IND vs ENG Cricket Score LIVE: ముగిసిన రెండో రోజు ఆట... ENG 423/8... 345 పరుగుల ఆధిక్యంలో ఇంగ్లాండ్
INDIA Vs ENGLAND 3rd Test: మూడో టెస్టు రెండో రోజు ఆట ముగిసింది. ఆతిథ్య ఇంగ్లాండ్ 345 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.

Background
భారత్ X ఇంగ్లాండ్ మధ్య మూడో టెస్టు రెండో రోజు ఆట ప్రారంభమైంది. తొలి రోజు ఆటలో భారత్ 78 పరుగులకే ఆలౌటవ్వగా... ఇంగ్లాండ్ వికెట్ ఏమీ నష్టపోకుండా 120 పరుగులు చేసింది. దీంతో తొలి రోజే ఇంగ్లాండ్ 42 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది. మరి రెండో రోజు కోహ్లీ సేన ఏమైనా అద్భుతం చేస్తుందేమో చూడాలి.
345 పరుగుల ఆధిక్యంలో ఇంగ్లాండ్
మూడో టెస్టు రెండో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ 8 వికెట్ల నష్టానికి 423 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 345 పరుగుల ఆధిక్యం దక్కించుకుంది.
సిరాజ్ ఖాతాలో సామ్ కరన్ వికెట్
సామ్ కరన్ రూపంలో ఇంగ్లాండ్ 8వ వికెట్ కోల్పోయింది. సిరాజ్ వేసిన బంతిని ఎదుర్కొన్న కరన్ (15) సబ్ స్టిట్యూట్ యమాంక్ అగర్వాల్ కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.





















