By: ABP Desam | Updated at : 08 Jun 2022 07:20 PM (IST)
Edited By: Ramakrishna Paladi
టీమ్ఇండియా (BCCI)
India vs South Africa 1st T20: ఐపీఎల్ 2022 ముగిసిన తర్వాత టీమ్ఇండియా తొలి అంతర్జాతీయ సిరీస్ ఆడుతోంది. దక్షిణాఫ్రికాతో ఐదు టీ20ల్లో తలపడుతోంది. మొదటి మ్యాచు దిల్లీలోని అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియంలో జరుగుతోంది. ఇంతకీ ఈ మ్యాచ్ ఎన్ని గంటలకు మొదలవుతుంది? లైమ్ స్ట్రీమింగ్ ఎందులో వస్తోంది? ఏ టీవీ ఛానల్లో ప్రత్యక్ష ప్రసారాలను వీక్షించొచ్చంటే?
When Does India vs South Africa T20 Series Begin (Date and Time in India)?
భారత్, దక్షిణాఫ్రికా తొలి టీ20 వేదిక దిల్లీలోని అరుణ్ జైట్లీ మైదానం. సాయంత్రం 6:30 గంటలకు టాస్ వేస్తారు. 7 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. ఇప్పటికే టికెట్లన్నీ విక్రయించారు. భారీ స్థాయిలో అభిమానులు వచ్చే అవకాశం ఉంది.
Where to Watch India vs South Africa 1st T20 Match?
భారత్, దక్షిణాఫ్రికా టీ20 సిరీస్ ప్రసార హక్కులను స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ దక్కించుకుంది. స్టార్‌స్పోర్ట్స్ 1, స్టార్‌స్పోర్ట్స్ 1 హెచ్‌డీ, స్టార్‌స్పోర్ట్స్ 1 హిందీ, స్టార్‌స్పోర్ట్స్1 హెచ్‌డీ హిందీ, స్టార్‌స్పోర్ట్స్ 1 తమిళ్, స్టార్‌స్పోర్ట్స్1 తెలుగు, స్టార్‌స్పోర్ట్స్1 కన్నడలో మ్యాచ్ ప్రసారం అవుతుంది.
How to Watch India vs South Africa 1st T20 Match Live Streaming Online for Free in India?
భారత్, దక్షిణాఫ్రికా తొలి టీ20ని లైవ్ స్ట్రీమింగ్‌లో వీక్షించొచ్చు. ఈ హక్కులను డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సొంతం చేసుకుంది. సబ్‌స్క్రిప్షన్ ఉన్నవాళ్లు నేరుగా లైవ్ స్ట్రీమింగ్‌ను ఎంజాయ్ చేయొచ్చు. ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా, రిలయన్స్ జియో సహా మరికొన్ని ఆపరేటర్లు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌తో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఆయా ప్రీపెయిడ్, పోస్టు పెయిడ్ ప్లాన్లను బట్టి లైవ్ స్ట్రీమింగ్ వీక్షించొచ్చు.
India vs South Africa T20 Series
దక్షిణాఫ్రికా టీమ్‌ఇండియాతో ఐదు టీ20లు ఆడనుంది. జూన్ 9న దిల్లీ, 12న కటక్, 14న వైజాగ్, 17న రాజ్‌కోట్, 19న బెంగళూరులో మ్యాచులు ఆడుతుంది. జులై 1 నుంచి ఇంగ్లాండ్ పర్యటన మొదలవుతుంది. టీమ్‌ఇండియా అక్కడ ఒక టెస్టు, మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడుతుంది. అంతకన్నా ముందు ఐర్లాండ్‌తో రెండు టీ20లు ఉంటాయి.
Latest update India vs South Africa T20 Series
దక్షిణాఫ్రికాతో తొలి టీ20కి ముందు టీమ్‌ఇండియాకు ఎదురుదెబ్బ తగిలింది! కెప్టెన్ కేఎల్ రాహుల్ (KL Rahul), స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్ గాయపడ్డారు. సిరీస్ మొత్తానికీ వీరిద్దరూ దూరమవుతున్నారు. రాహుల్ స్థానంలో రిషభ్‌పంత్ (Rishabh Pant) జట్టును నడిపిస్తాడని బీసీసీఐ తెలిపింది.
India Team vs South Africa
టీ20 జట్టు: కేఎల్ రాహుల్ (ఔట్), రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, దీపక్ హుడా, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్, దినేశ్ కార్తీక్, హార్దిక్ పాండ్య, వెంకటేశ్ అయ్యర్, యుజ్వేంద్ర చాహల్, కుల్‌దీప్ యాదవ్ (ఔట్), అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, భువనేశ్వర్, హర్షల్ పటేల్, అవేశ్ ఖాన్, అర్షదీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్
💬 💬 "A dream come true moment to get India call up."
— BCCI (@BCCI) June 8, 2022
Umran Malik speaks about the excitement on being a part of the #TeamIndia squad, Day 1 at the practice session, his idols and goals ahead. 👍 👍 - By @28anand
Full interview 🎥 🔽 #INDvSA | @Paytm pic.twitter.com/V9ySL4JKDl
IPL 2023: గుజరాత్ మ్యాచ్‌లో చెన్నై తుదిజట్టు ఇదే - ఎవరికి అవకాశం రావచ్చు?
IPL 2023: ఐపీఎల్ 2023 సీజన్‌ను ఆన్‌లైన్‌లో ఎక్కడ చూడచ్చు? - టీవీలో ఏ ఛానెల్లో వస్తుంది?
Abhishek Porel: పంత్ ప్లేస్‌లో పోరెల్‌ను తీసుకున్న ఢిల్లీ - అసలు ఎవరు ఇతను?
IPL Commentators List: గేల్, డివిలియర్స్, రైనా - ఈసారి కామెంటేటర్లు మామూలుగా లేరుగా - లిస్ట్ చూస్తే మైండ్ బ్లాక్!
Liam Livingstone: పంజాబ్‌కు భారీ షాక్ - మొదటి మ్యాచ్‌కు లివింగ్‌స్టోన్ దూరం - ఎప్పుడు రావచ్చు!
ABP CVoter Karnataka Opinion Poll: కర్ణాటకలో కింగ్ కాంగ్రెస్, ఆసక్తికర విషయాలు చెప్పిన ABP CVoter ఒపీనియన్ పోల్
Supreme Court Notice To CM Jagan : సాక్షి పత్రిక కొనుగోలుకు వాలంటీర్లకు ప్రజాధనం - సీఎం జగన్‌కు సుప్రీంకోర్టు నోటీసులు !
PS2 Telugu Trailer: వావ్ అనిపించే విజువల్స్, మైమరపించే మ్యూజిక్ - ‘పొన్నియిన్ సెల్వన్ 2’ ట్రైలర్ వచ్చేసింది!
TSPSC AEE Exam: ఏఈఈ నియామక పరీక్షల షెడ్యూలు ఖరారు, సబ్జెక్టులవారీగా తేదీలివే!