Tokyo Paralympic 2020: రెండో రోజు ఒక విజయం... ఒక పరాజయం... ప్రి క్వార్టర్స్ చేరిన భావినాబెన్ పటేల్
టోక్యో పారాలింపిక్స్‌లో రెండో రోజు భారత్ ఒక విజయం... ఒక పరాజయంతో ముగించింది.
టోక్యో పారాలింపిక్స్‌లో రెండో రోజు భారత్ ఒక విజయం... ఒక పరాజయంతో ముగించింది. భారత ప్యాడ్లర్ భావినాబెన్ పటేల్ మహిళల సింగిల్స్ క్లాస్-4 విభాగంలో ప్రి క్వార్టర్స్ చేరుకుంది. గ్రేట్ బ్రిటన్ అమ్మాయి మేగన్ షక్లెటన్‌తో జరిగిన మ్యాచులో 3-1 తేడాతో ఘన విజయం సాధించింది. 41 నిమిషాల పాటు జరిగిన హోరాహోరీ పోరులో ఆమె 11-7, 9-11, 17-15, 13-11 తేడాతో ప్రత్యర్థిని ఓడించింది.
In a thrilling match #IND @BhavinaPatel6 wins her 2nd group stage match 3-1 against #GBR Megan Shackleton
— SAI Media (@Media_SAI) August 26, 2021
A great comeback by Bhavina👏#Cheer4India #Praise4Para #Paralympics pic.twitter.com/ewbLnzEIEm
భావినా బుధవారం జరిగిన తొలి రౌండు పోరులో పరాజయం చవిచూసింది. ఆమె పై పోరుకు అర్హత సాధించాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచులో దూకుడుగా ఆడి మొదటి ఎనిమిది నిమిషాల్లోనే తొలి రౌండ్ గెలిచింది. అయితే ఆ తర్వత ప్రత్యర్థి పుంజుకోవడంతో స్కోరు 1-1తో సమమైంది. ఆ తర్వాత ఇద్దరూ నువ్వా నేనా అన్నట్టు తలపడ్డారు. చివరికి భావినా విజయం సాధించింది. మొత్తంగా రెండు మ్యాచుల్లో 3 పాయింట్లతో ఆమె ప్రిక్వార్టర్స్‌కు చేరుకుంది.
‘మున్ముందు జరిగే మ్యాచుల్లో మరింత మెరుగ్గా ఆడేందుకు ప్రయత్నిస్తా. ఈ రోజు చాలా ఓపికగా ఆడాను. మ్యాచు వదులుకోకూడదని నిర్ణయించుకున్నా. కఠిన మ్యాచులో గెలిచినందుకు సంతోషంగా ఉంది’ అని భావినా తెలిపింది.
🗣️ #IND's @BhavinaPatel6 speaks about her thrilling victory over #GBR's Megan Shackleton!
— #Tokyo2020 for India (@Tokyo2020hi) August 26, 2021
She moved on to the knockout stages of #ParaTableTennis at the #Paralympics. #Tokyo2020 pic.twitter.com/QVoVboQXZU
సోనాల్‌బెన్ మనుబాయ్ పటేల్ ఓటమి
టేబుల్ టెన్నిస్ మహిళల సింగిల్స్ క్లాస్ -3 విభాగంలో ప్యాడ్లర్ సోనాల్‌బెన్ మనుబాయ్ పటేల్ ఓడిపోయింది. రెండో రౌండ్లో ఆమె లీ మై గ్యూ చేతిలో 3-1 తేడాతో ఓడిపోయింది. కేవలం 30 నిమిషాల్లోనే మ్యాచ్ ముగిసింది. తొలి గేమ్ గెలిచిన సోనాల్ ఆ తర్వాత అదే జోరు కొనసాగించలేకపోయింది.
Sonalben Patel lost her second match at the #Paralympics against 6th Ranked Lee Mi-Gyu of #KOR in the C3 Group D Match of #ParaTableTennis
— Sportskeeda India (@Sportskeeda) August 26, 2021
Even after putting up a brilliant fight in both the games, unfortunately, her journey at the #Tokyo2020 comes to an end#Praise4Para pic.twitter.com/eT5x3S3Zu3