News
News
X

IND Vs AUS: అద్భుతమైన క్యాచ్‌లో పుజారాను అవుట్ చేసిన స్మిత్ - కెప్టెన్సీ కూడా సూపర్!

ఇండోర్ టెస్టులో స్టీవ్ స్మిత్ అద్భుతమైన క్యాచ్‌తో పుజారాను అవుట్ చేశాడు.

FOLLOW US: 
Share:

India vs Australia, 3rd Test: ఇండోర్ టెస్ట్ మ్యాచ్‌లో రెండు రోజుల ఆట పూర్తయిన తర్వాత,ఆస్ట్రేలియా జట్టు స్థానం చాలా బలంగా కనిపిస్తోంది. ఈ సిరీస్‌లో కమ్‌బ్యాక్ ఇవ్వాలంటే కంగారూ జట్టు ఈ టెస్టు మ్యాచ్‌లో గెలవాలంటే కేవలం 76 పరుగులు మాత్రమే ఛేజ్ చేయాలి.

ఈ టెస్ట్ మ్యాచ్‌లో, కంగారూ జట్టుకు కెప్టెన్‌గా ఉన్న స్టీవ్ స్మిత్ ఫీల్డ్‌లో కూడా ఎనర్జిటిక్‌గా కనిపించాడు. అతను లెగ్ స్లిప్‌లో ఒంటి చేత్తో అద్భుతమైన క్యాచ్ పట్టి ఛతేశ్వర్ పుజారాను అవుట్ చేశాడు. ఆస్ట్రేలియాకు మ్యాచ్‌లో పైచేయి అందించడంలో కీలక పాత్ర పోషించాడు.

ఇండోర్ టెస్టు మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు తొలి ఇన్నింగ్స్‌లో స్టీవ్ స్మిత్ బ్యాటింగ్‌లో 26 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అయితే కెప్టెన్సీ ద్వారా అతను పాట్ కమిన్స్‌పై పైచేయి సాధించాడు. బౌలింగ్‌ను నిరంతరం మార్చడం, సరైన ఫీల్డింగ్‌ను ఉంచడం, బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి ఉంచడం ద్వారా ఇండోర్ టెస్ట్ మ్యాచ్‌లో స్టీవ్ స్మిత్ తన కెప్టెన్సీ నైపుణ్యాన్ని చూపించాడు.

ఈ టెస్టు మ్యాచ్‌లో భారత జట్టు రెండో ఇన్నింగ్స్‌లో ఒక ఎండ్‌ నుంచి వరుస వికెట్లు పడుతుండగా మరోవైపు ఛతేశ్వర్‌ పుజారా సునాయాసంగా పరుగులు చేస్తున్నాడు. ఈ సమయంలో పుజారా తన అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాక 59 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నాథన్ లియాన్ బౌలింగ్‌లో లెగ్ సైడ్ వైపు షాట్ ఆడాడు. అది నేరుగా లెగ్ స్లిప్ వైపుకు వెళ్లింది మరియు ఆ సమయంలో, స్టీవ్ స్మిత్ ఈ క్యాచ్‌ను ఒంటి చేత్తో పట్టుకున్నాడు. ఈ వికెట్‌తో భారత జట్టు స్కోరు ఎనిమిది వికెట్ల నష్టానికి 155 పరుగులుగా మారింది.

రెండో ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా 60.3 ఓవర్లకు 163కు ఆలౌటైంది. ప్రత్యర్థి ఆస్ట్రేలియాకు 76 పరుగుల టార్గెట్‌ ఇచ్చింది. నయావాల్‌ చెతేశ్వర్‌ పుజారా (59; 142 బంతుల్లో 5x4, 1x6) ఎప్పట్లాగే ఒంటరి పోరాటం చేశాడు. శ్రేయస్‌ అయ్యర్‌ (26; 27 బంతుల్లో 3x4, 2x6) కీలక భాగస్వామ్యంలో పాలు పంచుకొన్నాడు. నేథన్‌ లైయన్‌ (8/64) రెచ్చిపోయాడు.

ఆసీస్‌ ఆలౌటైయ్యాక రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన టీమ్‌ఇండియాకు శుభారంభం దక్కలేదు. జట్టు స్కోరు 15 వద్దే ఓపెనర్ శుభ్‌మన్‌ గిల్ (5; 15 బంతుల్లో) ఔటయ్యాడు.  4.6వ బంతికి నేథన్ లైయన్‌ అతడిని క్లీన్‌బౌల్డ్‌ చేశాడు. సాలిడ్‌గా కనిపించిన రోహిత్‌ శర్మ (12; 33 బంతుల్లో)నూ అతడే వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఈ క్రమంలో చెతేశ్వర్‌ పుజారా, విరాట్‌ కోహ్లీ (13; 26 బంతుల్లో) ఇన్నింగ్స్‌ను గాడిన పెట్టేందుకు ప్రయత్నించారు. కాగా జట్టు స్కోరు 54 వద్ద కింగ్‌ను కునెమన్‌ ఎల్బీగా పెవిలియన్‌ పంపించాడు. చాలాసేపు డిఫెన్స్‌ ఆడిన రవీంద్ర జడేజా (7; 36 బంతుల్లో)ను లైయన్‌ వికెట్ల ముందు దొరకబుచ్చుకోవడంతో శ్రేయస్‌ అయ్యర్‌ క్రీజులోకి వచ్చాడు. 79/4తో భారత్‌ తేనీటి విరామం తీసుకుంది.

