అన్వేషించండి

IND vs NZ, T20 LIVE: 14.3 ఓవర్లలో ముగిసేసరికి న్యూజిలాండ్ స్కోరు 111-2, ఎనిమిది వికెట్లతో న్యూజిలాండ్ విజయం

T20 WC 2021, Match 28, IND vs NZ: ఐసీసీ టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా నేడు జరిగిన మ్యాచ్‌లో ఇండియా, న్యూజిలాండ్ తలపడనున్నాయి.

LIVE

Key Events
IND vs NZ, T20 LIVE: 14.3 ఓవర్లలో ముగిసేసరికి న్యూజిలాండ్ స్కోరు 111-2, ఎనిమిది వికెట్లతో న్యూజిలాండ్ విజయం

Background

టీ20 వరల్డ్‌కప్‌లో నేడు జరగనున్న మ్యాచ్‌లో భారత్, న్యూజిలాండ్‌తో తలపడనుంది. భారత్ సెమీస్‌కు చేరాలంటే ఈ మ్యాచ్‌లో కచ్చితంగా గెలవాల్సిందే. అయితే భారత్.. వరల్డ్ కప్‌లో న్యూజిలాండ్‌పై గెలిచి 18 సంవత్సరాలు అయిపోతుంది. టీ20 వరల్డ్ ‌కప్‌లో అయితే ఇంతవరకు ఒక్కసారి కూడా విజయం సాధించలేదు. 2007, 2016 సంవత్సరాల్లో టీ20 వరల్డ్ కప్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌ల్లో భారత్‌కు పరాజయమే ఎదురైంది.

విధ్వంసకరమైన బ్యాటర్లు, పటిష్టమైన బౌలర్లు, ప్రపంచస్థాయి ఫీల్డర్లు టీమిండియా సొంతం. అయితే అన్నీ ఉన్నా.. అల్లుడి నోట్లో శని అన్నట్లు అవసరం అయినప్పుడు వరుసగా వైఫల్యాలే వెక్కిరిస్తున్నాయి. పాక్‌తో మ్యాచ్‌లో కోహ్లీ, పంత్ మినహా.. మిగతా బ్యాట్స్‌మెన్ ఎవరూ రాణించలేదు. ఇక బౌలింగ్ యూనిట్ మాత్రం పూర్తిగా విఫలం అయింది. అత్యంత కీలకమైన ఈ మ్యాచ్‌లో ఓపెనర్లు రోహిత్, రాహుల్‌తో పాటు సూర్యకుమార్ యాదవ్, జడేజా, హార్దిక్ అందరూ రాణించాల్సిన అవసరం ఉంది. బౌలింగ్‌లో బుమ్రా, షమీ, వరుణ్ చక్రవర్తి కీలకం కానున్నారు. హార్దిక్ పాండ్యా, భువీల్లో ఎవరినైనా పక్కన పెట్టి శార్దూల్ ఠాకూర్‌ను జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది.

న్యూజిలాండ్ బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్టిన్ గుప్టిల్, కేన్ విలియమ్సన్, డెవాన్ కాన్వే కీలకం కానున్నారు. బౌలింగ్‌లో కూడా టిమ్ సౌతీ, ట్రెంట్ బౌల్ట్, మిషెల్ శాంట్నర్ వంటి అత్యుత్తమ బౌలర్లు ఉన్నారు. కానీ పాకిస్తాన్ మీద వీరు కూడా విఫలం అయ్యారు. ట్రెంట్ బౌల్డ్ ఇదే పిచ్‌లపై ఐపీఎల్‌లో అద్భుతంగా రాణించాడు. కేన్ విలియమ్సన్ ప్రస్తుతం ఫాంలో లేక ఇబ్బంది పడుతున్నాడు. ఈ రెండు జట్ల మధ్య ఇంతవరకు 22 మ్యాచ్‌లు జరగ్గా.. 11 మ్యాచ్‌ల్లో న్యూజిలాండ్ విజయం సాధించింది. ఏడు మ్యాచ్‌ల్లో ఇండియా విజయం సాధించగా.. నాలుగు మ్యాచ్‌లు డ్రా అయ్యాయి.

