PBKS vs RR Live Updates: ఉత్కంఠ రేపినా రాజస్థాన్‌దే విజయం..
ఐపీఎల్‌లో సిక్సర్ల జట్లైన పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ తలపడుతున్నాయి. గెలిచిన జట్టుకు ప్లేఆఫ్స్ చేరుకొనేందుకు అవకాశాలు మెరుగవుతాయి. కేఎల్ రాహుల్, సంజుపై అంచనాలు భారీగా ఉన్నాయి.
LIVE
Background
దుబాయ్ వేదికగా పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ తలపడుతున్నాయి. ప్రస్తుతం పంజాబ్, రాజస్థాన్ పాయింట్ల పట్టికలో బాటమ్ ఫోర్‌లో ఉన్నాయి. సీజన్ తొలిదశలో చెరో మూడు విజయాలు సాధించి ఆరు పాయింట్లతో ఉన్నాయి. మెరుగైన రన్‌రేట్‌తో సంజు శాంసన్ సేన ఆరో స్థానంలో ఉంది. రాహుల్ బృందం ఏడో స్థానంలో నిలిచింది. రాజస్థాన్‌తో పోలిస్తే పంజాబ్ ఒక మ్యాచ్ ఎక్కువగానే ఆడటం గమనార్హం. ఈ రెండు జట్లు ప్లేఆఫ్స్‌కు చేరుకోవాలంటే అద్భుతంగా ఆడాలి. వరుస విజయాలు సాధించాలి.
ఇప్పటి వరకు ఈ రెండు జట్లు 22 సార్లు తలపడగా పంజాబ్ 12 గెలిచి 9 ఓడింది. ఒక మ్యాచ్ టై అయింది. చివరి ఐదు మ్యాచుల్లోనూ కింగ్స్‌దే ఆధిపత్యం. మూడింట్లో గెలిచింది. ఈ మధ్యకాలంలో వీరెప్పుడు తలపడ్డా పరుగుల వరద పారుతోంది. ప్రతి రెండుమ్యాచులకు ఒకసారి కనీసం 200 పరుగులైనా చేస్తున్నారు. లేదా ఛేదిస్తున్నారు.
ఈ మ్యాచులో కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, క్రిస్‌గేల్, నికోలస్ పూరన్, దీపక్ హుడా, షారుక్ ఖాన్, లియామ్ లివింగ్‌స్టన్, సంజు శాంసన్, ఇవిన్ లూయిస్‌పై అభిమానులకు భారీ అంచనాలు ఉన్నాయి. ఒకప్పుడు టీ20లకు పనికిరాడని పక్కనపెట్టేసిన లియామ్ లివింగ్ స్టన్ ది హండ్రెడ్‌లో చుక్కలు చూపించాడు. సరికొత్త షాట్లతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
ఉత్కంఠ రేపినా రాజస్థాన్‌దే విజయం..
ఆఖరి ఓవర్లో కార్తీక్ త్యాగీ అద్భుతం చేశాడు. రెండు వికెట్లు తీసి కేవలం 1 పరుగే ఇచ్చాడు. 2 పరుగుల తేడాతో రాజస్థాన్‌కు విజయం అందించాడు.
హుడా ఔట్.. టెన్షన్.. టెన్షన్
కార్తీక్ వేసిన 19.5వ బంతికి దీపక్ హుడా (0) ఔటయ్యాడు. పంజాబ్‌కు 1 బంతుల్లో 3 పరుగులు కావాలి.
పూరన్ ఔట్.. టెన్షన్.. టెన్షన్
కార్తీక్ వేసిన 19.3వ బంతికి పూరన్ (32) ఔటయ్యాడు. శాంసన్ క్యాచ్ అందుకున్నాడు. పంజాబ్‌కు 3 బంతుల్లో 3 పరుగులు కావాలి.
పంజాబ్ 19 ఓవర్లకు 182-2
ముస్తాఫిజుర్ కేవలం నాలుగు పరుగులే ఇచ్చాడు. బౌండరీలేమీ రాలేదు. పూరన్ (32), మార్‌క్రమ్ (25) గెలుపు షాట్ కోసం ప్రయత్నిస్తున్నారు. పంజాబ్ విజయానికి మరో 4 పరుగులే అవసరం.
పంజాబ్ 18 ఓవర్లకు 178-2
క్రిస్ మోరిస్ పది పరుగులు ఇచ్చాడు. మొదటి బంతిని మార్‌క్రమ్ (23) సూపర్ సిక్సర్‌గా మలిచాడు. పూరన్ (30) అతడికి తోడుగా ఉన్నాడు. పంజాబ్ విజయానికి 12 బంతుల్లో 8 పరుగులు అవసరం.