అన్వేషించండి

IND vs ENG 1st T20: మిడ్‌నైట్‌ మ్యాచును చూడలేదా! ఇదిగో వీడియో!!

IND vs ENG 1st T20 Highlights: సౌథాంప్టన్‌లో టీమ్‌ఇండియా దుమ్మురేపింది! ఆతిథ్య ఇంగ్లాండ్‌ను హడలెత్తించింది. తొలి టీ20లో 50 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

సౌథాంప్టన్‌లో టీమ్‌ఇండియా దుమ్మురేపింది! ఆతిథ్య ఇంగ్లాండ్‌ను హడలెత్తించింది. తొలి టీ20లో 50 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. బ్యాటింగ్‌, బౌలింగ్‌లోనూ రోహిత్‌ సేన సత్తా చాటింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్‌ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 198 స్కోర్‌ చేయగా ఇంగ్లాండ్‌ 19.3 ఓవర్లలో 148కే కుప్పకూలింది.

భారత కాలమానం ప్రకారం రాత్రి 10:30 గంటలకు ఈ మ్యాచ్‌ జరిగింది. రాత్రి 1:30 గంటలకు పైగా సాగింది. దాంతో చాలామంది ఇండియన్‌ ఫ్యాన్స్‌ ఈ పోరును వీక్షించలేకపోయారు. అలా మిస్సైన వారి కోసం బ్రాడ్‌కాస్టర్‌ సోనీ లైవ్‌ హైలైట్స్‌ని యూట్యూబ్‌లో పోస్టు చేసింది. హార్దిక్‌ పాండ్య, దీపక్‌ హుడా, సూర్యకుమార్‌ యాదవ్‌ హార్డ్‌ హిట్టింగ్‌ను చూసి ఎంజాయ్‌ చేయండి!!

చివర్లో తడబడ్డ టీమిండియా

టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా మొదటి వికెట్‌ను త్వరగానే కోల్పోయింది. ఉన్నంత సేపు వేగంగా ఆడిన రోహిత్ శర్మను (24: 14 బంతుల్లో, ఐదు ఫోర్లు) మొయిన్ అలీ అవుట్ చేశాడు. ఆ తర్వాత కాసేపటికే ఇషాన్ కిషన్ (8: 10 బంతుల్లో) కూడా అవుటయ్యాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన దీపక్ హుడా (33: 17 బంతుల్లో, మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (39: 19 బంతుల్లో, నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లు), హార్దిక్ పాండ్యా రాణించారు.

అయితే వీరు ముగ్గురూ అవుటయ్యాక స్కోరు వేగం పూర్తిగా మందగించింది. దినేష్ కార్తీక్ (11: 7 బంతుల్లో, రెండు ఫోర్లు) విఫలం కావడంతో పాటు చివర్లో వరుసగా వికెట్లు కోల్పోవడంతో టీమిండియా 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 198 పరుగులకు పరిమితం అయింది. ఇంగ్లండ్ బౌలర్లలో మొయిన్ అలీ, క్రిస్ జోర్డాన్ రెండు వికెట్లు తీసుకోగా... రీస్ టాప్లే, టైమల్ మిల్స్, మాథ్యూ పార్కిన్సన్‌లకు చెరో వికెట్ దక్కింది.

అదరగొట్టిన బౌలర్లు

199 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌కు ఆరంభంలోనే గట్టి షాక్ తగిలింది. భీకరమైన ఫాంలో ఉన్న కెప్టెన్, ఓపెనర్ జోస్ బట్లర్ (0: 1 బంతి) తాను ఎదుర్కొన్న మొదటి బంతికే డకౌట్ అయ్యాడు. భువీ అద్భుతమైన ఇన్‌స్వింగర్‌తో బట్లర్‌ను బోల్తా కొట్టించాడు. ఆ తర్వాత ఇంగ్లండ్ భరతం పట్టే పని పాండ్యా తీసుకున్నాడు. ఇన్నింగ్స్  ఐదో ఓవర్లో డేవిడ్ మలన్ (21: 14 బంతుల్లో, నాలుగు ఫోర్లు), లియాం లివింగ్ స్టోన్ (0: 3 బంతుల్లో), ఏడో ఓవర్లో జేసన్ రాయ్‌లను (4: 16 బంతుల్లో) పాండ్యా అవుట్ చేశాడు. దీంతో ఇంగ్లండ్ 33 పరుగులకే ఇంగ్లండ్ నాలుగు వికెట్లు కోల్పోయింది.