కఠిన పరిస్థితుల్లో శ్రేయస్‌, పుజారా ఐదో వికెట్‌కు 39 బంతుల్లో 35 పరుగుల అత్యంత విలువైన భాగస్వామ్యం అందించారు. స్పిన్నర్లపై ఆధిపత్యం చెలాయించేందుకు ప్రయత్నించారు. పిచ్‌ నిర్జీవంగా మారుతుండటంతో వేగంగా ఆడారు. జట్టు స్కోరు 113 వద్ద అయ్యర్‌ను మిచెల్‌ స్టార్క్‌ ఔట్‌ చేశాడు. శ్రీకర్ భరత్‌ (3) కాసేపే ఉన్నాడు. రవిచంద్రన్‌ అశ్విన్‌ (16; 28 బంతుల్లో 2x4)  అండతో పుజారా హాఫ్ సెంచరీ అందుకున్నాడు. ఈ క్రమంలో యాష్‌ను లైయన్‌ ఎల్బీ చేశాడు. 155 వద్ద నయావాల్‌ను లైయన్‌ ఔట్‌ చేశాడు. లెగ్‌సైడ్‌ వెళ్లిన బంతిని స్టీవ్‌స్మిత్‌ అద్భుతంగా అందుకున్నాడు. ఉమేశ్‌ (0) భారీ షాట్‌ ఆడబోయి ఔటయ్యాడు. అక్షర్‌ పటేల్‌ (15 నాటౌట్‌; 39 బంతుల్లో 1x6) సింగిల్స్ నిరాకరిస్తూ పరుగులు చేసేందుకు ప్రయత్నించాడు. అయితే లైయన్‌ వేసిన 60.3వ బంతిని ముందుకొచ్చిన ఆడబోయిన సిరాజ్‌ (0; 7 బంతుల్లో) క్లీన్‌బౌల్డ్‌ అవ్వడంతో టీమ్‌ఇండియా ఇన్నింగ్స్‌ ముగిసింది.

Published at : 02 Mar 2023 10:29 PM (IST) Tags: Steve Smith Cheteshwar Pujara Ind vs Aus India vs Australia Border Gavaskar Trophy Nathan Lyon Indore Test

సంబంధిత కథనాలు

IND Vs AUS 3rd ODI: మూడో వన్డే ఆస్ట్రేలియాదే - 2019 తర్వాత స్వదేశంలో సిరీస్ కోల్పోయిన టీమిండియా!

IND Vs AUS 3rd ODI: మూడో వన్డే ఆస్ట్రేలియాదే - 2019 తర్వాత స్వదేశంలో సిరీస్ కోల్పోయిన టీమిండియా!

IND Vs AUS 3rd ODI: లక్ష్యం దిశగా సాగుతున్న టీమిండియా - మంచి టచ్‌లో కింగ్, కేఎల్!

IND Vs AUS 3rd ODI: లక్ష్యం దిశగా సాగుతున్న టీమిండియా - మంచి టచ్‌లో కింగ్, కేఎల్!

IND Vs AUS 3rd ODI: సమిష్టిగా రాణించిన ఆస్ట్రేలియా బ్యాటర్లు - ఒక్క అర్థ సెంచరీ లేకపోయినా 260కి పైగా!

IND Vs AUS 3rd ODI: సమిష్టిగా రాణించిన ఆస్ట్రేలియా బ్యాటర్లు - ఒక్క అర్థ సెంచరీ లేకపోయినా 260కి పైగా!

IND Vs AUS 3rd ODI: మెల్లగా బ్యాటింగ్ చేస్తున్న ఆస్ట్రేలియా - సగం ఓవర్లు ముగిసేసరికి స్కోరు ఎంతంటే?

IND Vs AUS 3rd ODI: మెల్లగా బ్యాటింగ్ చేస్తున్న ఆస్ట్రేలియా - సగం ఓవర్లు ముగిసేసరికి స్కోరు ఎంతంటే?

IND vs AUS 3rd ODI: మూడో వన్డేలో టాస్‌ ఓడిన టీమ్‌ఇండియా - తొలి బ్యాటింగ్‌ ఎవరిదంటే?

IND vs AUS 3rd ODI: మూడో వన్డేలో టాస్‌ ఓడిన టీమ్‌ఇండియా - తొలి బ్యాటింగ్‌ ఎవరిదంటే?

టాప్ స్టోరీస్

ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్ధం - వైసీపీ హై అలర్ట్

ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్ధం - వైసీపీ హై అలర్ట్

DVV Danayya: రూ.80 కోట్లా? ఆస్కార్స్ ఖర్చుపై స్పందించిన ‘RRR’ నిర్మాత డీవీవీ దానయ్య

DVV Danayya: రూ.80 కోట్లా? ఆస్కార్స్ ఖర్చుపై స్పందించిన ‘RRR’ నిర్మాత డీవీవీ దానయ్య

TSPSC Paper Leak: 'గ్రూప్-1' పేపర్ లీక్ స్కాంలో సిట్ దూకుడు, మరో ముగ్గురిపై ఎఫ్ఐఆర్ నమోదు!

TSPSC Paper Leak: 'గ్రూప్-1' పేపర్ లీక్ స్కాంలో సిట్ దూకుడు, మరో ముగ్గురిపై ఎఫ్ఐఆర్ నమోదు!

Pragya Nagra: ఉగాదికి ఇంత అందంగా ముస్తాబైన ఈ తమిళ బ్యూటీ ఎవరో తెలుసా?

Pragya Nagra: ఉగాదికి ఇంత అందంగా ముస్తాబైన ఈ తమిళ బ్యూటీ ఎవరో తెలుసా?