IND vs PAK: క్రికెట్ ఫ్యాన్స్ అలర్ట్! ఆగస్టు 28న భారత్, పాక్ మ్యాచ్ - ఆసియాకప్ షెడ్యూలు ఇదీ!
Asia Cup 2022 Schedule: అంతర్జాతీయ క్రికెట్లో భారత్, పాక్ తలపడేందుకు మరోసారి సిద్ధమయ్యాయి! ఆగస్టు 28, ఆదివారం ఈ రెండు జట్లు దుబాయ్ వేదికగా పోరాడనున్నాయి.
India vs Pakistan Cricket Match: అంతర్జాతీయ క్రికెట్లో భారత్, పాక్ తలపడేందుకు మరోసారి సిద్ధమయ్యాయి! ఆగస్టు 28, ఆదివారం ఈ రెండు జట్లు దుబాయ్ వేదికగా పోరాడనున్నాయి. ఆసియా కప్-2022లో అభిమానులను అలరించనున్నాయి.
అభిమానులు ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న ఆసియాకప్-2022 షెడ్యూలును బీసీసీఐ అధ్యక్షుడు జే షా మంగళవారం విడుదల చేశారు. ఆగస్టు 27న టోర్నీ మొదలవుతుందని తెలిపారు. సెప్టెంబర్ 11న జరిగే ఫైనల్‌తో ఆసియా ఆధిపత్యం ఎవరితో తెలిసిపోతుందని వెల్లడించారు.
'ఎదురు చూపులు ముగిశాయి. ఆగస్టు 27న ఆసియా ఆధిపత్యం మొదలవుతుంది. సెప్టెంబర్ 11న కీలకమైన ఫైనల్ ఉర్రూతలూగించనుంది. ఐసీసీ టీ20 ప్రపంచకప్‌నకు ఆసియాకప్ 15వ ఎడిషన్ సన్నాహకంగా ఉపయోగపడుతుంది' అని జే షా ట్వీట్ చేశారు. దాంతో పాటు ఆసియా కప్ షెడ్యూలు చిత్రాన్ని జత చేశారు.
Also Read: మూడో టీ20 మ్యాచ్ టైమింగ్‌లో మార్పు! ఎన్ని గంటలకు మొదలవుతుందంటే?
భారత్, శ్రీలంక, పాకిస్థాన్, అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్‌తో పాటు ఒక క్వాలిఫయర్ జట్టు ఈ టోర్నీ ఆడతాయి. వీటిని ఏ, బీ గ్రూపులుగా విభజించారు. వీటిలో నాలుగు జట్లు సూపర్-4 ఆడతాయి. ఆగస్టు 28న భారత్, పాకిస్థాన్ మొదట తలపడతాయి. పాక్ సూపర్-4కు ఎంపికయ్యే అవకాశాలు ఎక్కువే కాబట్టి దాయాదులు రెండోసారీ తలపడటం దాదాపుగా ఖాయమే! దుబాయ్, షార్జాను వేదికలు ఎంపిక చేశారు. సూపర్ 4 మ్యాచులన్నీ దుబాయ్‌లోనే జరుగుతాయి.
ఆసియాకప్ 2022 ఆతిథ్య హక్కులను మొదట శ్రీలంక దక్కించుకుంది. ప్రస్తుతం అక్కడ అశాంతి నెలకొంది. ప్రజలు ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తున్నారు. ధరలు పెరగడంతో దేశం ఆర్థికంగా దివాలా తీసింది. పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో దుబాయ్‌లో నిర్వహించేందుకు శ్రీలంక క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకుంది.
భారత్ తలపడే లీగ్ మ్యాచులు
ఆగస్టు 28, ఆదివారం - భారత్ x పాక్
ఆగస్టు 31, బుధవారం - భారత్ x క్వాలిఫయర్
The wait is finally over as the battle for Asian supremacy commences on 27th August with the all-important final on 11th September.
— Jay Shah (@JayShah) August 2, 2022
The 15th edition of the Asia Cup will serve as ideal preparation ahead of the ICC T20 World Cup. pic.twitter.com/QfTskWX6RD