Ind vs SA, 1st Innings Highlights: తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించిన దక్షిణాఫ్రికా.. మళ్లీ చివర్లో వికెట్లు తీసిన శార్దూల్!
IND vs SA, 2nd Test, Wanderers Stadium: వాండరర్స్ టెస్టులో దక్షిణాఫ్రికా మొదటి ఇన్నింగ్స్‌లో 229 పరుగులకు ఆలౌట్ అయింది.
భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 229 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో ప్రొటీస్‌కు 27 పరుగుల ఆధిక్యం దక్కింది. దక్షిణాఫ్రికా తరఫున కీగన్ పీటర్సన్ టాప్ స్కోరర్ కాగా.. టెంపా బవుమా అర్థ సెంచరీ సాధించాడు. భారత బౌలర్లలో శార్దూల్ ఏడు వికెట్లు తీయగా.. షమికి రెండు, బుమ్రాకు ఒక వికెట్ దక్కాయి.
మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ 202 పరుగులు చేయగా.. దక్షిణాఫ్రికా మొదటి రోజే ఇన్నింగ్స్ ప్రారంభించింది. నాలుగో ఓవర్లోనే దక్షిణాఫ్రికా మొదటి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ ఎయిడెన్ మార్క్రమ్‌ను (7: 12 బంతుల్లోనే) షమీ అవుట్ చేశాడు. ఆ తర్వాత డీన్ ఎల్గర్ (28: 120 బంతుల్లో, నాలుగు ఫోర్లు), కీగన్ పీటర్సన్ (62: 118 బంతుల్లో, తొమ్మిది ఫోర్లు) జాగ్రత్తగా ఆడి వికెట్ పడకుండా రోజును ముగించారు.
రెండో రోజు మొదటి సెషన్‌లో దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ డీన్ ఎల్గర్, కీగన్ పీటర్సన్ జాగ్రత్తగా ఆడారు. అయితే సెషన్ చివర్లో శార్దూల్ ఠాకూర్ వీరిద్దరితో పాటు వాన్ డర్ డసెన్‌ను (1: 17 బంతుల్లో) కూడా అవుట్ చేశాడు. దీంతో దక్షిణాఫ్రికా కష్టాల్లో పడింది. అయితే రెండో సెషన్‌లో టెంపా బవుమా (51: 60 బంతుల్లో, నాలుగు ఫోర్లు), కైల్ వెరేయిన్ (21: 72 బంతుల్లో, మూడు ఫోర్లు) కాసేపు వికెట్లు పడకుండా ఆపారు. రెండో సెషన్ చివర్లో కూడా శార్దూల్ మళ్లీ బంతితో మాయ చేశాడు. క్రీజులో కుదురుకున్న వీరిద్దరినీ అవుట్ చేశాడు. వెంటనే రబడను షమీ అవుట్ చేశాడు.
ఇక టీ బ్రేక్ తర్వాత మార్కో జాన్సెన్ (21: 34 బంతుల్లో, మూడు ఫోర్లు), కేశవ్ మహరాజ్ (21: 29 బంతుల్లో, మూడు ఫోర్లు) కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. అయితే కేశవ్ మహరాజ్‌ను అవుట్ చేసి బుమ్రా ఈ భాగస్వామ్యాన్ని విడదీశాడు. తర్వాత చివరి రెండు వికెట్లను శార్దూల్ ఠాకూర్ దక్కించుకుని దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ ముగించాడు. దక్షిణాఫ్రికాకు 27 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కింది.
Shardul Thakur picks up 7 wickets as South Africa are all out for 229 runs. #TeamIndia's second innings underway.
— BCCI (@BCCI) January 4, 2022
Scorecard - https://t.co/qcQcovZ41s #SAvIND pic.twitter.com/Tqiz8pFKzd
Also Read: WATCH: 'మమ్మా..' అంటున్న వామిక! తపించి పోతున్న కోహ్లీ, అనుష్క
Also Read: Kohli on 100th Test: వందో టెస్టుకు మీడియా ముందుకు కోహ్లీ..! షాకింగ్ విషయాలు చెబుతాడా??
Also Read: Lionel Messi Covid Positive: మెస్సీకి కరోనా.. మరో ఇద్దరికి కూడా!
Also Read: IND vs SA 2nd Test: వాండరర్స్‌లో 'వండర్'కు సిద్ధమైన కోహ్లీ.. 7 పరుగులు చేస్తే ఆ రికార్డు బద్దలే!
Also Read: Team India Schedule 2022: ఏడాదంతా క్రికెట్ పండగే! టీమ్‌ఇండియాకు వరుసగా కీలక సిరీసులు.. ప్రపంచకప్
Also Read: Jasprit Bumrah: పేస్ బౌలర్లకు బాధ్యతలు ఎందుకు అప్పగించకూడదు.. అవసరమైతే బుమ్రాకు కెప్టెన్సీ