News
News
X

Ind vs WI, 2nd ODI: టీమ్‌ఇండియా పట్టుదలా? విండీస్‌ ప్రతీకారమా? రెండో వన్డేలో గెలుపెవరిది?

విండీస్ తో రెండో వన్డేను హిట్‌మ్యాన్‌ సేన ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటోంది. కేఎల్‌ రాహుల్‌, కుల్‌దీప్‌ రాకతో మరింత బలంగా మారింది. మొదటి మ్యాచులో ఓటమి పాలైన గట్టిగా పుంజుకోవాలని విండీస్‌ అనుకుంటోంది. మరి గెలుపు ఎవరిది?

FOLLOW US: 

వెస్టిండీస్‌తో రెండో వన్డేకు టీమ్‌ఇండియా సిద్ధమైంది. ఇప్పటికే తొలి పోరులో కరీబియన్లను గడగడలాడించిన హిట్‌మ్యాన్‌ సేన దీనిని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటోంది. మూడో వన్డే వరకు సిరీసును సాగదీయొద్దని పట్టుదలగా ఉంది. కేఎల్‌ రాహుల్‌, కుల్‌దీప్‌ రాకతో మరింత బలంగా మారింది. మొదటి మ్యాచులో ఓటమి పాలైన గట్టిగా పుంజుకోవాలని విండీస్‌ అనుకుంటోంది. ప్రతీకారంతో రోహిత్‌ సేనకు షాకివ్వాలని భావిస్తోంది.

ఆ ఇద్దరి రాకతో బలం

వ్యక్తిగత కారణాలతో తొలి వన్డేకు దూరమైన ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ తిరిగొచ్చాడు. ఇప్పటికే సాధన మొదలు పెట్టేశాడు. అతడు ఓపెనర్‌గా లేదంటే ఐదో స్థానంలో ఆడాల్సి ఉంటుంది. ఇషాన్‌ కిషన్‌కు జట్టులో చోటివ్వడాన్ని బట్టి ఈ నిర్ణయం ఉంటుంది. కొన్నాళ్లుగా పరుగుల వరద పారిస్తున్న కేఎల్‌ ఫామ్‌ను టీమ్‌ఇండియా ఉపయోగించుకోవాలని అనుకుంటోంది.

65 వన్డేల్లో 107 వికెట్లు తీసిన అనుభవం కుల్‌దీప్‌ సొంతం. ఇన్నాళ్లూ గాయాలు, ఫామ్‌లేమి కారణంగా జట్టుకు దూరంగా ఉన్నాడు. బహుశా ఫామ్‌లో ఉన్న చాహల్‌కు తోడుగా అతడిని రోహిత్‌ ఆడిస్తాడన్న అంచనాలు ఉన్నాయి. అలాంటప్పుడు దీపక్‌ హుడాను తప్పించక తప్పదు! బహుశా దీపక్‌ చాహర్‌కూ చోటు దొరకొచ్చు. నవదీప్‌ సైని రిజర్వుగా అందుబాటులో ఉంటాడు.

ఇప్పటికీ లోపాలు

తొలి వన్డేలో ఓపెనర్లు రోహిత్‌, ఇషాన్‌ రాణించడం శుభసూచకం. కోహ్లీ, పంత్‌ ఔటవ్వగానే అభిమానుల్లో ఆందోళన మొదలైంది. ఛేదించాల్సిన లక్ష్యం తక్కువే కావడం, సూర్యకుమార్‌, అరంగేట్రం ఆటగాడు దీపక్‌ హుడా సమయోచితంగా ఆడటంతో ఊపిరి పీల్చుకున్నారు. ఒకవేళ స్కోరు కాస్త ఎక్కువే ఉండుంటే ఉత్కంఠ రేగేదే! ఏదేమైనా మిడిలార్డర్‌ అప్రమత్తంగా ఉండటం అవసరం.

ఇక ప్రపంచకప్‌లో చోటు దక్కని యుజ్వేంద్ర చాహల్‌ పునరాగమనంలో సత్తా చాటాడు. నాలుగు వికెట్లు తీశాడు. అతడికి తోడుగా ఆఫ్‌స్పిన్నర్‌ ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ మూడు వికెట్లు తీయడం ఆనందాన్ని ఇస్తోంది. అటు పేస్‌, ఇటు స్పిన్‌ విభాగం బలంగా ఉంటే టీమ్‌ఇండియాకు తిరుగులేదు.

