By: ABP Desam | Updated at : 12 Aug 2023 11:34 PM (IST)
మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు (Image: ABP Gallery)
Asian Champions Trophy Champion Final: ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ టైటిల్‌ను భారత జట్టు కైవసం చేసుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో మన్‌ప్రీత్ సింగ్ నేతృత్వంలోని టీమిండియా 4-3తో మలేషియాను ఓడించి టైటిల్‌ను సాధించింది. నిజానికి ఈ ఉత్కంఠభరిత ఫైనల్లో మూడో క్వార్టర్‌లో 3-1తో వెనుకబడిన టీమ్ ఇండియా... ఆ తర్వాత భారత ఆటగాళ్లు అద్భుత ఆటతీరును ప్రదర్శించారు. మూడో క్వార్టర్ ముగిసే సమయంలో కేవలం ఒక నిమిషం వ్యవధిలో రెండు గోల్స్ చేయడంతో భారత్ ఓడిపోయే గేమ్‌లో విజయం సాధించింది.
భారత్ తరఫున కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్ 45వ నిమిషంలో గోల్ చేశాడు. వెంటనే భారత్ మరో గోల్ కూడా సాధించింది. దీంతో గేమ్ 3-3తో సమం అయింది. ఆ తర్వాత 56వ నిమిషంలో ఆకాశ్‌దీప్ సింగ్ ఎదురుదాడికి దిగి అద్భుతమైన ఫీల్డ్ గోల్ చేశాడు. దీంతో భారత జట్టు 4-3తో టైటిల్‌ను కైవసం చేసుకుంది.
ఫైనల్‌ను భారత జట్టు ఘనంగా ప్రారంభించింది. మన్‌ప్రీత్ సింగ్ నేతృత్వంలోని భారత జట్టుకు ఎనిమిదో నిమిషంలో పెనాల్టీ కార్నర్ లభించింది. ఈ పెనాల్టీ కార్నర్‌లో జుగ్‌రాజ్ సింగ్ గోల్ చేశాడు. దీంతో భారత జట్టు 1-0 ఆధిక్యంలోకి వెళ్ళింది. అయితే దీని తరువాత మలేషియా అద్భుతమైన ఆటను ప్రదర్శించింది. 14వ నిమిషంలో మలేషియా మొదటి గోల్ సాధించింది. అనంతరం 18వ నిమిషంలో మలేషియా మరో గోల్ చేసింది. దీంతో 2-1తో ముందంజ వేసింది.
మరో వైపు భారత జట్టుకు గోల్ చేయడానికి అవకాశాలు దొరుకుతున్నాయి. కానీ సద్వినియోగం చేసుకోవడంలో మాత్రం విఫలం అయింది. అదే సమయంలో మలేషియా తరఫున 28వ నిమిషంలో మహ్మద్ అమీనుద్దీన్ పెనాల్టీ కార్నర్‌ను గోల్ చేసి జట్టును 3-1తో ముందంజలో ఉంచాడు. కానీ మూడో అర్ధభాగం చివరి నిమిషాల్లో భారత ఆటగాళ్లు అద్భుత ఆటను ప్రదర్శించారు. దాదాపు 1 నిమిషం వ్యవధిలో టీమిండియా ఆటగాళ్లు రెండో గోల్స్ చేశారు. చివర్లో ఆకాష్‌దీప్ సింగ్ గోల్‌తో భారత్ మ్యాచ్ గెలుచుకుంది.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
HCA Election Notification: హెచ్‌సీఏ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసింది, ముఖ్యమైన తేదీలివే
Ravichandran Ashwin: ఇదే నా చివరి ప్రపంచ కప్ - కెరీర్ గురించి రవిచంద్రన్ అశ్విన్ ఏమన్నాడంటే?
World Cup Record: పాకిస్థాన్‌తో పాటు ఈ జట్లేవీ వన్డే ప్రపంచకప్‌లో భారత్‌ను ఓడించలేకపోయాయి, ఆ జట్లు ఏవంటే?
Asian Games 2023: భారత్ కు మరో బంగారు పతకం - మిక్స్ డ్ డబుల్స్ లో విజయం సాధించిన బోపన్న, రుతుజా భోసలే
IND Vs ENG: ఇంగ్లండ్‌పై టాస్ గెలిచిన టీమిండియా - మొదట బ్యాటింగ్ ఎంచుకున్న రోహిత్!
TDP Protest: న్యాయం కోసం ఎంతవరకైనా వెళ్తాం, త్వరలోనే టీడీపీ జైలు భరో చేస్తుంది: చినరాజప్ప
Bigg Boss Season 7 Telugu: శివాజీ అనర్హుడు అని ప్రకటించిన కంటెస్టెంట్స్ - దీంతో నాగార్జున అలాంటి నిర్ణయం!
Hari Teja: నటి హరితేజకు విడాకులు- కూల్ గా ఆన్సర్ ఇచ్చిన బిగ్ బాస్ బ్యూటీ
కూతురితో కనిపించిన మాజీ ప్రపంచ సుందరి - తల్లికి తీసిపోని అందం!
/body>