శుక్రవారం జరిగిన సూపర్ 12 మ్యాచ్‌లో పాక్.. నాటకీయ పరిస్థితుల్లో ఆఫ్ఘనిస్తాన్‌పై విజయం సాధించింది. పాక్ విజయానికి చివరి 12 బంతుల్లో 24 పరుగులు సాధించాల్సి ఉండగా.. క్రీజులో ఇద్దరూ కొత్త బ్యాట్స్‌మెనే ఉన్నారు. దీంతో మొగ్గు ఆఫ్ఘనిస్తాన్ వైపే ఉంది. అయితే ఆసిఫ్ అలీ.. ఒకే ఓవర్లో నాలుగు సిక్సర్లతో మ్యాచ్‌ను గెలిపించాడు. అయితే ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘన్ విజయం సాధించి ఉంటే.. వాళ్లు కూడా సెమీస్ రేసులోకి వచ్చేవారు. పెద్ద జట్లయిన భారత్, న్యూజిలాండ్‌తో జరిగే మ్యాచ్‌ల్లో ఒక్క దాంట్లో విజయం సాధించినా సెమీస్‌కు చేరేందుకు వారికే మంచి చాన్స్ ఉండేది. ఈ మ్యాచ్‌లో పాక్ విజయం సాధించడం కూడా ఒకరకంగా భారత్‌కు మంచి చేసినట్లే. పాకిస్తాన్ తర్వాతి మ్యాచ్‌లు నమీబియా, స్కాట్లాండ్‌లతో కాబట్టి.. పాక్ అజేయంగా సెమీస్‌కు చేరడం దాదాపు ఖాయమే.

22:27 PM (IST)  •  31 Oct 2021

14.3 ఓవర్లలో ముగిసేసరికి న్యూజిలాండ్ స్కోరు 111-2, ఎనిమిది వికెట్లతో న్యూజిలాండ్ విజయం

శార్దూల్ ఠాకూర్ వేసిన ఈ ఓవర్లో మొదటి మూడు బంతుల్లోనే న్యూజిలాండ్ మ్యాచ్ ముగించింది. దీంతో వారి సెమీస్ అవకాశాలు మెరుగయ్యాయి.
డెవాన్ కాన్వే 2(4)
కేన్ విలియమ్సన్ 33(31)
శార్దూల్ ఠాకూర్ 1.3-0-17-0

22:25 PM (IST)  •  31 Oct 2021

14 ఓవర్లు ముగిసేసరికి న్యూజిలాండ్ స్కోరు 108-2, లక్ష్యం 111 పరుగులు

హార్దిక్ పాండ్యా వేసిన ఈ ఓవర్లో 12 పరుగులు వచ్చాయి. న్యూజిలాండ్ విజయానికి 36 బంతుల్లో మూడు పరుగులు కావాలి.
డెవాన్ కాన్వే 1(3)
కేన్ విలియమ్సన్ 31(29)
హార్దిక్ పాండ్యా 2-0-17-0

22:19 PM (IST)  •  31 Oct 2021

13 ఓవర్లు ముగిసేసరికి న్యూజిలాండ్ స్కోరు 96-2, లక్ష్యం 111 పరుగులు

బుమ్రా వేసిన ఈ ఓవర్లో 2 పరుగులు వచ్చాయి. డేరిల్ మిషెల్ అవుటయ్యాడు. న్యూజిలాండ్ విజయానికి 42 బంతుల్లో 15 పరుగులు కావాలి.
డెవాన్ కాన్వే 0(2)
కేన్ విలియమ్సన్ 21(24)
బుమ్రా 4-0-19-2
డేరిల్ మిచెల్ (సి) రాహుల్ (బి) బుమ్రా (49: 35 బంతుల్లో, నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లు)

22:13 PM (IST)  •  31 Oct 2021

12 ఓవర్లు ముగిసేసరికి న్యూజిలాండ్ స్కోరు 94-1, లక్ష్యం 111 పరుగులు

హార్దిక్ పాండ్యా వేసిన ఈ ఓవర్లో 5 పరుగులు వచ్చాయి. న్యూజిలాండ్ విజయానికి 48 బంతుల్లో 17 పరుగులు కావాలి.
డేరిల్ మిచెల్ 49(33)
కేన్ విలియమ్సన్ 20(22)
హార్దిక్ పాండ్యా 1-0-5-0

22:12 PM (IST)  •  31 Oct 2021

11 ఓవర్లు ముగిసేసరికి న్యూజిలాండ్ స్కోరు 89-1, లక్ష్యం 111 పరుగులు

బుమ్రా వేసిన ఈ ఓవర్లో 6 పరుగులు వచ్చాయి. న్యూజిలాండ్ విజయానికి 54 బంతుల్లో 22 పరుగులు కావాలి.
డేరిల్ మిచెల్ 47(31)
కేన్ విలియమ్సన్ 17(18)
బుమ్రా 3-0-17-1

