By: ABP Desam | Updated at : 20 Jan 2022 04:39 PM (IST)
Edited By: Ramakrishna Paladi
భారత్, వెస్టిండీస్
ఉపఖండంలో వెస్టిండీస్ పర్యటన షెడ్యూల్లో మార్పు జరిగే అవకాశం కనిపిస్తోంది! దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు పెరగడం, ఒమిక్రాన్‌కు వేగంగా వ్యాపించే గుణం ఉండటంతో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుందని తెలిసింది. ఆరు మ్యాచులకు ఆరు వేదికలు కాకుండా రెండింటికే పరిమితం చేయాలని అనుకుంటోంది.
ప్రస్తుతం టీమ్‌ఇండియా దక్షిణాఫ్రికాలో పర్యటిస్తోంది. టెస్టు సిరీసును ముగించింది. వన్డే సిరీసు మరో నాలుగు రోజుల్లో పూర్తవుతుంది. ఆ తర్వాత భారత జట్టు స్వదేశానికి తిరిగొచ్చి వెస్టిండీస్‌తో మూడు వన్డేలు, మూడు టీ20ల్లో తలపడనుంది.
కరోనా కేసుల పెరుగుదలతో బీసీసీఐ పర్యటనలు, షెడ్యూలు కమిటీ బుధవారం వర్చువల్‌గా సమావేశమైంది. బీసీసీఐ సీఈవో హేమంగ్ అమిన్‌తో పాటు కమిటీలోని నలుగురు సభ్యులు ఇందులో పాల్గొన్నారు. ఆఖర్లో బీసీసీఐ అధ్యక్ష్యకార్యదర్శులు గంగూలీ, జే షా మీటింగ్‌లో జాయిన్ అయ్యారు.
వెస్టిండీస్ ఆడే ఆరు మ్యాచులకు ఆరు వేదికలను ఏర్పాటు చేయాలని బీసీసీఐ మొదటి నిర్ణయించింది. వేర్వేరు ప్రాంతాలకు తిరిగితే కరోనా సోకే ప్రమాదం ఉండటంతో వేదికల సంఖ్యను రెండుకు తగ్గిస్తోందని బోర్డు వర్గాలు ఏబీపీకి తెలిపాయి. సురక్షితమైన బయో బుడగలు ఏర్పాటు చేసేందుకు ఈ నిర్ణయం తీసుకుందని పేర్కొన్నాయి. అహ్మదాబాద్, కోల్‌కతాలో మ్యాచులు ఉంటాయని తెలుస్తోంది. టీ20 సిరీసుకు ఒకటి, వన్డేలకు మరొకటి సిద్ధం చేస్తారని సమాచారం.
'ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ఆరు వేర్వేరు వేదికల్లో మ్యాచులకు ఆతిథ్యమివ్వడం కష్టం. ఆటగాళ్లు, అధికారుల ఆరోగ్యానికి మరింత ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది. వారిని కొవిడ్ రిస్క్‌లోని నెట్టడం మంచిది కాదు. అందుకే అన్ని మ్యాచులను రెండు వేదికల్లోనే నిర్వహించాలని నిర్ణయించాం' అని బీసీసీఐ వర్గాలు ఏబీపీకి తెలిపాయి. తేదీలను కూడా ఒక రోజు వెనక్కి జరుపుతారని సమాచారం. ఫిబ్రవరి 12న జరగాల్సిన తొలి వన్డేను 13కు, 15న నిర్వహించే తొలి టీ20ని 16కు జరుపుతారని తెలుస్తోంది.
Also Read: SA vs IND, 1st ODI: తగ్గేదే లే..! బవుమాతో విరాట్ కోహ్లీ మాటల యుద్ధం!
IND Vs IRE Match Highlights: చెలరేగిన టీమిండియా బ్యాటర్లు - మొదటి టీ20లో ఐర్లాండ్‌పై విక్టరీ!
IND Vs IRE Innings Highlights: మొదటి టీ20లో పోరాడిన ఐర్లాండ్ - భారత్ లక్ష్యం ఎంతంటే?
IND Vs IRE Match Delayed: ఇండియా, ఐర్లాండ్ మ్యాచ్‌కు వర్షం అంతరాయం - అభిమానులతో దోబూచులాడుతున్న వరుణుడు!
IND Vs IRE Toss Update: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా - మొదటిసారి హార్దిక్‌కు కెప్టెన్సీ చాన్స్!
Duck Out Types: ఒక్క బంతి ఆడకుండా డకౌట్ అయితే ఏమంటారో తెలుసా?
Killi Kruparani: కిల్లి కృపారాణికి ఘోర పరాభవం! కాసేపట్లో సీఎం జగన్ పర్యటన, ఇంతలో అలిగి వెళ్లిపోయిన నేత
Ranga Ranga Vaibhavanga Teaser: చిరంజీవి, పవన్ కళ్యాణ్... ఇద్దర్నీ ఒక్క టీజర్లో చూపించిన వైష్ణవ్ తేజ్
Rajiv Swagruha Flats: రాజీవ్ స్వగృహ ఫ్లాట్ల లాటరీ ప్రారంభం, వారి సొంతింటి కల నేటి నుంచి సాకారం
Hyderabad Rape Case: జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసులో కీలక పరిణామం, ఆ టెస్టుకి నాంపల్లి కోర్టు గ్రీన్ సిగ్నల్