, రైనా - ఈసారి కామెంటేటర్లు మామూలుగా లేరుగా - లిస్ట్ చూస్తే మైండ్ బ్లాక్!

ఐపీఎల్ 2023 సీజన్‌కు జియో సినిమాలో కామెంటేటర్లు వీరే.

FOLLOW US: 
Share:

IPL Commentators List For 2023: ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఉత్కంఠ మెల్లగా పెరుగుతోంది. ఈ గ్రాండ్ లీగ్ క్రికెట్‌ టోర్నమెంట్‌ను గెలుచుకోవడానికి మొత్తం 10 జట్లు తీవ్రంగా సిద్ధమవుతున్నాయి. అదే సమయంలో కామెంటేటర్లు తమ మాటల ద్వారా ఐపీఎల్ ఆనందాన్ని రెట్టింపు చేస్తారు. ఈసారి ఐపీఎల్‌ను జియో సినిమాలో కూడా ప్రసారం చేయనున్నారు. దీనికి సంబంధించి ఇప్పుడు హిందీ, ఇంగ్లీష్ కామెంటేటర్ల జాబితా బయటకు వచ్చింది.

ఈసారి మీరు కామెంటరీ ప్యానెల్‌లో ఎక్కువ మంది అనుభవజ్ఞులైన ఆటగాళ్ల గొంతులను వింటారు. ఒకవైపు మాజీ క్రికెటర్, వెటరన్ వ్యాఖ్యాత ఆకాష్ చోప్రా హిందీ కామెంటరీ ప్యానెల్‌లో తన వాయిస్‌తో మ్యాచ్ ఉత్సాహాన్ని రెట్టింపు చేయనున్నారు. క్రిస్ గేల్, ఏబీ డివిలియర్స్ ఈసారి ఇంగ్లీష్ కామెంటరీలోకి ప్రవేశించబోతున్నారు. మైదానంలో బ్యాట్‌తో విజృంభించిన ఈ ఇద్దరు దిగ్గజాలు ఇప్పుడు కామెంటరీ ద్వారా ప్రజల మనసులను గెలుచుకోనున్నారు.

ఐపీఎల్ 2023 కోసం హిందీ వ్యాఖ్యాతలు
ఒవైస్ షా, జహీర్ ఖాన్, సురేశ్ రైనా, అనిల్ కుంబ్లే, రాబిన్ ఉతప్ప, పార్థివ్ పటేల్, ఆర్పీ సింగ్, ప్రజ్ఞాన్ ఓజా, ఆకాశ్ చోప్రా, నిఖిల్ చోప్రా, సబా కరీం, అనంత్ త్యాగి, రిధిమా పాఠక్, సురభి వాలిడ్, గ్లెన్ సల్ధానా

ఐపీఎల్ 2023 కోసం ఆంగ్ల వ్యాఖ్యాతలు
సంజన గణేశన్, క్రిస్ గేల్, డివిలియర్స్, ఇయాన్ మోర్గాన్, బ్రెట్ లీ, గ్రేమ్ స్వాన్, గ్రేమ్ స్మిత్, స్కాట్ స్టైరిస్, సుప్రియా సింగ్, సోహైల్ చందోక్

తొలి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య
ఐపీఎల్ రాబోయే సీజన్ మార్చి 31వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈ గ్రాండ్ లీగ్‌లో తొలి మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్, మహేంద్ర సింగ్ ధోనీ నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరగనుంది. అహ్మదాబాద్‌లోని చారిత్రాత్మక నరేంద్ర మోదీ స్టేడియంలో ఇరు జట్ల మధ్య ఈ మ్యాచ్ జరగనుంది.

ఐపీఎల్‌లో మొత్తం 70 లీగ్ మ్యాచ్‌లు జరగనున్నాయి. టోర్నీలో చివరి లీగ్ మ్యాచ్ మే 21వ తేదీన బెంగళూరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ మధ్య జరగనుంది. ఐపీఎల్ 2022లో గుజరాత్ టైటాన్స్ తమ అరంగేట్ర సీజన్‌లోనే ట్రోఫీని గెలుచుకోవడం గమనార్హం. ఇక రెండో సీజన్‌లో టైటిల్‌ను ఎవరు గెలుచుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.

ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాజీ ఆటగాడు, యూనివర్స్ బాస్ అని అందరూ పిలుచుకునే క్రిస్ గేల్ మరోసారి ఆర్సీబీ జట్టులో చేరాడు. వాస్తవానికి, క్రిస్ గేల్ ఈసారి ఆటగాడిగా ఆర్సీబీలో భాగం కాలేడు. కానీ RCB హాల్ ఆఫ్ ఫేమ్‌లో అతని మాజీ ఆటగాడిని చేర్చుకుంటున్నారు. క్రిస్ గేల్ 2011 సంవత్సరంలో మొట్టమొదటి సారిగా RCBలో భాగమయ్యాడు. అతను 2017 సంవత్సరంలో బెంగళూరు తరఫున చివరి సీజన్‌ ఆడాడు. దీని తర్వాత కూడా క్రిస్ గేల్ IPLలో ఆడినప్పటికీ, పంజాబ్ కింగ్స్‌లో భాగమయ్యాడు.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సోషల్ మీడియాలో ఈ విషయాన్ని పోస్ట్ చేసింది. ఈ పోస్ట్‌లో క్రిస్ గేల్ ఫోటోను షేర్ చేస్తూ యూనివర్స్ బాస్ తనకు ఇష్టమైన ఇంటికి చేరుకున్నాడు అనే క్యాప్షన్‌ను రాశారు. ఆర్సీబీ పెట్టిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో అభిమానులకు బాగా నచ్చింది. వాస్తవానికి RCB తన మాజీ ఆటగాళ్ళు క్రిస్ గేల్, ఏబీ డివిలియర్స్‌లను హాల్ ఆఫ్ ఫేమ్‌లోకి చేర్చుతోంది. ఇది కాకుండా ఇద్దరు మాజీ ఆటగాళ్ల గౌరవార్థం జెర్సీ నంబర్‌ను రిటైర్ చేయాలని నిర్ణయించారు. అంటే భవిష్యత్తులో వీరి జెర్సీ నంబర్లు ఎవరికీ ఇవ్వరన్న మాట.

Published at : 30 Mar 2023 01:10 AM (IST) Tags: Indian Premier League IPL IPL 2023 IPL Commentators List

సంబంధిత కథనాలు

IND VS AUS: టీమిండియాకు ‘హెడ్’ షాట్ - ఫైనల్ తొలి రోజు ఆస్ట్రేలియాదే!

IND VS AUS: టీమిండియాకు ‘హెడ్’ షాట్ - ఫైనల్ తొలి రోజు ఆస్ట్రేలియాదే!

IND VS AUS: రెండో సెషన్‌లో ఆస్ట్రేలియా పైచేయి - అర్థ సెంచరీ సాధించిన ట్రావిస్ హెడ్!

IND VS AUS: రెండో సెషన్‌లో ఆస్ట్రేలియా పైచేయి - అర్థ సెంచరీ సాధించిన ట్రావిస్ హెడ్!

Travis Head: ట్రావిస్ హెడ్ పేరిట స్పెషల్ రికార్డు - క్లైవ్ లాయిడ్ తర్వాత!

Travis Head: ట్రావిస్ హెడ్ పేరిట స్పెషల్ రికార్డు - క్లైవ్ లాయిడ్ తర్వాత!

Making Of WTC Mace: ట్రోఫీలకు భిన్నంగా గద ఎందుకు? - తయారీ వెనుక ఉన్న ఆసక్తికర విషయాలివే!

Making Of WTC Mace: ట్రోఫీలకు భిన్నంగా గద ఎందుకు? - తయారీ వెనుక ఉన్న ఆసక్తికర విషయాలివే!

IND Vs AUS Final: రవిచంద్రన్ అశ్విన్‌కు దక్కని చోటు - భారత్‌కు ప్రమాదంగా మారుతుందా?

IND Vs AUS Final: రవిచంద్రన్ అశ్విన్‌కు దక్కని చోటు - భారత్‌కు ప్రమాదంగా మారుతుందా?

టాప్ స్టోరీస్

Lady VRO: చేతిలో పిల్లాడు ఉన్నా అక్రమ మైనింగ్‌ను అడ్డుకుని మహిళా వీఆర్వో సాహసం

Lady VRO: చేతిలో పిల్లాడు ఉన్నా అక్రమ మైనింగ్‌ను అడ్డుకుని మహిళా వీఆర్వో సాహసం

తెలంగాణ రాజకీయాల్లో ‘ధరణి’ దుమారం- తగ్గేదేలే అంటున్న అధికార, ప్రతిపక్ష పార్టీలు!

తెలంగాణ రాజకీయాల్లో ‘ధరణి’ దుమారం- తగ్గేదేలే అంటున్న అధికార, ప్రతిపక్ష పార్టీలు!

NBK 108 Is Bhagavanth Kesari : అఫీషియల్‌గా బాలకృష్ణ సినిమా టైటిల్ చెప్పేశారోచ్ - ఇగ మాస్ ఊచకోత షురూ

NBK 108 Is Bhagavanth Kesari : అఫీషియల్‌గా బాలకృష్ణ సినిమా టైటిల్ చెప్పేశారోచ్ - ఇగ మాస్ ఊచకోత షురూ

Kriti Sanon Tirumala Controversy : శేష వస్త్రంతో తిరుమలలో ముద్దులు, కౌగిలింతలా? - చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకుల ఆగ్రహం

Kriti Sanon Tirumala Controversy : శేష వస్త్రంతో తిరుమలలో ముద్దులు, కౌగిలింతలా? - చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకుల ఆగ్రహం