By: ABP Desam | Updated at : 15 Jan 2023 08:30 PM (IST)
Edited By: Eleti Saketh Reddy
వికెట్ తీసిన సిరాజ్‌ను అభినందిస్తున్న జట్టు సభ్యులు ( Image Source : @BCCI / Twitter )
శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో భారత్ ఏకంగా 317 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 390 పరుగులు సాధించింది. అనంతరం శ్రీలంక 22 ఓవర్లలో 73 పరుగులకే కుప్పకూలింది. దీంతో సిరీస్‌ను 3-0తో వైట్ వాష్ చేసింది.
భారత బ్యాటర్లలో విరాట్ కోహ్లీ (166 నాటౌట్: 110 బంతుల్లో, 13 ఫోర్లు, ఎనిమిది సిక్సర్లు) కళ్లు చెదిరే ఇన్నింగ్స్ ఆడాడు. బౌలర్లలో మహ్మద్ సిరాజ్ నాలుగు వికెట్లు దక్కించుకున్నాడు. వన్డే క్రికెట్ చరిత్రలోనే ఇది అతి పెద్ద విజయం కావడం విశేషం. ఇంతకు ముందు రికార్డు న్యూజిలాండ్ పేరున ఉండేది. 2008లో న్యూజిలాండ్ 290 పరుగుల తేడాతో ఐర్లాండ్‌ను ఓడించింది. 15 సంవత్సరాలకు ఆ రికార్డు బద్దలయింది.
391 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకను భారత పేసర్ మహ్మద్ సిరాజ్ చావు దెబ్బ తీశాడు. తన మొదటి ఓవర్ నుంచి క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ చెలరేగాడు. దీంతో పది ఓవర్లు ముగిసేసరికే శ్రీలంక ఐదు వికెట్లు కోల్పోయింది. అప్పటికి స్కోరు 37 పరుగులు మాత్రమే. వీటిలో సిరాజ్ నాలుగు వికెట్లు తీసుకున్నాడు.
10 ఓవర్ల తర్వాత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ లైన్‌లోకి వచ్చాడు. తను రెండు వికెట్లు దక్కించుకున్నాడు. లంక బ్యాటర్లలో నువనిదు ఫెర్నాండో (19: 27 బంతుల్లో నాలుగు ఫోర్లు), దసున్ షనక (11: 26 బంతుల్లో రెండు ఫోర్లు), కసున్ రజిత (13: 19 బంతుల్లో రెండు ఫోర్లు) మినహా మరెవ్వరూ రెండంకెల స్కోరు చేయలేకపోయారు. దీంతో శ్రీలంక 22 ఓవర్లలో 73 పరుగులకే కుప్పకూలింది. మహ్మద్ షమీకి రెండు వికెట్లు దక్కాయి.
టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ కు ఓపెనర్లు రోహిత్ శర్మ (42: 49 బంతుల్లో, రెండు ఫోర్లు, మూడు సిక్సర్లు), శుభ్ మన్ గిల్ (116: 97 బంతుల్లో, 14 ఫోర్లు, రెండు సిక్సర్లు) మొదటి వికెట్ కు 95 పరుగులు జోడించారు. ఆ తర్వాత రోహిత్ ఔటైనా.. గిల్, కోహ్లీలు స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. గిల్ చూడచక్కని షాట్లతో అలరించగా.. కోహ్లీ తనకలవాటైన రీతిలో సింగిల్స్, డబుల్స్ తీస్తూ పరుగులు సాధించారు. ఈ క్రమంలో గిల్ 85 బంతుల్లో తన సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఇది గిల్ కు రెండో వన్డే సెంచరీ. సెంచరీ తర్వాత మరో 3 షాట్లు కొట్టిన గిల్ కసున్ రజిత బౌలింగ్ లో బౌల్డయ్యాడు. ఇక ఆ తర్వాత మొదలైంది విరాట్ మోత.
అర్ధసెంచరీ వరకు ఓ మోస్తరు వేగంగా ఆడిన కోహ్లీ తర్వాత వేగంగా పరుగులు సాధించాడు. ఈ క్రమంలో 85 బంతుల్లోనే శతకం అందుకున్నాడు. శతకం తర్వాత విరాట్ విశ్వరూపం చూపించాడు. వన్డే కెరీర్ లో 46వ సెంచరీ అందుకున్న కోహ్లీ ఆ తర్వాత ఆకాశమే హద్దుగా చెలరేగాడు. దొరికిన బంతిని దొరికినట్లు బౌండరీకి తరలించాడు. చూడచక్కని సిక్సులు కొట్టాడు. చమిక కరుణరత్నే వేసిన 45వ ఓవర్లో 2 సిక్సులు, ఒక ఫోర్ కొట్టిన కోహ్లీ 47వ ఓవర్లో మరో 2 సిక్సులు, ఫోర్ దంచాడు. ఈ క్రమంలో 106 బంతుల్లోనే 150 మార్కును అందుకున్నాడు. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో భారత్ ఐదు వికెట్లు కోల్పోయి 390 పరుగులు చేసింది. చివరి ఓవర్లలో భారత్ త్వరత్వరగా వికెట్లు కోల్పోయింది. కేఎల్ రాహుల్ (7), సూర్యకుమార్ యాదవ్ (4) తక్కువ స్కోరుకే ఔటయ్యారు.
IND v AUS: టీం ఇండియా ఆనవాయతీ కొనసాగించిన స్కై , విన్నింగ్ ట్రోఫీ ఎవరికి ఇచ్చాడంటే..
Virat Kohli: కింగ్ కోహ్లీ అంటే అట్లుంటది మరి, ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో చోటు
Ruturaj Gaikwad: రుతురాజ్ గైక్వాడ్ అరుదైన రికార్డు , ఆసిస్‌పై అన్ని పరుగులు చేయటం తొలిసారట
Sports Award selection committee: క్రీడా పురస్కారాల ఎంపికకు కమిటీ , 12 మంది దిగ్గజాలతో ఏర్పాటు
Syed Modi International 2023 badminton: టైటిల్ లేకుండానే ముగిసిన భారత్ పోరాటం , రన్నరప్ గా తనీష-అశ్విని జోడి
Telangana CLP Meeting: ముగిసిన తెలంగాణ సీఎల్పీ భేటీ- ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపిక బాధ్యత అధిష్ఠానానికి అప్పగిస్తూ తీర్మానం
BRS Party News: ఇక తెలంగాణ భవన్ కేంద్రంగా బీఆర్ఎస్ పాలిటిక్స్: ఎమ్మెల్యేలకు కేటీఆర్ సూచనలు
WhatsApp New Feature: వాట్సాప్ కొత్త ఫీచర్ త్వరలో - ఇక ఐఫోన్ టు ఐఫోన్ కూడా!
తీవ్ర తుపానుగా మారుతున్న మిగ్‌జాం - తీరం దాటేది ఏపీలోనే!
/body>