India vs Pakistan: భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌లో దాయాది వ్యూహం ఎలా ఉండనుంది? - తుదిజట్టులో ఛాన్స్ వీరికేనా?
భారత్, పాకిస్తాన్ ఆసియా కప్ మ్యాచ్‌లో పాకిస్తాన్ తుది జట్టు కూర్పు ఎలా ఉండవచ్చు?
India vs Pakistan Asia Cup 2023: 2023 ఆసియా కప్‌లో అతిపెద్ద మ్యాచ్ సెప్టెంబర్ 2వ తేదీన జరగనుంది. ఆరోజున భారత్, పాకిస్థాన్ జట్లు 2023 ఆసియా కప్‌లో తలపడనున్నాయి. క్రికెట్‌లో భారత్, పాకిస్తాన్‌ల మధ్య ఎప్పుడు మ్యాచ్ జరిగినా ఉత్కంఠ తారాస్థాయికి చేరుకుంటుంది.
2023 ఆసియా కప్ ఆగస్టు 30వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. టోర్నీలో తొలి మ్యాచ్ పాకిస్తాన్, నేపాల్ జట్ల మధ్య జరగనుంది. దీని తర్వాత సెప్టెంబర్ 2వ తేదీన బాబర్ ఆజం జట్టు భారత్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉండవచ్చు?
ఓపెనింగ్ ఎవరు?
భారత్‌తో జరిగే మ్యాచ్‌లో ఫఖర్ జమాన్, ఇమామ్ ఉల్ హక్‌లు ఇన్నింగ్స్‌ను ఓపెన్ చేయనున్నారు. దీని తర్వాత, కెప్టెన్ బాబర్ ఆజంను మూడో స్థానంలో, వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ మహ్మద్ రిజ్వాన్‌ను నాలుగో స్థానంలో ఆడాలని నిర్ణయించుకున్నారు. ఈ ఇద్దరు ఆటగాళ్లు టీ20 ఫార్మాట్‌లో ఓపెనర్లుగా ఉన్నారు. అయితే ఈసారి ఆసియా కప్ వన్డే ఫార్మాట్‌లో జరుగుతోంది. అటువంటి పరిస్థితిలో ఈ ఇద్దరు ఆటగాళ్లు మూడు, నాలుగు నంబర్లలో ఆడతారు.
పాకిస్థాన్ మిడిల్ ఆర్డర్ గురించి చెప్పాలంటే సల్మాన్ అలీ అఘా ఐదో స్థానంలో, ఇఫ్తికర్ అహ్మద్ ఆరో స్థానంలో బ్యాటింగ్ చేయవచ్చు. దీని తర్వాత షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్ బరిలోకి దిగనున్నారు. ఈ ఇద్దరు ఆటగాళ్లు తమ జట్టుకు బంతితో పాటు బ్యాట్‌తో కూడా మ్యాచ్ విన్నర్లుగా నిరూపించుకోగల సత్తా ఉన్న ఆటగాళ్లు.
ఫాస్ట్ బౌలింగ్ పాకిస్థాన్ ప్రాణం
షాదాబ్, నవాజ్ రూపంలో ఇద్దరు స్పిన్నర్లు జట్టులో ఉంటారు. ఫాస్ట్ బౌలింగ్ గురించి చెప్పాలంటే షహీన్ షా ఆఫ్రిది, నసీమ్ షా మరియు హరీస్ రౌఫ్ త్రయం యాక్షన్‌లో కనిపిస్తారు. మహ్మద్ వసీం జూనియర్ రూపంలో జట్టులో మరో ప్రమాదకర బౌలర్ ఉన్నాడు. కానీ ప్రస్తుత జట్టు కూర్పు ఆధారంగా వసీం జూనియర్ బెంచ్‌పై కూర్చోవలసి ఉంటుంది.
భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌లో పాకిస్తాన్ తుదిజట్టు (అంచనా)
ఫఖర్ జమాన్, ఇమామ్ ఉల్ హక్, బాబర్ ఆజం (కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), ఇఫ్తీకర్ అహ్మద్, సల్మాన్ అఘా, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, నసీమ్ షా, షాహీన్ షా ఆఫ్రిది, హరీస్ రవూఫ్.
మరోవైపు టీమ్‌ఇండియాలో నాలుగో స్థానంపై అతిగా ఆలోచించవద్దని మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అంటున్నాడు. ఆ స్థానంలో ఆడేందుకు విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ వంటి ఆటగాళ్లు ఉన్నారని పేర్కొన్నాడు. ఎవరు ఏ పొజిషన్లో బ్యాటింగ్ చేయాలన్న దానిపై ఎలాంటి నిబంధనలు లేవని తెలిపాడు. జట్టు అవసరాలను బట్టి ఆటగాళ్లు ఫ్లెక్సిబుల్‌గా ఉండాలని సూచించాడు. భారత జట్టులో ఎక్కువ మంది ప్రతిభావంతులు ఉన్నారని, అదే పెద్ద సమస్యని వెల్లడించాడు.
2023 ఆసియా కప్‌కి 17 మందితో కూడిన జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఈ జట్టులో కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్‌కు చోటిచ్చింది. జస్‌ప్రీత్ బుమ్రా, ప్రసీద్ కృష్ణ మెగా టోర్నీకి ఎంపికయ్యారు. హైదరాబాదీ తిలక్ వర్మకూ సెలక్టర్లు అవకాశం ఇవ్వడం విశేషం.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial