News
News
X

IND vs SL: లంకను షేక్‌ చేసిన బుమ్రా, శ్రీలంక 109కే ఆలౌట్‌

IND vs SL Pink ball Test: శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌ ముగిసింది. 35.5 ఓవర్లకు 109 పరుగులకు ఆలౌటైంది. మొదటి ఇన్నింగ్స్‌లో భారత్‌ 252 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.

FOLLOW US: 

IND vs SL 2nd Test:  టీమ్‌ఇండియాతో రెండో టెస్టులో శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌ ముగిసింది. 35.5 ఓవర్లకు 109 పరుగులకు ఆలౌటైంది. మొదటి ఇన్నింగ్స్‌లో భారత్‌ 252 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. భారత్‌కు 143 పరుగుల ఆధిక్యం లభించింది. జస్ప్రీత్‌ బుమ్రాకు ఐదు వికెట్లు దక్కాయి. ఓవర్‌నైట్‌ స్కోరు 86/6తో రెండో రోజు ఆట ఆరంభించిన లంకను చుట్టేయడానికి రోహిత్‌ సేనకు ఎంతో సమయం పట్టలేదు. 27 నిమిషాల్లోనే మిగిలిన 4 వికెట్లను పడగొట్టేసింది. ఆడిన 35 బంతుల్లో 23 పరుగులు మాత్రమే చేసింది. ఇండియాపై శ్రీలంకకు ఇది రెండో అత్యల్ప స్కోరు కావడం ప్రత్యేకం.

తొలిరోజు ఎలా సాగిందంటే

తొలిరోజు టాస్‌ గెలిచిన బ్యాటింగ్‌ ఎంచుకున్న టీమ్‌ఇండియాకు కొద్దిసేపటికే షాక్‌ తగిలింది. ఓపెనర్‌ మయాంక్ అగర్వాల్‌ (4) నోబాల్‌కు రనౌట్‌ అయ్యాడు. అప్పటికి స్కోరు 10. మరికాసేపటికే రోహిత్‌ శర్మ (15)ను ఎంబుల్దెనియా పెవిలియన్‌ పంపించాడు. విచిత్రంగా బెంగళూరు పిచ్‌ విపరీతమైన టర్న్‌కు అనుకూలిస్తోంది. మొహాలి పిచ్‌తో పోలిస్తే రెండు డిగ్రీలు ఎక్కువగా బంతి టర్న్‌ అవుతోంది. ఒక్కోసారి అనూహ్యంగా బౌన్స్‌ అవుతోంది. దాంతో బ్యాటర్లు ఆడేందుకు ఇబ్బంది పడుతున్నారు. హనుమ విహారి (31; 81 బంతుల్లో 4x4), విరాట్‌ కోహ్లీ (23; 48 బంతుల్లో 2x4) కుదురుకున్నట్టే కనిపించినా ఆడక తప్పని బంతులేసిన లంక స్పిన్నర్లు వీరిద్దరినీ పెవిలియన్‌కు పంపించారు.

అదరగొట్టిన శ్రేయస్‌

కష్టాల్లో పడిన టీమ్‌ఇండియా రిషభ్ పంత్‌ (Rishabh Pant), శ్రేయస్‌ అయ్యర్‌ (Shreyas Iyer) ఆదుకున్నారు. స్పిన్‌ను నిలకడగా ఆడితే ఔటవుతుండటంతో పంత్‌ దూకుడుగా ఆడాడు. వరుస పెట్టి బౌండరీలు కొట్టాడు. కీలక సమయంలో అతడు క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు. అప్పటి నుంచి అయ్యర్‌ అమేజింగ్‌ ఇన్నింగ్స్‌ మొదలైంది. కఠిన పిచ్‌పై అతడు బ్యాటింగ్‌ చేసిన తీరు మాత్రం అద్భుతం. టర్న్‌ను చక్కగా ఎదుర్కొంటూనే లూజ్‌ బాల్స్‌ పడితే బౌండరీకి పంపించాడు. అవతలి ఎండ్‌లోని బ్యాటర్లు కంగారు పడుతోంటే అతడు మాత్రం నిలకడగా ఆడుతున్నాడు. బ్యాక్‌ఫుట్‌తో పాటు నిలబడి సిక్సర్లు బాదేశాడు. 54 బంతుల్లోనే 50 పరుగులుపూర్తి చేశాడు. ఆ తర్వాత మరింత రెచ్చిపోయి సిక్సర్లు కొట్టాడు. టెయిలెండర్లను అడ్డుపెట్టుకొని టీమ్‌ఇండియా స్కోరును 250 దాటించాడు. అయితే సెంచరీకి ముందు స్టంపౌట్‌ అయ్యాడు. నిజానికి శ్రేయస్‌ ఇన్నింగ్స్‌ డబుల్‌ సెంచరీతో సమానమని విశ్లేషకులు అంటున్నారు.

Published at : 13 Mar 2022 02:40 PM (IST) Tags: Srilanka Team India Ind vs SL Jasprit Bumrah IND vs SL 2nd Test Pink Ball Test

సంబంధిత కథనాలు

Ajinkya Rahane Becomes Father:  మగ బిడ్డకు జన్మనిచ్చిన రహానే భార్య- శుభవార్తను అభిమానులతో పంచుకున్న క్రికెటర్

Ajinkya Rahane Becomes Father: మగ బిడ్డకు జన్మనిచ్చిన రహానే భార్య- శుభవార్తను అభిమానులతో పంచుకున్న క్రికెటర్

ICC T20I Rankings: టీ20 ర్యాంకింగ్స్‌లో దూసుకుపోతున్న 'SKY'- అగ్రస్థానానికి ఒక్క అడుగు దూరంలో!

ICC T20I Rankings: టీ20 ర్యాంకింగ్స్‌లో దూసుకుపోతున్న 'SKY'- అగ్రస్థానానికి ఒక్క అడుగు దూరంలో!

IND vs SA 3rd T20: ఆఖరి టీ20లో టీమ్‌ఇండియా ఢమాల్‌! టాప్‌- మిడిల్‌ కొలాప్స్‌!

IND vs SA 3rd T20: ఆఖరి టీ20లో టీమ్‌ఇండియా ఢమాల్‌! టాప్‌- మిడిల్‌ కొలాప్స్‌!

IND vs SA 3rd T20: రిలీ రొసో సెంచరీ అదరహో..! టీమ్‌ఇండియా టార్గెట్‌ 228

IND vs SA 3rd T20: రిలీ రొసో సెంచరీ అదరహో..! టీమ్‌ఇండియా టార్గెట్‌ 228

IND vs SA 3rd T20: మూడో టీ20 టాస్‌ మనదే! రోహిత్‌ ఏం ఎంచుకున్నాడంటే?

IND vs SA 3rd T20: మూడో టీ20 టాస్‌ మనదే! రోహిత్‌ ఏం ఎంచుకున్నాడంటే?

టాప్ స్టోరీస్

ఉన్న ప్రతిపక్షాలకే ఆదరణ లేదు- వచ్చే బీఆర్‌ఎస్‌ ఏం చేస్తుంది: ఏపీ మంత్రులు

ఉన్న ప్రతిపక్షాలకే ఆదరణ లేదు- వచ్చే బీఆర్‌ఎస్‌ ఏం చేస్తుంది: ఏపీ మంత్రులు

Nobel Peace Prize 2022: నోబెల్ శాంతి బహుమతి రేసులో ఇద్దరు భారతీయులు!

Nobel Peace Prize 2022: నోబెల్ శాంతి బహుమతి రేసులో ఇద్దరు భారతీయులు!

Sridevi Sarees Auction: అతిలోక సుందరి చీరలు వేలం, ఆ డబ్బుతో ఏం చేస్తారంటే?

Sridevi Sarees Auction: అతిలోక సుందరి చీరలు వేలం, ఆ డబ్బుతో ఏం చేస్తారంటే?

దేశానికే కేసీఆర్‌ రోల్ మోడల్- సరైన టైంలో తెలివైన నిర్ణయం తీసుకున్నారు: తిరుమావళవన్

దేశానికే కేసీఆర్‌ రోల్ మోడల్- సరైన టైంలో తెలివైన నిర్ణయం తీసుకున్నారు: తిరుమావళవన్