IPL 2021, RCB vs PBKS: రాహుల్ X కోహ్లీ... బెంగళూరును ఓడిస్తే పంజాబ్ బతుకుంది!
బెంగళూరుపై పంజాబ్‌దే పైచేయి. ఈ రెండు జట్లు 27 సార్లు తలపడగా పంజాబ్ 15, బెంగళూరు 12 సార్లు గెలిచాయి. చివరి ఐదు మ్యాచుల్లోనూ రాహుల్ సేననే మూడుసార్లు గెలిచింది. 2019 తర్వాత ఆర్‌సీబీ గెలవనేలేదు.
ఐపీఎల్-2021లో తమ భవితవ్యం తేల్చే పోరుకు పంజాబ్ కింగ్స్ సిద్ధమైంది. ఆదివారం షార్జా వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. కోహ్లీసేన మూడో స్థానంలో ఉన్నా ఈ మ్యాచులో గెలుపు ఆ జట్టుకూ కీలకమే. మరోవైపు రాహుల్ బృందం ప్రతి మ్యాచూ గెలవాల్సిన పరిస్థితి.
Also Read: ముంబయి.. ప్లీజ్ ఓడిపోవా! ప్లేఆఫ్స్ కోసం పంజాబ్, కోల్‌కతా కోరికలు!
పంజాబ్‌దే పైచేయి
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై పంజాబ్ కింగ్స్‌దే పైచేయి. ఇప్పటి వరకు ఈ రెండు జట్లు 27 సార్లు తలపడగా పంజాబ్ 15, బెంగళూరు 12 సార్లు గెలిచాయి. చివరి ఐదు మ్యాచుల్లోనూ రాహుల్ సేననే మూడుసార్లు గెలిచింది. 2019 తర్వాత ఆర్‌సీబీ వారిపై గెలవనేలేదు. ఈ సీజన్లో బెంగళూరు 11 మ్యాచుల్లో 7 గెలవగా పంజాబ్ 12 మ్యాచుల్లో 5 గెలిచింది. ఈ మ్యాచే కాకుండా మిగిలిన రెండింట్లోనూ గెలిస్తే రాహుల్ సేన ప్లేఆఫ్ అవకాశాలు సజీవంగా ఉంటాయి.
Also Read: నీటిలోనూ నీరజ్ కు అదే ఆలోచన.. స్కూబా డైవ్ చేస్తూ.. జావెలిన్ విసిరాడిలా..
కీలక సమయాల్లో ఒత్తిడి
గతేడాది నుంచీ పంజాబ్ కింగ్స్ కీలక సమయాల్లో వెనకబడిపోతోంది. అనవసర ఒత్తిడికి లోనై గెలిచే మ్యాచులనూ ఓడిపోతోంది. వీలైనంత మేరకు ఆ మానసిక ఒత్తిడి తొలగించుకుంటే మంచిది. యుజ్వేంద్ర చాహల్‌పై మయాంక్ అగర్వాల్‌కు తిరుగులేని రికార్డు ఉంది. అతడి బౌలింగ్‌ను చితకబాదేస్తాడు. కానీ ఔటయ్యే ప్రమాదమూ ఎక్కువే ఉంది. రాహుల్ తన ఫామ్‌ను కొనసాగించాలి. క్రిస్‌గేల్ లేని లోటును మార్‌క్రమ్ ఇంకా పూడ్చలేదు. పూరన్ నిలకడగా పరుగులు చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడెప్పుడో ఒక మ్యాచులో మురిపించిన దీపక్ హుడా మళ్లీ అలాంటి ఇన్నింగ్స్ ఆడలేదు. షారుక్ ఖాన్ రాగానే పరుగులు చేయడం ఉపశమనం కలిగించే అంశం. అర్షదీప్, షమి, రవి బిష్ణోయ్ బౌలింగ్‌లో కీలకం అవుతారు. సీజన్ తొలి మ్యాచులో కోహ్లీ, ఏబీడీ, మాక్సీని హర్‌ప్రీత్ బ్రార్ ఔట్ చేశాడు. బహుశా అతడికి మళ్లీ అవకాశం దొరకొచ్చు.
Also Read: ఫుట్‌బాల్ స్టార్ లియోనెల్ మెస్సీకి చేదు అనుభవం.. మ్యాచ్ నుంచి హోటల్ రూమ్‌కు వచ్చి చూస్తే షాక్
ఏబీ ఒక్కడే బాకీ
మిడిలార్డర్ బలోపేతం కావడంతో బెంగళూరుకు కాస్త ధీమాగా కనిపిస్తోంది. విరాట్‌కోహ్లీ కసిగానే ఆడుతున్నాడు. దేవదత్ పడిక్కల్ అతడితో కలిసి చక్కని ఓపెనింగ్ భాగస్వామ్యాలు అందిస్తున్నాడు. వీరిద్దరూ ఔటైనా.. ఆంధ్రా ఆటగాడు శ్రీకర్ భరత్ సమయోచిత ఇన్నింగ్సులు ఆడుతున్నాడు. ఆపై మాక్సీ తన స్విచ్‌హిట్ షాట్లతో దుమ్మురేపుతున్నాడు. భీకరమైన ఫామ్‌లో ఉన్నాడు. ఏబీ ఇప్పటి వరకు తన స్థాయి ప్రదర్శన చేయకపోవడమే బెంగళూరును వేధిస్తోంది. యూజీ మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. వికెట్లు తీస్తున్నాడు. మహ్మద్ సిరాజ్ సైతం డెత్‌లో వైవిధ్యమైన బౌలింగ్‌తో ఆకట్టుకుంటున్నాడు. హర్షల్ పటేల్ అత్యధిక వికెట్ల రికార్డు వేటలో ఉన్నాడు.