పిచ్‌ స్వభావం: మొతేరాలో స్టేడియం కొత్తదే అయినా పిచ్‌లు ఎప్పట్లాగే సంప్రదాయ స్పిన్‌కు అనుకూలిస్తున్నాయి. సరైన లెంగ్తులు దొరికితే బౌలర్లు చెలరేగుతారు. బ్యాటర్లు నిలదొక్కుకుంటే పరుగుల వరద పారించగలరు.

రెండో వన్డేకు భారత జట్టు (అంచనా): రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌, విరాట్‌ కోహ్లీ, రిషభ్‌ పంత్‌, సూర్యకుమార్ యాదవ్‌, వాషింగ్టన్‌ సుందర్‌, దీపక్‌ హుడా/ కుల్‌దీప్‌ యాదవ్‌, శార్దూల్‌ ఠాకూర్‌/దీపక్‌ చాహర్‌, మహ్మద్ సిరాజ్‌, యుజ్వేంద్ర చాహల్‌, ప్రసిద్ధ్ కృష్ణ

Also Read: స్టార్ ఆల్ రౌండర్‌పై కన్నేసిన 3 ఐపీఎల్ ఫ్రాంచైజీలు, అతడి కోసం వేలంలో తగ్గేదే లే!

Also Read: బీసీసీఐకి, 1983 వరల్డ్ కప్ విజేతలకు లతా మంగేష్కర్ చేసిన గొప్ప సాయం ఏంటో తెలుసా!

Published at : 08 Feb 2022 06:36 PM (IST) Tags: Virat Kohli Rohit Sharma KL Rahul Kuldeep Yadav 2nd ODI IND vs WI Team India's Predicted Playing XI

సంబంధిత కథనాలు

Punjab Kings Head Coach: అనిల్‌ కుంబ్లేకు షాక్‌! వెతుకులాట మొదలైందట!

Punjab Kings Head Coach: అనిల్‌ కుంబ్లేకు షాక్‌! వెతుకులాట మొదలైందట!

IND vs ZIM ODI Live Streaming: మరోటి గెలిస్తే సిరీస్‌ పట్టేస్తాం! రెండో వన్డే వేదిక, టైమింగ్‌ మారాయా?

IND vs ZIM ODI Live Streaming: మరోటి గెలిస్తే సిరీస్‌ పట్టేస్తాం! రెండో వన్డే వేదిక, టైమింగ్‌ మారాయా?

IND Vs ZIM: వికెట్ పడకుండా కొట్టేశారు - మొదటి వన్డేలో టీమిండియా ఘనవిజయం!

IND Vs ZIM: వికెట్ పడకుండా కొట్టేశారు - మొదటి వన్డేలో టీమిండియా ఘనవిజయం!

Vinod Kambli: సచిన్ అంతటోడికి ఎందుకీ దుస్థితి!

Vinod Kambli: సచిన్ అంతటోడికి ఎందుకీ దుస్థితి!

BWF World Championships 2022: పీవీ సింధు! నీ మెరుపుల్లేని ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ ఏం బాగుంటుంది!!

BWF World Championships 2022: పీవీ సింధు! నీ మెరుపుల్లేని ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ ఏం బాగుంటుంది!!

టాప్ స్టోరీస్

TS Inter Board : హైదరాబాద్ లో విద్యార్థి ఆత్మహత్యాయత్నం, ఇంటర్ బోర్డు కీలక ఆదేశాలు

TS Inter Board : హైదరాబాద్ లో  విద్యార్థి ఆత్మహత్యాయత్నం, ఇంటర్ బోర్డు కీలక ఆదేశాలు

High Court Judges : హైకోర్టు జడ్జీలు ప్రభుత్వంపై ఇష్టానుసారం మాట్లాడుతున్నారు, వెంకట్రామిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు

High Court Judges : హైకోర్టు జడ్జీలు ప్రభుత్వంపై ఇష్టానుసారం మాట్లాడుతున్నారు, వెంకట్రామిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు

Ponniyin Selvan: 'పొన్నియిన్ సెల్వన్'లో మెగాస్టార్ - సస్పెన్స్ అంటోన్న మణిరత్నం

Ponniyin Selvan: 'పొన్నియిన్ సెల్వన్'లో మెగాస్టార్ - సస్పెన్స్ అంటోన్న మణిరత్నం

Ranveer Deepika's New House : కొత్తింట్లో అడుగుపెట్టిన ర‌ణ్‌వీర్ - దీపిక దంపతులు, ఎంత పద్దతిగా పూజలు చేశారో చూశారా?

Ranveer Deepika's New House : కొత్తింట్లో అడుగుపెట్టిన ర‌ణ్‌వీర్ - దీపిక దంపతులు, ఎంత పద్దతిగా పూజలు చేశారో చూశారా?