హ్యారీ బ్రూక్ (28: 23 బంతుల్లో, రెండు ఫోర్లు, ఒక సిక్సర్), మొయిన్ అలీ (36: 20 బంతుల్లో, నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లు) ఇన్నింగ్స్‌ను నిలబెట్టే ప్రయత్నం చేశారు. వీరిద్దరూ ఐదో వికెట్‌కు 61 పరుగులు జోడించారు. ఇక్కడ చాహల్ ఇంగ్లండ్‌కు షాక్ ఇచ్చాడు. వీరిద్దరినీ ఒకే ఓవర్లో అవుట్ చేశాడు. తర్వాత వచ్చిన వారిలో క్రిస్ జోర్డాన్ (26: 17 బంతుల్లో, రెండు ఫోర్లు, ఒక సిక్సర్) పోరాడినా అది మ్యాచ్ గెలవడానికి ఏమాత్రం సరిపోలేదు. దీంతో ఇంగ్లండ్ 19.3 ఓవర్లలో 148 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో హార్దిక్ పాండ్యా నాలుగు వికెట్లు తీయగా... అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్ చెరో రెండు వికెట్లు దక్కించుకున్నారు. భువీ, హర్షల్ పటేల్‌లు చెరో వికెట్ పడగొట్టారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: 'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
Telangana MLA Disqualification News: ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
AP Assembly PAC Issue: జగన్ రాజకీయంతో సీనియర్ నేత పెద్దిరెడ్డికి అవమానం - పీఏసీ ఎన్నిక విషయంలో సలహాలు తిరగబడ్డాయా ?
జగన్ రాజకీయంతో సీనియర్ నేత పెద్దిరెడ్డికి అవమానం - పీఏసీ ఎన్నిక విషయంలో సలహాలు తిరగబడ్డాయా ?
TTD : టీటీడీ ఉద్యోగుల్లో అన్యమతస్తుల్ని గుర్తించేందుకు స్పెషల్ ఆపరేషన్ - ఇళ్లకు వెళ్లి చెక్ చేస్తారా ?
టీటీడీ ఉద్యోగుల్లో అన్యమతస్తుల్ని గుర్తించేందుకు స్పెషల్ ఆపరేషన్- ఇళ్లకు వెళ్లి చెక్ చేస్తారా ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పేలిన ఎలక్ట్రిక్ స్కూటీ, టాప్ కంపెనీనే.. అయినా బ్లాస్ట్!ప్రసంగం మధ్యలోనే  ఏడ్చేసిన కాకినాడ కలెక్టర్పతనంతో ఆసీస్ పర్యటన ప్రారంభంబోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: 'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
Telangana MLA Disqualification News: ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
AP Assembly PAC Issue: జగన్ రాజకీయంతో సీనియర్ నేత పెద్దిరెడ్డికి అవమానం - పీఏసీ ఎన్నిక విషయంలో సలహాలు తిరగబడ్డాయా ?
జగన్ రాజకీయంతో సీనియర్ నేత పెద్దిరెడ్డికి అవమానం - పీఏసీ ఎన్నిక విషయంలో సలహాలు తిరగబడ్డాయా ?
TTD : టీటీడీ ఉద్యోగుల్లో అన్యమతస్తుల్ని గుర్తించేందుకు స్పెషల్ ఆపరేషన్ - ఇళ్లకు వెళ్లి చెక్ చేస్తారా ?
టీటీడీ ఉద్యోగుల్లో అన్యమతస్తుల్ని గుర్తించేందుకు స్పెషల్ ఆపరేషన్- ఇళ్లకు వెళ్లి చెక్ చేస్తారా ?
AR Rahman Award: విడాకులతో వార్తల్లో నిలిచిన రెహమాన్‌కు అవార్డు... అంత బాధలో చిరు ఊరట, ఆ గుడ్ న్యూస్ ఏమిటంటే?
విడాకులతో వార్తల్లో నిలిచిన రెహమాన్‌కు అవార్డు... అంత బాధలో చిరు ఊరట, ఆ గుడ్ న్యూస్ ఏమిటంటే?
Devaki Nandana Vasudeva Review - దేవకీ నందన వాసుదేవ రివ్యూ: కృష్ణుడు కంసుడి కథకు కొత్త టచ్ - మహేష్ మేనల్లుడి సినిమా ఎలా ఉందంటే?
దేవకీ నందన వాసుదేవ రివ్యూ: కృష్ణుడు కంసుడి కథకు కొత్త టచ్ - మహేష్ మేనల్లుడి సినిమా ఎలా ఉందంటే?
Food Combinations to Avoid : ఈ ఫుడ్ కాంబినేషన్స్​ని తీసుకుంటున్నారా? అయితే జాగ్రత్త, కలిపి తినకపోవడమే మంచిది
ఈ ఫుడ్ కాంబినేషన్స్​ని తీసుకుంటున్నారా? అయితే జాగ్రత్త, కలిపి తినకపోవడమే మంచిది
Stock Market News: పడి లేచిన అదానీ స్టాక్స్- భారీ లాభాల్లో సెన్సెక్స్ అండ్‌ నిఫ్టీ- రూ.5.50 లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద
పడి లేచిన అదానీ స్టాక్స్- భారీ లాభాల్లో సెన్సెక్స్ అండ్‌ నిఫ్టీ- రూ.5.50 లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద  
Embed widget