అన్వేషించండి

Sleep Direction: నిద్రించే దిక్కు మీ జీవితాన్ని మారుస్తుందా? దక్షిణ దిశకు, శనికి ఏంటి సంబంధం?

Shani: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, సరైన దిశలో నిద్రించడం ద్వారా శని దేవుని అనుగ్రహం పొందవచ్చు. ఏ దిశో తెలుసుకోండి...

Sleep Direction:  రోజూ అనుసరించే కొన్ని అలవాట్లను మార్చుకోవడం ద్వారా జీవితంలో మంచి ఫలితాలను పొందవచ్చంటారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు. తప్పు దిశలో నిద్రపోవడం కూడా ఎదుగుదలకు అడ్డంకులు కలిగిస్తుందని చెబుతారు. చాలా మంది దీనిని పట్టించుకోరు కానీ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, మీరు నిద్రించే భంగిమ కూడా మీ కర్మలను మార్చగలదు.

జ్యోతిష్య శాస్త్రంలో శని దేవుడిని న్యాయం, కర్మకు అధిపతిగా పేర్కొన్నారు. ఎప్పుడూ  కఠినంగా పరీక్షిస్తాడు. వాస్తు , జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, దక్షిణ దిశలో తల పెట్టి నిద్రించడం వల్ల వ్యక్తి శక్తి నేరుగా శనితో అనుసంధానించి ఉంటుందట.  

శనికి ఏ దిశ ఇష్టం?

దక్షిణ దిశలో నిద్రించడం వల్ల శని శక్తి మీ మూలాధార చక్రాన్ని స్థిరీకరించడానికి సహాయపడుతుంది.

మీకు ఎటువంటి ప్రతికూల కలలు రావు.

మానసిక శాంతి, క్రమశిక్షణ మరియు వృత్తిపరమైన స్పష్టత పెరుగుతుంది.

శని దోషాల దుష్ప్రభావాల నుండి ఉపశమనం లభిస్తుంది.

ఆధ్యాత్మిక అభివృద్ధి మరియు అంతర్గత పరిపక్వత మేల్కొంటాయి.

ప్రతిరోజూ నిద్రపోయే ముందు 'ఓం శం శనైశ్చరాయ నమః' అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి.
 
మెటల్ బెడ్ పై నిద్రపోవద్దు..చెక్క మంచాన్ని ఉపయోగించండి
 
ఉత్తరం లేదా పడమర దిశలో తల పెట్టి నిద్రించకూడదు 

 
గ్రహాల ప్రకారం ...

ఒక్కో దిశకు ఒక్కో అధిపతి ఉంటాడు.. వారినే అష్టదిక్పాలకులు అని పిలుస్తారు. తూర్పు దిశకు ఇంద్రుడు, ఉత్తర దిశకు కుబేరుడు అధిపతి. అందుకే ఈ దిశల వైపు తలపెట్టి నిద్రపోకూడదు.. మిగిలిన రెండు దిశలవైపు తలపెట్టి నిద్రపోవచ్చు. లేస్తూ తూర్పు దిశ, ఉత్తర దిశను చూసి నమస్కరించాలని చెబుతారు పెద్దలు. దక్షిణ దిశకు యముడు అధిపతి..అందుకే నిద్రలేచేటప్పుడు ఆ దిశను చూస్తూ లేవకూడదు. అంటే ఉత్తరం దిశగా తలపెట్టి నిద్రపోకూడదని చెబుతారు. చనిపోయిన వారిని ఉత్తరంవైపు తలపెట్టి పడుకోబెడతారు.

సైన్స్ ప్రకారం  

మనదేశం ఉత్తరార్ధ గోళంలో ఉండడం  వల్ల అయస్కాంత తరంగాలు  ఉత్తరం వైపు నుంచి పడమర మీదుగా దక్షిణం దిశగా  ప్రయాణిస్తాయి. అందుకే ఉత్తరం వైపు తలపెట్టి  నిద్రపోతే ఆ దిక్కుల్లో ఉన్న అయస్కాంత శక్తి తరంగాలు మెదడులో శక్తిమంతమైన విద్యుత్ తరంగాలను తగ్గించేస్తాయి. దీంతో అనారోగ్య, మానసిక సమస్యలు వస్తాయి..రక్తప్రసరణలో మార్పు వస్తుంది. ఆరోగ్యంగా ఉండేవారు ఈ దిశగా నిద్రిస్తే ప్రమాదం ఉండదు కానీ ఇప్పటికే అనారోగ్యంతో ఉండేవారు ఈ దిశగా నిద్రిస్తే ఆందోళన పెరుగుతుందట. మరీ ముఖ్యంగా ఉత్తర దిశగా తలపెట్టి నిద్రిస్తే తలనొప్పి, గందరగోళం, మెదడులో చురుకుదనం తగ్గడం జరుగుతుందని చెబుతున్నారు నిపుణులు.

గమనిక: జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పినవి,  పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.  సమాచారాన్ని అమలు చేయాలి అనుకున్నప్పుడు మీరు విశ్వశించే పండితుల సలహాలు స్వీకరించడం మంచిది.

