IND vs NZ ODI Head to Head: భారత్, న్యూజిలాండ్ మ్యాచ్‌ల్లో రికార్డులు ఇవే - సచిన్ 24 ఏళ్ల రికార్డు ఇప్పుడైనా బద్దలవుతుందా?
భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ల్లో పూర్తి రికార్డులు ఇవే.
![IND vs NZ ODI Head to Head: భారత్, న్యూజిలాండ్ మ్యాచ్‌ల్లో రికార్డులు ఇవే - సచిన్ 24 ఏళ్ల రికార్డు ఇప్పుడైనా బద్దలవుతుందా? IND vs NZ ODI Head to Head: India will compete with New Zealand know all the figures from the most runs and most wickets IND vs NZ ODI Head to Head: భారత్, న్యూజిలాండ్ మ్యాచ్‌ల్లో రికార్డులు ఇవే - సచిన్ 24 ఏళ్ల రికార్డు ఇప్పుడైనా బద్దలవుతుందా?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/13/4d1fe04f620a9cfc0f3c9cd9a6af43831673605503842300_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
IND vs NZ ODI Head to Head: న్యూజిలాండ్‌తో వన్డే, టీ20 సిరీస్‌లు ఆడేందుకు భారత జట్టు సిద్ధంగా ఉంది. వీరిద్దరి మధ్య మూడు వన్డేల సిరీస్ జనవరి 18వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్ హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరగనుంది. న్యూజిలాండ్ ప్రస్తుతం నంబర్ వన్ వన్డే జట్టుగా ఉంది. కాబట్టి ఈ సిరీస్‌ను గెలవడం భారత్‌కు అంత సులువు కాదు. వీరిద్దరి మధ్య ఇప్పటి వరకు జరిగిన వన్డేల్లో పైచేయి ఎవరిదో తెలుసుకుందాం.
ఇప్పటి వరకు ఇరు జట్ల మధ్య మొత్తం 113 వన్డేలు జరిగాయి. ఇందులో భారత జట్టు 55 మ్యాచ్‌లు గెలవగా, న్యూజిలాండ్ 50 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఏడు మ్యాచ్‌లలో ఎటువంటి ఫలితం రాలేదు. ఒక మ్యాచ్ టైగా ముగిసింది. గణాంకాల ప్రకారం విజయాల్లో భారత జట్టు న్యూజిలాండ్ కంటే ముందుంది. టీమ్ ఇండియా ఇప్పటి వరకు 52.35 శాతం మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఇక న్యూజిలాండ్ 47.64 శాతం మ్యాచ్‌లను గెలుచుకుంది.
అత్యధిక పరుగులు ఎవరివి?
ఈ రెండు జట్ల మధ్య జరిగిన వన్డేల్లో భారత మాజీ బ్యాట్స్‌మెన్ సచిన్ టెండూల్కర్ అత్యధిక పరుగులు చేశాడు. ఆయన 41 మ్యాచ్‌లలో 41 ఇన్నింగ్స్‌లలో 46.05 సగటుతో 1,750 పరుగులు చేశాడు. ఇందులో అతని అత్యధిక స్కోరు 186 నాటౌట్ పరుగులు. ఏ బ్యాట్స్‌మెన్ చేసిన అత్యధిక స్కోరు ఇదే. ఈ స్కోరును సచిన్ 1999లో చేశాడు. అప్పటి నుంచి ఈ రికార్డు అలానే ఉంది. ఈ సారైనా బద్దలవుతుందేమో చూడాలి. అతని బ్యాట్ నుంచి ఐదు సెంచరీలు, ఎనిమిది అర్ధ సెంచరీలు కూడా వచ్చాయి.
అత్యధిక వికెట్ల వీరుడు ఎవరు?
భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన వన్డేల్లో భారత మాజీ ఫాస్ట్ బౌలర్ జగ్వాల్ శ్రీనాథ్ అత్యధికంగా 51 వికెట్లు పడగొట్టాడు. అతను 30 మ్యాచ్‌ల్లో 20.41 సగటుతో ఈ వికెట్లు తీశాడు.
అత్యధిక సెంచరీలు, అర్ధశతకాలు
వీరేంద్ర సెహ్వాగ్ రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ల్లో అత్యధికంగా ఆరు సెంచరీలు చేశాడు. మరోవైపు అత్యధిక సార్లు 50 పరుగుల సంఖ్యను దాటిన వారిలో విరాట్ కోహ్లీ నంబర్ వన్ స్థానంలో ఉన్నాడు. అతను ఈ సంఖ్యను 13 సార్లు దాటాడు.
మొదటి సెంచరీ ఎవరిది
రెండు జట్ల ODI క్రికెట్‌లో మొదటి సెంచరీని గ్లెన్ టర్నర్ చేశారు. 1975 జూన్ 14వ తేదీన మాంచెస్టర్‌లో జరిగిన మ్యాచ్‌లో ఈ సెంచరీ నమోదు అయింది. ఆ మ్యాచ్‌లో టర్నర్ 117 బంతుల్లో 114 పరుగులతో అజేయ ఇన్నింగ్స్ ఆడాడు.
వికెట్ కీపింగ్ రికార్డులు
ఈ రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ల్లో భారత వికెట్ కీపర్ నయన్ మోంగియా స్టంప్స్ వెనుక నుంచి అత్యధికంగా 36 మంది బ్యాట్స్‌మెన్‌లను పెవిలియన్‌కు పంపాడు. ఇందులో 24 క్యాచ్‌లు, 12 స్టంపింగ్‌లు ఉన్నాయి. కాగా, భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ 33 ఔట్‌లతో రెండో స్థానంలో ఉన్నాడు.
ఫీల్డింగ్ రికార్డులు
న్యూజిలాండ్ ఆటగాడు రాస్ టేలర్ రెండు జట్ల మధ్య వన్డేల్లో అత్యధికంగా 19 క్యాచ్‌లు అందుకున్నాడు. 35 మ్యాచ్‌ల్లో రాస్ టేలర్ ఈ క్యాచ్‌లు అందుకున్నాడు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)