IND vs SL 1st test: జడ్డూ డబుల్ సెంచరీ మిస్ - టీమ్‌ఇండియా 574/8 ఇన్నింగ్స్ డిక్లేర్
IND vs SL 1st test: మొహలి టెస్టులో టీమ్‌ఇండియా తొలి ఇన్నింగ్స్ ముగిసింది. 129.2 ఓవర్లకు 574/8 వద్ద రోహిత్ శర్మ ఇన్నింగ్స్ డిక్లేర్ చేశాడు.
IND vs SL 1st test: మొహలి టెస్టులో టీమ్‌ఇండియా తొలి ఇన్నింగ్స్ ముగిసింది. 129.2 ఓవర్లకు 574/8 వద్ద రోహిత్ శర్మ ఇన్నింగ్స్ డిక్లేర్ చేశాడు. రవీంద్ర జడేజా (175; 228 బంతుల్లో 17x4, 3x6) భారీ సెంచరీ కొట్టేశాడు. మహ్మద్ షమి (20; 34 బంతుల్లో 3x4) అతడితో తోడుగా నాటౌట్‌గా నిలిచాడు. రవిచంద్రన్ అశ్విన్ (61; 82 బంతుల్లో 8x4) హాఫ్ సెంచరీ కొట్టాడు.
రెండో రోజు, శనివారం ఓవర్‌నైట్ స్కోరు 357/6తో టీమ్‌ఇండియా ఆట ఆరంభించింది. రవీంద్ర జడేజా (45), రవిచంద్రన్ అశ్విన్ (10) తొలిరోజు ఎక్కడ ఆపారో అక్కడే మొదలు పెట్టారు. ఒకరితో మరొకరు పోటీ పడుతూ బౌండరీలు కొట్టారు. లంక బౌలర్లను ఆటాడుకున్నారు. ఎంతకీ వారికి ఛాన్స్ ఇవ్వలేదు. చూస్తుండగానే హాఫ్ సెంచరీ బాదేసిన జడ్డూ గేర్లు మార్చేశాడు. మరో ఎండ్‌లో అశ్విన్ కూడా 67 బంతుల్లో 50 పరుగులు చేశాడు. 160 బంతుల్లో జడ్డూ సెంచరీ చేయడంతో 468/7తో టీమ్‌ఇండియా లంచ్‌కు వెళ్లింది. అంతకు ముందే అశ్విన్‌ను సురంగ లక్మల్ ఔట్ చేయడంతో 130 పరుగుల వీరి పార్ట్‌నర్‌షిప్ ముగిసిపోయింది.
'Rockstar' @imjadeja 👏👏@Paytm #INDvSL pic.twitter.com/JG25othE56
— BCCI (@BCCI) March 5, 2022
జయంత్ యాదవ్ త్వరగానే ఔటైనా మహ్మద్ షమి (20; 34 బంతుల్లో 3x4)తో కలిసి జడ్డూ ఆడిన తీరు ఇంట్రెస్టింగా అనిపించింది. ఎందుకంటే తొమ్మిదో వికెట్‌కు ఈ జోడీ 94 బంతుల్లోనే 103 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పింది. ఆఖర్లో జడ్డూ వీర విహారం చేశాడు. వరుసగా బౌండరీలు, సిక్సర్లు కొట్టడంతో లంకేయులు అలసిపోయారు. కనీసం పరుగెత్తేందుకు వారిలో ఓపికా లేదు. షమి కూడా స్టార్ బ్యాటర్ టైపులో కవర్‌డ్రైవులు కొట్టేశాడు. జడ్డూ డబుల్ సెంచరీ చేసే జోష్‌లో కనిపించినా.. టైమ్ లేకపోవడంతో రోహిత్ శర్మ ఇన్నింగ్స్ డిక్లేర్ చేసేశాడు.
Lunch on Day 2 of the 1st Test.
— BCCI (@BCCI) March 5, 2022
130 run partnership between Jadeja and Ashwin and a brilliant century from @imjadeja as #TeamIndia are 468/7 at Lunch.
Scorecard - https://t.co/c2vTOXAx1p #INDvSL @Paytm pic.twitter.com/iqEPRNKEci
Here comes the declaration and that will also be Tea on Day 2 of the 1st Test.
— BCCI (@BCCI) March 5, 2022
Ravindra Jadeja remains unbeaten on 175.#TeamIndia 574/8d
Scorecard - https://t.co/c2vTOXSGfx #INDvSL @Paytm pic.twitter.com/yBnZ2mTeku