IND vs ENG, 1st Innings Highlights: తొలి రోజు ఇంగ్లాండ్దే పూర్తి ఆధిపత్యం... 42 పరుగుల ఆధిక్యంలో ఇంగ్లాండ్... భారత్ తొలి ఇన్నింగ్స్ 78 ఆలౌట్
India vs England, 1st Innings Highlights: భారత్తో జరుగుతోన్న మూడో టెస్టు తొలి రోజు ఆటలో ఇంగ్లాండ్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది.
భారత్తో జరుగుతోన్న మూడో టెస్టు తొలి రోజు ఆటలో ఇంగ్లాండ్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్లోనూ అద్భుత ప్రదర్శన కనబరిచి తొలి రోజు పై చేయి సాధించింది. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ వికెట్ ఏమీ నష్టపోకుండా 120 పరుగులు చేసింది.
A tough day at the office for #TeamIndia 🇮🇳 as England 🏴 lead by 4️⃣2️⃣ runs at Stumps on Day 1️⃣.
— BCCI (@BCCI) August 25, 2021
Join us tomorrow for all the action from Day 2️⃣. #ENGvIND
Scorecard 👉 https://t.co/FChN8SDsxh pic.twitter.com/GnGOb7Iycg
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన భారత్... ఇంగ్లాండ్ బౌలర్ల మాయకి 78 పరుగులకే ఆలౌటైంది. దీంతో తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ 42 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. ఓపెనర్లు రోరీ బర్న్స్(52), హసీబ్ హమీద్(60) అర్ధశతకాలతో అదరగొట్టారు. వీరిద్దరూ భారత బౌలర్లకు ఏ మాత్రం చిక్కకుండా స్కోరు బోర్డును కదిలించారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత బౌలర్లు ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయారు.
Half-centuries for both of our openers! 👏
— England Cricket (@englandcricket) August 25, 2021
Scorecard/Clips: https://t.co/UakxjzUrcE@IGCom | 🏴 #ENGvIND 🇮🇳 pic.twitter.com/M78kznhb63
ఇద్దరు మాత్రమే రెండంకెల స్కోరు
మొదట టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన టీమ్ఇండియా 78 పరుగులకే ఆలౌటైంది. భారత టాప్ ఆర్డర్ ఘోరంగా విఫలమైంది. టీమ్ఇండియా ఆటగాళ్లలో ఇద్దరు మాత్రమే రెండంకెల స్కోరును సాధించారు. రోహిత్ శర్మ (19) టాప్ స్కోరర్గా నిలవగా... అజింక్యా రహానె(18) పరుగులు చేశాడు. కేఎల్ రాహుల్(0), చతేశ్వర్ పుజారా (1), విరాట్ కోహ్లీ(7), పంత్(2), జడేజా(4) ఊహించని రీతిలో విఫలమయ్యారు. ఇంగ్లాండ్ బౌలర్లలో అండర్సన్ 3, ఓవర్టన్ 3, రాబిన్సన్ 2, సామ్ కరన్ 2 వికెట్లు పడగొట్టారు. ఇంగ్లాండ్ వికెట్ కీపర్ జోస్ బట్లర్ ఐదు క్యాచులు పట్టడం విశేషం.
వరుస బంతుల్లో వికెట్లు... రోహిత్ శర్మ ఒంటరి పోరాటం
భారత్ తొలి ఇన్నింగ్స్లో వరుస బంతుల్లో వికెట్లు కోల్పోయింది. దీంతో మరో ఎండ్లో ఉన్న రోహిత్ శర్మకు ఎవరూ తోడు నిలవలేకపోయారు. రోహిత్ పరుగులేమీ చేయకపోయినా... వికెట్ కాపాడుకుంటూ క్రీజులో నిలబడ్డాడు. కానీ, అవతలి సైడ్ వచ్చిన బ్యాట్స్మెన్స్ ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోవడంతో రోహిత్ ఏం చేయలేకపోయాడు.
What is going on!! 🔥
— England Cricket (@englandcricket) August 25, 2021
Scorecard/Videos: https://t.co/UakxjzUrcE#ENGvIND pic.twitter.com/ldCg1723uv