తిరుమలలో ఉన్నది రాతి విగ్రహం కాదు.. సజీవంగా నిల్చున్న శ్రీ వేంకటేశ్వరుడు -  తిరుమలలో జరిగే సేవలేంటి? ఏ సేవలో ఏం చేస్తారు? ఏ సేవకు వెళితే మంచిది? ఈ వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More

టాప్ హెడ్ లైన్స్

08-10-2026 గురువారం రాశిఫలం: మకర, కుంభ, మీన రాశుల వారికి ఆర్థిక లాభాలు, అద్భుత అవకాశాలు!
08-10-2026 గురువారం రాశిఫలం: మకర, కుంభ, మీన రాశుల వారికి ఆర్థిక లాభాలు, అద్భుత అవకాశాలు!
08-10-2026 గురువారం తులా, వృశ్చిక, ధనుస్సు రాశుల వారికి కీలక రాశిఫలాలు: మీ భవిష్యత్తు తెలుసుకోండి!
08-10-2026 గురువారం తులా, వృశ్చిక, ధనుస్సు రాశుల వారికి కీలక రాశిఫలాలు: మీ భవిష్యత్తు తెలుసుకోండి!
08-10-2026 గురువారం రాశిఫలాలు: కర్కాటకం, సింహం, కన్య - ఆర్థిక లాభాలు, కుటుంబ ఆనందం!
08-10-2026 గురువారం రాశిఫలాలు: కర్కాటకం, సింహం, కన్య - ఆర్థిక లాభాలు, కుటుంబ ఆనందం!
08-10-2026 గురువారం మేషం, వృషభం, మిథునం రాశిఫలాలు! ఈ రోజు మీ అదృష్టం ఎలా ఉంటుందంటే!
08-10-2026 గురువారం మేషం, వృషభం, మిథునం రాశిఫలాలు! ఈ రోజు మీ అదృష్టం ఎలా ఉంటుందంటే!

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Cabinet Decisions: ప్రధాని మోదీపై అభినందన తీర్మానం.. 12 అజెండా అంశాలకు ఏపీ కేబినెట్‌ ఆమోదం
ప్రధాని మోదీపై అభినందన తీర్మానం.. 12 అజెండా అంశాలకు ఏపీ కేబినెట్‌ ఆమోదం
Delhi Protest: జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. రాహుల్ గాంధీ, ప్రియాంక సహా విపక్ష ఎంపీలు అరెస్ట్
జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. రాహుల్ గాంధీ, ప్రియాంక సహా విపక్ష ఎంపీలు అరెస్ట్
Virt Kohli: ఆశ్రమం సందర్శనకు కోహ్లీ 5 కోట్లు తీసుకున్నాడని ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన క్రికెటర్
ఆశ్రమం సందర్శనకు కోహ్లీ 5 కోట్లు తీసుకున్నాడని ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన క్రికెటర్
RBI బిగ్ షాక్... 2023 తరువాత వడ్డీ రేట్లు పెంచిన రిజర్వ్ బ్యాంక్- మరింత బారం కానున్న EMI
RBI బిగ్ షాక్... 2023 తరువాత వడ్డీ రేట్లు పెంచిన రిజర్వ్ బ్యాంక్- మరింత బారం కానున్న EMI
Chana Dal Coconut Curry : శనగపప్పు పచ్చి కొబ్బరి కూర రెసిపీ.. ఇలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోండి
శనగపప్పు పచ్చి కొబ్బరి కూర రెసిపీ.. ఇలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోండి
Central Minister Rammohan Naidu: విశాఖ దేశానికి గేట్‌వే ఎకానమీ.. ఏపీలో కొత్తగా 6 ఎయిర్‌పోర్టులు - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
విశాఖ దేశానికి గేట్‌వే ఎకానమీ.. ఏపీలో కొత్తగా 6 ఎయిర్‌పోర్టులు - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
Naman Dhir Debut Impact: న‌మ‌న్ రాక‌తో ఆ ప్లేయ‌ర్ కెరీర్‌కు ఎండ్‌కార్డ్..!! అరంగేట్రంలోనే 3 వికెట్లతో ధీర్ ప్రకంపనలు
న‌మ‌న్ రాక‌తో ఆ ప్లేయ‌ర్ కెరీర్‌కు ఎండ్‌కార్డ్..!! అరంగేట్రంలోనే 3 వికెట్లతో ధీర్ ప్రకంపనలు
Telangana Padayatra Politics: 2027లో తెలంగాణలో పాదయాత్రల జోరు - ప్రతీ పార్టీ నుంచి రోడ్డెక్కనున్న కీలక నేతలు - ఇక ఎన్నికల హడావుడే ?
2027లో తెలంగాణలో పాదయాత్రల జోరు - ప్రతీ పార్టీ నుంచి రోడ్డెక్కనున్న కీలక నేతలు - ఇక ఎన్నికల హడావుడే ?
Embed widget