అన్వేషించండి

Virat Kohli Workout Video: జిమ్‌లో విరాట్‌ కసరత్తులు! చూస్తే మనకు చెమటలు పడతాయేమో!!

Virat Kohli Workout Video: టీమ్‌ఇండియా మాజీ సారథి విరాట్‌ కోహ్లీ ఫామ్‌లోకి వచ్చేందుకు విపరీతంగా శ్రమిస్తున్నాడు. అత్యంత ముఖ్యమైన దేహదారుఢ్యంపై దృష్టి సారించాడు.

Virat Kohli Workout Video:  టీమ్‌ఇండియా మాజీ సారథి విరాట్‌ కోహ్లీ ఫామ్‌లోకి వచ్చేందుకు విపరీతంగా శ్రమిస్తున్నాడు. అత్యంత ముఖ్యమైన దేహదారుఢ్యంపై దృష్టి సారించాడు. తన సొంత జిమ్‌లో కసరత్తులు చేస్తున్నాడు. తాజాగా అతడు సోషల్‌ మీడియాలో పంచుకున్న వెయిట్‌ లిఫ్టింగ్‌ వీడియో వైరల్‌గా మారింది.

ప్రస్తుతం తన అప్పర్‌, లోయర్‌ బాడీని విరాట్‌ కోహ్లీ మరింత పటిష్ఠంగా మార్చుకుంటున్నాడు. పరుగులు చేయాలన్న కసితో వ్యాయామ శాలలో చెమటలు కక్కిస్తున్నాడు. మామూలుగానే విరాట్‌కు ఫిట్‌నెస్‌ అంటే పిచ్చి! గంటల కొద్దీ క్రీజులో ఉండి వికెట్ల మధ్య పరుగెత్తేందుకు కసరత్తులు ఉపయోగపడతాయని అతడి నమ్మకం. ఇంగ్లాండ్‌లో పర్యటనలో అతడు చివరి అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడాడు.

దేశానికి ఆసియాకప్‌, ప్రపంచకప్‌ అందించడమే తన లక్ష్యమని విరాట్‌ కోహ్లీ (Virat Kohli) గతంలో చెప్పిన సంగతి తెలిసిందే.  అందుకు ఏం చేసేందుకైనా తాను సిద్ధమేనని ప్రకటించాడు. త్వరలోనే పరుగుల వరద పారిస్తానన్న ధీమా వ్యక్తం చేశాడు.

అంతర్జాతీయ క్రికెట్లో అతడు సెంచరీ కొట్టి మూడేళ్లు అవుతోంది. ఇంగ్లాండ్‌తో వన్డే, టీ20 సిరీసులోనూ అతడు రాణించలేదు. ఫామ్‌ లేమితో బాధపడుతున్న జట్టు అండగా నిలిచింది. అయితే మానసికంగా కాస్త విశ్రాంతినివ్వాలని సెలక్టర్లు భావించారు. వెస్టిండీస్‌తో వన్డే, టీ20 సిరీసులకు ఎంపిక చేయలేదు.

ఆగస్టు 27 నుంచి ఆసియాకప్‌ మొదలవుతుంది. అక్టోబర్‌-నవంబర్లో ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో తలపడుతుంది. ఈ రెండింటినీ గెలవాలంటే విరాట్‌ కోహ్లీ ఫామ్‌లోకి రావడం అత్యవసరం. ఒకవేళ అతడు గనక ఇబ్బంది పడితే జట్టుకు భారంగా మారతాడు. ప్రొఫెషనల్‌ క్రికెట్లో టన్నుల కొద్దీ పరుగుల చేసిన అతడిని జట్టు నుంచి తప్పించడం అంత సులభం కాదు. పైగా అతనుంటే ప్రత్యర్థులకు ఒక రకమైన భయం ఉంటుంది. అందుకే అతడు ఫామ్‌ అందుకోవడం ముఖ్యం. అయితే జట్టు కోసం ఏం చేసేందుకైనా సిద్ధంగా ఉన్నానని విరాట్‌ అంటున్నాడు.

ఇంటర్నేషనల్‌ క్రికెట్లో విరాట్‌ కోహ్లీ (Virat Kohli) 2019, నవంబర్‌ 13న చివరి సెంచరీ కొట్టాడు. ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన గులాబి టెస్టులో శతకబాదాడు. 136 పరుగులు చేశాడు. అతడి కెరీర్లో ఇది 70వ శతకం. ఆ తర్వాత సిరీసులోనే ఒకట్రెండు శతకాలు బాదేసి రికీ పాంటింగ్‌ 71 సెంచరీల రికార్డు బద్దలు కొట్టేస్తాడని అభిమానులు ఆశించారు. కానీ అలా జరగలేదు. నెల గడిచింది. రెండు నెలలు గడిచాయి. చూస్తుండగానే ఏడాది గడిచింది. ఇప్పుడు మూడేళ్లు గడుస్తున్నాయి. ఫ్యాన్స్‌ కళ్లు కాయలు కాసాయే తప్ప విరాట్‌ బ్యాటు నుంచి వంద రాలేదు.

