By: ABP Desam | Updated at : 07 Jul 2022 12:18 PM (IST)
Edited By: Ramakrishna Paladi
భారత్ vs ఇంగ్లాండ్ ( Image Source : BCCI )
India vs England 1st T20 Live Streaming: సుదీర్ఘ ఫార్మాట్ ముగిసింది. ఐదో టెస్టులో టీమ్‌ఇండియా పరాజయం పాలవ్వడంతో సిరీస్ 2-2తో సమమైంది. ఇప్పుడిక పొట్టి క్రికెట్ యుద్ధానికి హిట్‌మ్యాన్ సేన సన్నద్ధమైంది. గురువారమే తొలి టీ20 ఆడనుంది. మరి వేదిక, లైవ్ స్ట్రీమింగ్, తుది జట్ల వివరాలేంటి?
When Does India vs England 1st T20 match Begin (Date and Time in India)?
భారత్, ఇంగ్లాండ్ తొలి టీ20 వేదిక సౌథాంప్టన్‌లోని ఏజెస్ బౌల్. భారత కాలమానం ప్రకారం రాత్రి 10:30 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. 10:00 గంటలకు టాస్ వేస్తారు. స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 6 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది.
Where to Watch India vs England 1st T20 match?
భారత్, ఇంగ్లాండ్ సిరీస్ ప్రసార హక్కులను సోనీ నెట్‌వర్క్ దక్కించుకుంది. సోనీ స్పోర్ట్స్. నెట్‌వర్క్ ఛానళ్లలో మ్యాచ్ ప్రసారం అవుతుంది. సోనీ సిక్స్, సోనీ సిక్స్ హెచ్‌డీలో నచ్చిన భాషలో మ్యాచ్‌ను వీక్షించొచ్చు.
How to Watch India vs England 1st T20 match Live Streaming Online for Free in India?
భారత్, ఇంగ్లాండ్ తొలి టీ20ని లైవ్ స్ట్రీమింగ్‌లో వీక్షించొచ్చు. ఈ హక్కులను సోనీ లైవ్ సొంతం చేసుకుంది. సబ్‌స్క్రిప్షన్ ఉన్నవాళ్లు నేరుగా లైవ్ స్ట్రీమింగ్‌ను ఎంజాయ్ చేయొచ్చు. కొన్ని టెలికాం సంస్థలు సైతం స్ట్రీమింగ్‌ను ఆఫర్ చేస్తున్నాయి. జియో టీవీలో ఉచితంగా చూడొచ్చు.
India vs England Series schedule
ఇంగ్లాండ్‌తో టీమ్‌ఇండియా ఐదో టెస్టు ముగిసింది. 7, 9, 10న టీ20 మ్యాచులు, 12, 14, 17న వన్డేలు జరుగుతాయి.
India vs England 1st T20 match Probable XI
ఇంగ్లాండ్: జేసన్ రాయ్, జోస్ బట్లర్, డేవిడ్ మలాన్, మొయిన్ అలీ, లియామ్ లివింగ్‌స్టన్, హ్యారీ బ్రూక్, సామ్ కరణ్, క్రిస్ జోర్డాన్, తైమల్ మిల్స్, రీస్ టాప్లే, మ్యాట్ పార్కిన్‌సన్
భారత్: రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, హార్దిక్ పాండ్య, దినేశ్ కార్తీక్, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, యుజ్వేంద్ర చాహల్, ఉమ్రాన్ మాలిక్/అర్షదీప్ సింగ్
Punjab Kings Head Coach: అనిల్ కుంబ్లేకు షాక్! వెతుకులాట మొదలైందట!
IND vs ZIM ODI Live Streaming: మరోటి గెలిస్తే సిరీస్ పట్టేస్తాం! రెండో వన్డే వేదిక, టైమింగ్ మారాయా?
IND Vs ZIM: వికెట్ పడకుండా కొట్టేశారు - మొదటి వన్డేలో టీమిండియా ఘనవిజయం!
Vinod Kambli: సచిన్ అంతటోడికి ఎందుకీ దుస్థితి!
BWF World Championships 2022: పీవీ సింధు! నీ మెరుపుల్లేని ప్రపంచ ఛాంపియన్షిప్ ఏం బాగుంటుంది!!
TS Inter Board : హైదరాబాద్ లో విద్యార్థి ఆత్మహత్యాయత్నం, ఇంటర్ బోర్డు కీలక ఆదేశాలు
High Court Judges : హైకోర్టు జడ్జీలు ప్రభుత్వంపై ఇష్టానుసారం మాట్లాడుతున్నారు, వెంకట్రామిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు
Namitha: కవల పిల్లలకు జన్మనిచ్చిన నటి నమిత, ఇదిగో వీడియో
Ponniyin Selvan: 'పొన్నియిన్ సెల్వన్'లో మెగాస్టార్ - సస్పెన్స్ అంటోన్న మణిరత్నం