Load More
New Update
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Holiday: మన్మోహన్ సింగ్ మృతి - నేడు తెలంగాణలో సెలవు ప్రకటించిన ప్రభుత్వం
మన్మోహన్ సింగ్ మృతి - నేడు తెలంగాణలో సెలవు ప్రకటించిన ప్రభుత్వం
Trivikram Srinivas: నాకు పోటీగా ఉండే ఏరియాలోకి నేను రాను, పోటీ లేని ఇంకో ఏరియాని వెతుక్కుంటా - త్రివిక్రమ్
నాకు పోటీగా ఉండే ఏరియాలోకి నేను రాను, పోటీ లేని ఇంకో ఏరియాని వెతుక్కుంటా - త్రివిక్రమ్
Aus Vs Ind Test Series: ఆసీస్ 474 పరుగులకు ఆలౌట్.. స్మిత్ భారీ సెంచరీ.. నాలుగు వికెట్లతో రాణించిన బుమ్రా
ఆసీస్ 474 పరుగులకు ఆలౌట్.. స్మిత్ భారీ సెంచరీ.. నాలుగు వికెట్లతో రాణించిన బుమ్రా
Venkatesh: వెంకీ ఖాతాలో మరో ‘జింగిడి జింగిడి’... 'సంక్రాంతికి వస్తున్నాం' కోసం ఈసారి పట్టుబట్టి మరీ!
వెంకీ ఖాతాలో మరో ‘జింగిడి జింగిడి’... 'సంక్రాంతికి వస్తున్నాం' కోసం ఈసారి పట్టుబట్టి మరీ!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Manmohan Singh Death | చూసేందుకు మౌనముని..కానీ మేథస్సులో అపర చాణక్యుడు | ABP DesamPuliputti Village Name History | పేరుతోనే ఫేమస్ అవుతున్న ఊరు ఇదే | ABP DesamManmohan Singh Death | మాజీ ప్రధాని, ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ కన్నుమూత | ABP Desamసీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన టాలీవుడ్ ప్రముఖులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Holiday: మన్మోహన్ సింగ్ మృతి - నేడు తెలంగాణలో సెలవు ప్రకటించిన ప్రభుత్వం
మన్మోహన్ సింగ్ మృతి - నేడు తెలంగాణలో సెలవు ప్రకటించిన ప్రభుత్వం
Trivikram Srinivas: నాకు పోటీగా ఉండే ఏరియాలోకి నేను రాను, పోటీ లేని ఇంకో ఏరియాని వెతుక్కుంటా - త్రివిక్రమ్
నాకు పోటీగా ఉండే ఏరియాలోకి నేను రాను, పోటీ లేని ఇంకో ఏరియాని వెతుక్కుంటా - త్రివిక్రమ్
Aus Vs Ind Test Series: ఆసీస్ 474 పరుగులకు ఆలౌట్.. స్మిత్ భారీ సెంచరీ.. నాలుగు వికెట్లతో రాణించిన బుమ్రా
ఆసీస్ 474 పరుగులకు ఆలౌట్.. స్మిత్ భారీ సెంచరీ.. నాలుగు వికెట్లతో రాణించిన బుమ్రా
Venkatesh: వెంకీ ఖాతాలో మరో ‘జింగిడి జింగిడి’... 'సంక్రాంతికి వస్తున్నాం' కోసం ఈసారి పట్టుబట్టి మరీ!
వెంకీ ఖాతాలో మరో ‘జింగిడి జింగిడి’... 'సంక్రాంతికి వస్తున్నాం' కోసం ఈసారి పట్టుబట్టి మరీ!
AP Weather Updates: ఏపీలో 2 రోజులు వర్షాలు, పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ - తెలంగాణలో చలి పంజా
ఏపీలో 2 రోజులు వర్షాలు, పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ - తెలంగాణలో చలి పంజా
Manmohan Singh Death: పసిడి తాకట్టు పెట్టిన మన్మోహన్ సంస్కరణవాది ఎలా అయ్యారు? దేశాన్ని బంగారు బాతులా ఎలా మార్చారు?
పసిడి తాకట్టు పెట్టిన మన్మోహన్ సంస్కరణవాది ఎలా అయ్యారు? దేశాన్ని బంగారు బాతులా ఎలా మార్చారు?
Manmohan Singh Death:మానవతావాదిని కోల్పోయాం- తెలుగు రాష్ట్రాల సీఎంలు సహా పలువురి సంతాపం 
మానవతావాదిని కోల్పోయాం- తెలుగు రాష్ట్రాల సీఎంలు సహా పలువురి సంతాపం 
Steve Smith Records: అద్భుత శతకంతో దిగ్గజాల సరసన స్టీవ్ స్మిత్, భారత్‌పై ఆసీస్ స్టార్ బ్యాటర్ అరుదైన రికార్డ్
అద్భుత శతకంతో దిగ్గజాల సరసన స్టీవ్ స్మిత్, భారత్‌పై ఆసీస్ స్టార్ బ్యాటర్ అరుదైన రికార్డ్
Embed widget