ఇప్పటి వరకు 102 టెస్టులాడిన కోహ్లీ 50 సగటుతో 8074 పరుగులు చేశాడు. 262 వన్డేల్లో 57 సగటుతో 12344, 99 టీ20ల్లో 50 సగటుతో 3308 రన్స్‌ సాధించాడు. రెండు ఫార్మాట్లలో కలిసి 70 సెంచరీలు కొట్టాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి ఏటా 2000 రన్స్‌ చేసే కింగ్‌ కోహ్లీ 2020లో 842, 2021లో 964, 2022లో 459 మాత్రమే సాధించాడు. అతడు త్వరగా ఫామ్‌ అందుకోవాలని అభిమానులు, టీమ్‌ఇండియా కోరుకుంటోంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Jagan: సోషల్ మీడియా కేసులతో జగన్‌కు తంటా - అవినాష్‌ రెడ్డితోనూ బంధం తెంపుకోవాల్సిందేనా ?
సోషల్ మీడియా కేసులతో జగన్‌కు తంటా - అవినాష్‌ రెడ్డితోనూ బంధం తెంపుకోవాల్సిందేనా ?
KTR Arrest: కేసీఆర్ అరెస్ట్‌ ఖాయమని ప్రచారం - కాంగ్రెస్ రిస్క్ చేస్తుందా ? టైం కోసం చూస్తుందా ?
కేటీఆర్ అరెస్ట్‌ ఖాయమని ప్రచారం - కాంగ్రెస్ రిస్క్ చేస్తుందా ? టైం కోసం చూస్తుందా ?
Borugadda Anil: బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
New Zealand Parliament News : న్యూజిలాండ్ పార్లమెంట్‌లో మరోసారి హాకా డ్యాన్స్- వైరల్ అవుతున్న మైపి-క్లార్క్ నిరసన
న్యూజిలాండ్ పార్లమెంట్‌లో మరోసారి హాకా డ్యాన్స్- వైరల్ అవుతున్న మైపి-క్లార్క్ నిరసన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pamban Vertical Railway Bridge | సముద్రంపై వావ్ అనిపించేలా రైల్వే వంతెన | ABP DesamSpecial welcome by ISKCON for PM Modi | ఇస్కాన్ భక్తులు మోదీని ఎలా స్వాగతించారో చూడండి | ABP Desamబిల్డింగ్‌నే పక్కకి జరుపుతున్నారు, మూడంతస్తులు ఎలా సాధ్యం?అరెస్ట్ చేస్తావ్ అని తెలుసు, చేసుకో!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan: సోషల్ మీడియా కేసులతో జగన్‌కు తంటా - అవినాష్‌ రెడ్డితోనూ బంధం తెంపుకోవాల్సిందేనా ?
సోషల్ మీడియా కేసులతో జగన్‌కు తంటా - అవినాష్‌ రెడ్డితోనూ బంధం తెంపుకోవాల్సిందేనా ?
KTR Arrest: కేసీఆర్ అరెస్ట్‌ ఖాయమని ప్రచారం - కాంగ్రెస్ రిస్క్ చేస్తుందా ? టైం కోసం చూస్తుందా ?
కేటీఆర్ అరెస్ట్‌ ఖాయమని ప్రచారం - కాంగ్రెస్ రిస్క్ చేస్తుందా ? టైం కోసం చూస్తుందా ?
Borugadda Anil: బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
New Zealand Parliament News : న్యూజిలాండ్ పార్లమెంట్‌లో మరోసారి హాకా డ్యాన్స్- వైరల్ అవుతున్న మైపి-క్లార్క్ నిరసన
న్యూజిలాండ్ పార్లమెంట్‌లో మరోసారి హాకా డ్యాన్స్- వైరల్ అవుతున్న మైపి-క్లార్క్ నిరసన
Latest Weather: అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో వర్షాలు- ఈ జిల్లాలపైనే ఎక్కువ ఎఫెక్ట్‌
అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో వర్షాలు- ఈ జిల్లాలపైనే ఎక్కువ ఎఫెక్ట్‌
CM Revanth Reddy: 'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
RRR: 'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
KTR: 'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
Embed widget