IPL 2021: ఎందుకు తొలగించారో ఇప్పటికీ చెప్పలేదు.. సన్‌రైజర్స్‌కు వార్నర్ ప్రశ్నల పరంపర!
సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం తనను ఎందుకు కెప్టెన్సీ నుంచి తొలగించిందో చెప్పలేదని మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ అంటున్నాడు. ఏ నిర్ణయమైనా ఏకగ్రీవంగా తీసుకోవాల్సిందని సూచించాడు.
సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం తనను ఎందుకు కెప్టెన్సీ నుంచి తొలగించిందో చెప్పలేదని మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ అంటున్నాడు. ఏ నిర్ణయమైనా ఏకగ్రీవంగా తీసుకోవాల్సిందని సూచించాడు. జట్టు తరఫున వంద మ్యాచులాడిన ఆటగాడిని ఏం చెప్పకుండా ఎలా తొలగిస్తారని ప్రశ్నించాడు. ఏదేమైనా హైదరాబాద్‌కు ఆడటాన్ని తానెంతగానో ప్రేమించానని స్పష్టం చేశాడు.
Also Read: విరాట్ కోహ్లీ కెప్టెన్సీపై ఆర్సీబీ ప్లేయర్ డివిలియర్స్ ఆసక్తికర వ్యాఖ్యలు
'ఎలా చెప్పాలో నాకర్థం కావడం లేదు. జట్టు యాజమాన్యంపై నాకెతో గౌరవం ఉంది. ట్రెవర్ బేలిస్, లక్ష్మణ్, మూడీ, మురళీధరన్‌ను నేను గౌరవిస్తాను. ఏదేమైనా ఒక నిర్ణయం తీసుకుంటే అది ఏకగ్రీవంగా ఉండాలి. ఎవరు మనకు అండగా ఉంటారో? ఉండరో మనకే తెలియదు' అని డేవిడ్ వార్నర్ అన్నాడు.
Also Read: ధోనీ ది గ్రేట్! పారితోషికం తీసుకోకుండానే మెంటార్‌గా సేవలు
'నన్ను నిరాశపరిచిన అంశం మరొకటి ఉంది. నన్ను సారథ్యం నుంచి ఎందుకు తొలగించారో వివరించలేదు. మీరు కేవలం ఫామ్ మాత్రమే ఆధారం అనుకుంటే అదెంతో కష్టం. గతంలో సాధించినదానికి కొంత వెయిటేజీ ఉంటుందనే అనుకుంటాం కదా! అదీ జట్టుకు వందకు పైగా మ్యాచులు ఆడినప్పుడు ఆశిస్తాం కదా' అని వార్నర్ చెప్పాడు.
Also Read: 15-20శాతం తగ్గిన ఐపీఎల్ రేటింగ్.. స్టార్ సతమతం.. ఆందోళనలో అడ్వర్టైజర్లు!
'చెన్నైలో ఆడిన ఐదింట్లో నాలుగు మ్యాచుల్లో నేనంత బాగా ఆడలేదు. అదెంతో కష్టం. మింగుడుపడని విషయం. ఇప్పటికీ నా ప్రశ్నలకు జవాబులు దొరకలేదు. ఏదేమైనా మనం ముందుకు వెళ్లాల్సిందే. సన్‌రైజర్స్‌కు ప్రాతినిధ్యం వహించాడన్ని నేను ప్రేమించాను. తుది నిర్ణయం మాత్రం యజమానులదే' అని డేవిడ్ వాడర్న్ పేర్కొన్నాడు. ఈ మధ్యే హైదరాబాద్‌తో అనుబంధం, ఆటగాళ్లతో స్నేహం గురించి అతడు పంచుకున్నాడు.
Also Read: విస్మయపరిచిన బీసీసీఐ! ప్రపంచకప్ నెట్ బౌలర్లుగా వెంకటేశ్ అయ్యర్, అవేశ్ ఖాన్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
View this post on Instagram