DC vs CSK Live Updates: 19.4 ఓవర్లలో ఢిల్లీ స్కోరు 139-7, మూడు వికెట్లతో ఢిల్లీ విజయం
IPL 2021, Match 50, DC vs CSK: ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.
LIVE
Background
ఐపీఎల్‌లో నేడు ఢిల్లీ క్యాపిటల్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది. ఈ రెండు జట్లూ ఇప్పటికే ప్లేఆఫ్స్‌కు క్వాలిఫై అయ్యాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఈ సీజన్‌లో నంబర్ వన్ జట్టు అయ్యే చాన్స్ ఉంది. రాజస్తాన్‌తో మ్యాచ్‌లో చెన్నై బౌలర్లు ఘోరంగా విఫలం అయ్యారు. దీపక్ చాహర్, డ్వేన్ బ్రేవో లేని లోటు అత్యంత స్పష్టంగా కనిపించింది. కాబట్టి నేటి మ్యాచ్‌లో ఈ ఇద్దరూ తిరిగి బరిలోకి దిగే అవకాశం ఉంది. ఇక చెన్నై బ్యాటింగ్ దుర్భేద్యంగా ఉంది. రుతురాజ్ ఆరెంజ్ క్యాప్‌ను సాధించగా, డుఫ్లెసిస్ కూడా అవసరమైన పరుగులు చేస్తున్నారు. మిడిలార్డర్‌లో మొయిన్ అలీ, రాయుడు, జడేజాలు కూడా బాగా ఆడుతున్నారు.
ఇక ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో కూడా పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. పృథ్వీ షా ఈ మ్యాచ్‌లో జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. స్టీవ్ స్మిత్‌కు తుదిజట్టులో చోటు లభించడం ఖాయంగా కనిపిస్తుంది. షా, ధావన్, స్టీవ్ స్మిత్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ అందరూ ఫాంలో ఉన్నారు. బౌలింగ్‌లో అవేష్ ఖాన్, నోర్జే, రబడ, అక్షర్ పటేల్, అశ్విన్ తమ బాధ్యతను చక్కగా నెరవేరుస్తున్నారు. ఈ రెండు జట్ల మధ్య ఇప్పటివరకు 24 మ్యాచ్‌లు జరగ్గా.. 15 మ్యాచ్‌ల్లో చెన్నై విజయం సాధించింది. తొమ్మిది మ్యాచ్‌ల్లో ఢిల్లీ విజయం సాధించింది. ఈ సీజన్‌లో ఈ రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ అలవోకగా విజయం సాధించింది.
19.4 ఓవర్లలో ఢిల్లీ స్కోరు 139-7, మూడు వికెట్లతో ఢిల్లీ విజయం
19.4 ఓవర్లలో ఢిల్లీ మ్యాచ్ ముగించింది. మూడు వికెట్లతో విజయం సాధించింది.
అక్షర్ పటేల్ అవుట్
బ్రేవో బౌలింగ్‌లో అక్షర్ పటేల్ అవుటయ్యాడు.
అక్షర్ పటేల్ (సి) మొయిన్ అలీ (బి) బ్రేవో (5: 10 బంతుల్లో)
19 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ స్కోరు 131-6, లక్ష్యం 137 పరుగులు
జోష్ హజిల్‌వుడ్ వేసిన ఈ ఓవర్లో 12 పరుగులు వచ్చాయి. 19 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ స్కోరు 131-6గా ఉంది. ఢిల్లీ విజయానికి 6 బంతుల్లో 6 పరుగులు కావాలి.
షిమ్రన్ హెట్మేయర్ 26(17)
అక్షర్ పటేల్ 5(8)
జోష్ హజిల్‌వుడ్ 4-0-27-0
18 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ స్కోరు 121-6, లక్ష్యం 137 పరుగులు
బ్రేవో వేసిన ఈ ఓవర్లో 12 పరుగులు వచ్చాయి. 18 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ స్కోరు 121-6గా ఉంది. ఢిల్లీ విజయానికి 12 బంతుల్లో 16 పరుగులు కావాలి.
షిమ్రన్ హెట్మేయర్ 17(13)
అక్షర్ పటేల్ 4(6)
బ్రేవో 1-0-12-0
17 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ స్కోరు 109-6, లక్ష్యం 137 పరుగులు
శార్దూల్ ఠాకూర్ వేసిన ఈ ఓవర్లో ఐదు పరుగులు మాత్రమే వచ్చాయి. 17 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ స్కోరు 109-6గా ఉంది. ఢిల్లీ విజయానికి 18 బంతుల్లో 28 పరుగులు కావాలి.
షిమ్రన్ హెట్మేయర్ 8(9)
అక్షర్ పటేల్ 3(4)
శార్దూల్ ఠాకూర్ 4-0-13-2