By: ABP Desam | Updated at : 03 Jan 2022 02:17 PM (IST)
Edited By: Ramakrishna Paladi
Team India's Test Skipper Virat Kohli, Pic Courtesy: @ICC / Twitter
దక్షిణాఫ్రికాతో రెండో టెస్టులో టీమ్‌ఇండియాకు షాక్ తగిలింది! కెప్టెన్ విరాట్ కోహ్లీ అందుబాటులో ఉండటం లేదు. వెన్నునొప్పి కారణంగా అతడు జట్టుకు దూరమయ్యాడు. అతడి స్థానంలో కేఎల్ రాహుల్ భారత్‌కు సారథ్యం వహిస్తున్నాడు. కఠినమైన వాండరర్స్ పిచ్‌పై విరాట్ లేకపోవడం ఇబ్బందికరమే!
టాస్ సమయంలో విరాట్ కోహ్లీ బదులు కేఎల్ రాహుల్ మైదానంలోకి రావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. విరాట్ ఎందుకు రావడం లేదో ఎవరికీ అర్థం కాలేదు. అయితే టాస్ గెలిచిన తర్వాత కేఎల్ రాహుల్ అసలు కారణం చెప్పాడు. విరాట్ వెన్నునొప్పితో బాధపడుతున్నాడని వివరించాడు. అతడిని ఫిజియోలు పర్యవేక్షిస్తున్నారని పేర్కొన్నాడు. బహుశా మూడో టెస్టు లోపు కోలుకుంటాడని ధీమా వ్యక్తం చేశాడు. అతడి స్థానాన్ని హనుమ విహారి భర్తీ చేస్తున్నాడని వెల్లడించాడు.
Toss Update - KL Rahul has won the toss and elects to bat first in the 2nd Test.
Captain Virat Kohli misses out with an upper back spasm.#SAvIND pic.twitter.com/2YarVIea4H— BCCI (@BCCI) January 3, 2022
ప్రస్తుతం మ్యాచ్ జరుగుతున్న వాండరర్స్‌లో కోహ్లీకి మంచి రికార్డు ఉంది. ఇప్పటి వరకు అతనక్కడ 310 పరుగులు చేశాడు. అతడు మరో 7 పరుగులు చేస్తే జాన్ రీడ్ 316 రికార్డును బద్దలు కొట్టేస్తాడు. ఈ మైదానంలో అత్యంత విజయవంతమైన పర్యాటక బ్యాటర్‌గా అవతరిస్తాడు. 2013లో విరాట్ ఇక్కడ పరుగుల వరద పారించాడు. తొలి ఇన్నింగ్స్‌లో శతకం బాదేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో 96 పరుగులు చేశాడు. కాగా ఈ మ్యాచ్ డ్రా అయింది. ఇక 2018లో వరుసగా 54, 41 పరుగులు సాధించాడు. ఈ మ్యాచ్ ఆడటం లేదు కాబట్టి రీడ్ రికార్డు బద్దలు చేయాలంటే కోహ్లీ మరికొంత కాలం ఆగాల్సిందే.
🚨 Indian skipper Virat Kohli ruled out of the second #SAvIND Test in Johannesburg.
— ICC (@ICC) January 3, 2022
More details 👇 #WTC23 https://t.co/6eHvLmjJlS
భారత జట్టు: కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, చెతేశ్వర్ పుజారా, అజింక్య రహానె, హనుమ విహారి, రిషభ్ పంత్, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమి, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్
KL Rahul has won the toss and India will bat first in the second Test in Johannesburg 🏏
— ICC (@ICC) January 3, 2022
Indian skipper Virat Kohli misses the match with an upper back spasm.
Watch #SAvIND live on https://t.co/CPDKNx77KV (in select regions) 📺#WTC23 | https://t.co/BCpTa2JF2P pic.twitter.com/zxZWB1iAth
GT vs RR, Qualifier 1 Highlights: మిల్లర్ 'కిల్లర్' విధ్వంసం, ఫైనల్‌కు GT - RRకు మరో ఛాన్స్
GT vs RR, Qualifier 1: జోస్ ది బాస్ - నాకౌట్లో బట్లర్ 89 - GT ముందు భారీ టార్గెట్ !
Maya Sonawane: మాయా! ఇదేం మాయ బౌలింగ్! వుమెన్స్ టీ20 ఛాలెంజ్‌లో వైరలైన బౌలింగ్ యాక్షన్
WT20 Challenge 2022: లేడీ సెహ్వాగ్ థండర్స్ ముందు సాగని హర్మన్ మెరుపుల్!
GT vs RR, Qualifier 1: హార్దిక్‌నే వరించిన టాస్ - రాజస్థాన్ తొలి బ్యాటింగ్
Babu Pawan Reaction : పాలనా వైఫల్యాన్ని మా మీద నెడతారా ? ప్రభుత్వంపై పవన్, చంద్రబాబు ఆగ్రహం!
Quad Meet Tension : క్వాడ్ దేశాధినేతలను రెచ్చగొడుతున్న చైనా, రష్యా - మీటింగ్ సమీపంలో యుద్ధ విన్యాసాలు !
Cooking Oil Prices: వంట నూనెలపై గుడ్ న్యూస్ చెప్పనున్న కేంద్రం! సన్‌ఫ్లవర్ ఆయిల్ ధరపై..!
KTR In Davos: తెలంగాణలో ఐదు వందల కోట్ల రూపాయలతో ఆశీర్వాద్ పైప్స్ తయారీ ప్లాంట్ - విదేశాలకు ఎగుమతి చేసేలా ప్లానింగ్