IND vs WI, 2nd ODI: విండీస్‌కు మాస్టర్ స్ట్రోక్! రిషభ్ పంత్‌ను ఓపెనర్‌గా పంపిన టీమ్‌ఇండియా
రెండో వన్డేలో టీమ్‌ఇండియా అందరికీ సర్‌ప్రైజ్ ఇచ్చింది! యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్‌ను ఓపెనింగ్‌కు దించింది. హిట్‌మ్యాన్ రోహిత్ శర్మతో పాటు అతడు మైదానంలోకి రావడంతో కరీబియన్ ఆటగాళ్లంతా ఒక్కసారిగా షాకయ్యారు!
Rishabh Pant as opener: వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో వన్డేలో టీమ్‌ఇండియా అందరికీ సర్‌ప్రైజ్ ఇచ్చింది! యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్‌ను ఓపెనింగ్‌కు దించింది. హిట్‌మ్యాన్ రోహిత్ శర్మతో పాటు అతడు మైదానంలోకి రావడంతో కరీబియన్ ఆటగాళ్లంతా ఒక్కసారిగా షాకయ్యారు! వారితో పాటు టీమ్‌ఇండియా అభిమానులు సైతం ఆశ్చర్యానికి గురయ్యారు.
గతంలో అంతర్జాతీయ క్రికెట్లో పంత్ ఓపెనింగ్ ఎప్పుడూ చేయలేదు. లిస్ట్-ఏ మ్యాచుల్లో మాత్రం ఓపెనింగ్ చేసిన అనుభవం ఉంది. దేశవాళీ క్రికెట్లో అతడు 4 ఇన్నింగ్సుల్లో ఓపెనింగ్ చేశాడు. 55 స్ట్రైక్‌రేట్, 11.8 సగటుతో 47 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లోనూ 4 మ్యాచుల్లో ఓపెనింగ్ చేసి 104 పరుగులు సాధించాడు. మరి జట్టు యాజమాన్యం చేసిన ఈ ప్రయోగం ప్రత్యర్థికి మాస్టర్ స్ట్రోక్ అవుతుందో లేదో చూడాలి.
రిషభ్ పంత్‌ను ఓపెనింగ్ చేయించడం వెనక పెద్ద వ్యూహమే ఉన్నట్టు కనిపిస్తోంది! అంతర్జాతీయ క్రికెటర్లో కుడి, ఎడమ కూర్పునకు అత్యంత ప్రాధాన్యం ఉంది. ఎందుకంటే బౌలింగ్ చేస్తున్న జట్టుకు ఫీల్డర్లను మార్చడం కష్టం అవుతుంది. వారికి బౌలింగ్ చేయాలన్న పదేపదే లెంగ్తులను మార్చుకోవాలి. ఇక పవర్‌ప్లేలో ఫీల్డర్లు తక్కువగా ఉంటారు. ఇద్దరు మినహా మిగతా అంతా అంతర్ వృత్తంలోనే ఉంటారు. పంత్‌కు 30 మీటర్ల అవతల బంతిని గాల్లోకి లేపడంలో అనుభవం ఉంది. అతడు సులభంగా పరుగులు రాబట్టగలడు. అంతకు మించి అతడిలో బాధ్యత, పరిణతిని పెంచడం జట్టుకు అవసరం. ఓపెనింగ్ చేయించడం వల్ల అతడితో మరింత నియంత్రణ పెరుగుతుంది.
Also Read: టీమ్‌ఇండియా పట్టుదలా? విండీస్ ప్రతీకారమా? రెండో వన్డేలో గెలుపెవరిది?
Also Read: టెస్టు కెప్టెన్‌గా రోహిత్ శర్మకు ఓకే! త్వరలోనే సెలక్షన్ కమిటీ ప్రకటన
ప్రస్తుతం మిడిలార్డర్‌లో టీమ్‌ఇండియా కచ్చితమైన సెటప్ లేదు. పదేపదే ఆటగాళ్లను మారుస్తున్నారు. 4,5,6 స్థానాల్లో ప్రత్యేకంగా వీరే వస్తారు అన్న ఆటగాళ్లెవరూ లేరు. కేఎల్ రాహుల్‌కు ఆ స్థానాల్లో ఆడిన అనుభవం ఉంది. పైగా అవసరమైనప్పుడు గేర్లు మార్చి సిక్సర్లు బాదేస్తాడు. వికెట్లు పడుతుంటే నియంత్రణతో సింగిల్స్ తీసి ప్రత్యర్థి నుంచి మ్యాచును లాగేస్తాడు. అందుకే పంత్‌ను ముందుకు తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. కేఎల్ రాహుల్‌తో ఫినిషర్ పాత్ర పోషించాలన్న తపన కనిపిస్తోంది.
ఇప్పటి వరకు టీమ్‌ఇండియాలో చాలామంది మిడిలార్డర్ నుంచి ఓపెనింగ్ చేసినవాళ్లు ఎంతో మంది ఉన్నారు. సచిన్ తెందూల్కర్, సౌరవ్ గంగూలీ, రోహిత్ శర్మ సహా చాలామంది మిడిలార్డర్ నుంచి మెరిశారు. పంత్ కూడా వారి స్థాయిలో మెరవాలని జట్టు యాజమాన్యం కోరుకుంటోందని తెలుస్తోంది.